ఏపీ వరద బాధితులకు గీతా ఆర్ట్స్‌ సాయం.. | Geeta Arts Funding To Andhra Pradesh Flood Victims | Sakshi
Sakshi News home page

Geeta Arts Funding To Andhra Pradesh Flood Victims: ఏపీ వరద బాధితులకు గీతా ఆర్ట్స్‌ సాయం..

Published Wed, Nov 24 2021 8:36 PM | Last Updated on Wed, Nov 24 2021 8:58 PM

Geeta Arts Funding To Andhra Pradesh Flood Victims - Sakshi

Geeta Arts Funding To Andhra Pradesh Flood Victims: సినిమాలు నిర్మిస్తూ డబ్బులు సంపాదించడమే కాదు, అవసరానికి సహాయం కూడా చేస్తారు సినీ నిర్మాతలు. అలాంటి కోవకే చెందినదే ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌. అయితే గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోడానికి పలువురు  తమవంతు సాయం కూడా అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ తిరుపతి వరద బాధితులకు ఆర్థిక సాయం అందించింది. వారికోసం రూ. 10 లక్షలను ఆంధ్రప్రదేశ్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్‌ స్వయంగా ట్విటర్‌లో ప‍్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు తమవంతు సాయం చేస్తున్నట్లు పేర్కొంది. 

ఇలా ఇంతకుముందు 'గీతా ఆర్ట్స్‌2' బ‍్యానర్‌లో వచ్చిన 'గీతా గోవిందం' సినిమా ఫ్రాఫిట్‌ను కేరళ వరద బాధితులకు సహాయంగా అందించారు. మరోవైపు గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన 'గని' చిత్రం ఈ క్రిస్‌మస్‌కి థియేటర్లలో సందడి చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement