వరద తాకిడి : హర్ష భోగ్లే విచారం | Harsha Bhogle Says Worried For The People In Andhra and Telangana | Sakshi
Sakshi News home page

వరద తాకిడి : హర్ష భోగ్లే విచారం

Published Thu, Oct 15 2020 9:26 AM | Last Updated on Thu, Oct 15 2020 9:26 AM

Harsha Bhogle Says Worried For The People In Andhra and Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తడంతో నెలకొన్న వరద పరిస్థితిపై ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్ష భోగ్లే విచారం వ్యక్తం చేశారు. వరద పరిస్థితిని అధిగమించి ఇరు రాష్ట్రాలు త్వరలోనే కోలుకుంటాయని ఆయన ఆకాంక్షించారు. ఏపీ, తెలంగాణ ప్రజలు ఈ పరిస్థితిని అధిగమించాలని కోరుకుంటున్నానని హర్ష భోగ్లే ట్వీట్‌ చేశారు. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో పలువురు మరణించగా భారీగా ఆస్తి, పంట నష్టం వాటిల్లింది.

హైదరాబాద్‌, విజయవాడ నగరాలు సహా పలు ప్రాంతాలు కుంభవృష్టితో అతలాకుతలమయ్యాయి. పలు కాలనీలు, బస్తీలు నీటమునిగాయి. ఇక వరద తాకిడికి హైదరాబాద్‌ సహా తెలంగాణవ్యాప్తంగా 24 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఏపీలో వరద బీభత్సానికి పది మంది మరణించారు. చదవండి : ధోని కోరిక తీరకపోవచ్చు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement