Andhra Pradesh Floods
-
వరద బాధితులకు రూ.2 కోట్ల విరాళం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం వ్యాక్సిన్ల తయారీ సంస్థ భారత్ బయోటెక్ రూ. 2 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదలతో అతలాకుతలమైన బాధితులను ఆదుకునేందకు ఇరు రాష్ట్రాల సీఎం వరద సహాయ నిధులకు చెరో రూ.1 కోటి చొప్పున అందిస్తున్నట్లు వెల్లడించింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లంది. భారీ వర్షపాతం విస్తృతంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వరద బాధితుల సహాయార్థం పలు సంస్థలు విరాళాలు అందిస్తున్నాయి. -
అక్కా.. సాయం అందిందా?
వేలేరుపాడు, చింతూరు: ‘చరిత్రలో ఇప్పటి వరకు కన్నాయిగుట్ట గిరిజన గ్రామానికి ఏ ముఖ్యమంత్రీ రాలేదు. మొదటిసారిగా మా అభిమాన నేత కష్టాల్లో ఉన్న మమ్మల్ని పలకరించి మనోధైర్యాన్ని నింపేందుకు కొండలు, కోనలు దాటుకుని వచ్చారు. ఆయన రాకే మాకు కొండంత భరోసా ఇచ్చింది. ఆయన మాట్లాడాక మాలో భయం పోయింది’ అంటూ ఆ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం హెలీప్యాడ్‌కు చేరుకున్నప్పటి నుంచి గ్రామంలో పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే వరకు కాన్వాయి వెంట బారులు తీరి సీఎంతో కరచాలనం చేయడానికి పెద్ద ఎత్తున జనం పోటీపడ్డారు. పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలతో, గ్రామస్తులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. అక్కా.. అన్నా.. సాయం అందిందా.. అంటూ ఆరా తీశారు. ప్రభుత్వ సాయం బాగా అందిందని, అందరూ ముక్తకంఠంతో సమాధానం చెప్పారు. దాదాపు అర కిలోమీటరుకు పైగా సీఎం నడుచుకుంటూ వెళ్లి బాధితులతో మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని నింపారు. నీట మునిగిన ఇళ్లకు రూ.4 వేలు ఉన్న పరిహారాన్ని రూ.10 వేలు చేస్తాం అని చెప్పారు. అనంతరం ఫొటో ఎగ్గిబిషన్‌ను పరిశీలించారు. అక్కడికక్కడే సమస్యల పరిష్కారం చింతూరు మండలం కుయిగూరులో పడిపోయిన ఇంటిని సీఎం తొలుత పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. ముందు వరుసలో కూర్చొన్న ఓ బాలికను ఆప్యాయంగా పిలిచి దీవించడంతో పాటు ప్రసంగం ముగిసే వరకు తన వద్దే నిలబెట్టుకున్నారు. సూరన్నగొందికి చెందిన జానీ అనే యువకుడు తమ గ్రామంలో పాఠశాల నిర్మాణం అసంపూర్తిగా వుందని, దానిని పూర్తి చేయాలని కోరాడు. నాడు–నేడులో పాఠశాలను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి చట్టి గ్రామానికి బస్సులో బయలుదేరిన సీఎం.. మార్గంమధ్యలోని నిమ్మలగూడెం వద్ద బస్సు నుంచి దిగి వారితో మాట్లాడారు. సరోజిని అనే వృద్ధురాలు గత ఆరు నెలలుగా తనకు గొంతు సరిగా పనిచేయక మాట రావడంలేదని చెప్పారు. ఆమెకు వైద్యం చేయించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎనిమిదేళ్ల దివ్యాంగ బాలిక మడకం దుర్గాభవానీకి పింఛను రావట్లేదని తెలపడంతో.. పింఛను వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
CM YS Jagan: పరిహారం అందించాకే..
45.72 కాంటూర్ ప్రాంతంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలంటే రూ.వెయ్యి కోట్లో.. రెండు వేల కోట్లో అయితే మనమే ఇచ్చి ముందుకు అడుగులు వేసి ఉండేవాళ్లం. ఏకంగా ఇంకా రూ.20 వేల కోట్లు కావాలి. ఇంత డబ్బు ఇవ్వడం అనేది రాష్ట్ర స్థాయిలో కాని పని. కేంద్రంపై ఆధారపడాల్సిందే. ఇందుకోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నాం. ఇప్పటికే మనం రూ.2,900 కోట్లు ఇచ్చాం. అవి రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం. కలిసినప్పుడల్లా అడుగుతున్నాం. లేఖల మీద లేఖలు రాస్తూనే ఉన్నాం. ఇకపై మరింత గట్టిగా ప్రయత్నిస్తాం. ఆర్ అండ్ ఆర్ పరిహారాన్ని ఎంత వరకు ఇస్తారో, ఆ స్థాయి వరకే డ్యామ్‌లో నీళ్లు నింపుతాం. అంతకన్నా ఎక్కువ నింపే పరిస్థితి ఉండదని స్పష్టం చేస్తున్నా. - సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు/విశాఖపట్నం: పోలవరం ముంపు ప్రాంతం కాంటూరు లెవల్ 45.72లో ఉన్న వారికి నష్టపరిహారం అందించిన తర్వాతే ప్రాజెక్టులో పూర్తిగా నీళ్లు నింపుతామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆర్ అండ్ ఆర్ (రీహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్) ప్యాకేజ్ నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేస్తున్నామని చెప్పారు. దాదాపు రూ.23 వేల కోట్లు రావాలని, అందుకోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నామన్నారు. ఇందులో మనం ఖర్చు చేసిన నిధుల రీయింబర్స్మెంట్ కోసం పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. గోదావరి వరదల్లో ముంపునకు గురైన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని కుయిగూరు, చట్టి గ్రామాల్లో, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట, తిరుమలాపురంలోని ముంపు ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టులో పూర్తిగా నీళ్లు నింపడానికి డ్యాం భద్రతకు ఇబ్బంది అని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్లూసీ) వారు ఒప్పుకోరన్నారు. ‘మొదట ఒక స్టేజీ వరకు.. ఆ తర్వాత మరికొంత.. మొత్తం మూడేళ్ల సమయానికి పూర్తిగా నింపుతాం. డ్యాం పూర్తిగా నింపే నాటికి ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా మంచి చేస్తాం. ఆలోపుగా కేంద్రం డబ్బులు ఇచ్చేట్టుగా చేస్తాం. నిధులు ఇవ్వకపోతే ప్రాజెక్టులో పూర్తిగా నీళ్లు నింపం. మీరు చేసిన త్యాగంతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్మాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు అన్యాయం జరగనివ్వను’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంత మహిళలతో సీఎం జగన్ ఆర్ అండ్ ఆర్కు రూ.20 వేల కోట్లు అవసరం ► నిర్వాసితులవుతున్న వారందరికీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అంటే 45.72 మీటర్ల స్థాయి వరకు నింపాలంటే కేవలం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకే దాదాపు మరో రూ.20 వేల కోట్ల వరకు ఖర్చవుతుంది. ఈ సెప్టెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల స్థాయి వరకు నిర్వాసితులు ఎవ్వరినీ విడిచిపెట్టకుండా అందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇస్తాం. ► ఈ మేరకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆలస్యమైనా కూడా చేస్తాం. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,900 కోట్లను కేంద్రం చెల్లించాల్సి ఉంది. కానీ ఇక్కడ రివర్స్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా కేంద్రం మనకు డబ్బు ఇస్తే.. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ డబ్బును మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ.2,900 కోట్లు ఖర్చు చేసింది. ► ఆ డబ్బును కేంద్రం నుంచి ఇప్పించుకోవడం కోసం చాలా కష్టపడాల్సి వస్తోంది. స్వయంగా నేను ఈ అంశంపై ప్రధాన మంత్రిని పలుమార్లు కలిశాను. కేంద్ర జల వనరుల శాఖ, ఆర్థిక మంత్రులను రాష్ట్ర మంత్రులు పలు దఫాలు కలిసి విజ్ఞాపనలు చేశారు. ప్రతి నెలా వారికి వినతులు ఇస్తూనే ఉన్నారు. ఆశించినంత రీతిలో వారి నుంచి కదలిక రావడం లేదు. ► కేంద్రంలో ఆ కదలిక వచ్చేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రం నుంచి రావాల్సిన ఆ రూ.2,900 కోట్లు ఆలస్యం అయినా, ఇంకేమైనా జరిగినా సరే.. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల స్థాయి వరకు సంబంధించిన ఆర్ అండ్ ఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్‌లోపు పూర్తి చేస్తాం. అల్లూరి జిల్లాలో వరద సహాయక చర్యలను సీఎంకు వివరిస్తున్న అధికారులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం ► పోలవరం నిర్వాసితులకు సంబంధించి గతంలో నేను ఒక హామీ ఇచ్చాను. నాన్నగారి హయాంలో రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఇచ్చారు. వారికి మరో రూ.3.50 లక్షలు ఇచ్చి మొత్తంగా రూ.5 లక్షలు ఇచ్చి ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటాను. ► గతంలో ఆర్ అండ్ ఆర్ కింద రూ.6.5 లక్షలు ఇచ్చిన వారికి అదనంగా మరో రూ.3.5 లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షలు ఇస్తాం. అవి కూడా ఇచ్చిన తర్వాతే షిఫ్టు చేస్తాం. ఇప్పటికే జీవో కూడా జారీ చేశాం. మీకందరికీ ఇళ్లు కట్టించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే వేగంగా పూర్తి చేస్తుంది. ఇలాంటి మానవత్వం ఉన్న ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వను. అల్లూరి జిల్లాలోని ఈ నాలుగు మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ అడిగారు. దానికి కూడా ఆమోదం తెలుపుతున్నాను. ► పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ 45.72 మీటర్లకు చేరుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే ప్రకటించింది. ఇలా ప్రకటించిన తర్వాత వాళ్లు ఆపగలిగింది ఏమీ ఉండదు. ఇవాళ కాకపోయినా రేపైనా కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇచ్చేది ఈరోజే ఇచ్చేస్తే.. ప్రజలు సంతోషంగా ఉంటారన్న విషయాన్ని వారికి అర్థం అయ్యేలా చెప్తాం. ► ఆర్ అండ్ ఆర్ ఆలస్యం చేసేకొద్దీ కేంద్ర ప్రభుత్వానికే నష్టం అన్న విషయాన్ని వారికి తెలియజేస్తాం. ఆలస్యం అయితే ఆర్అండ్ఆర్ కింద చెల్లించే మొత్తం పెరుగుతూ పోతుంది. 2013 చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ కోసం జారీ చేసే నోటిఫికేష¯న్ జీవితకాలం కేవలం మూడేళ్లు మాత్రమే. ఈ విషయాలన్నీ వారికి వివరించి వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఏలూరు జిల్లాలో సీఎం జగన్‌తో కరచాలనం కోసం యువత ఉత్సాహం -
అధైర్యపడొద్దు.. అండగా నేనున్నా: సీఎం జగన్ రెండో రోజు పర్యటన (ఫొటోలు)
-
వరదలతో నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకుంటాం: సీఎం జగన్
అప్డేట్స్ ముగిసిన సీఎం జగన్ పర్యటన వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటన ముగిసింది. నిన్న కోనసీమ జిల్లాలో పర్యటించిన సీఎం.. నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించారు. వరద బాధితులతో ఆయన నేరుగా మాట్లాడారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యల గురించి నేరుగా వాళ్ల ద్వారానే అడిగి తెలుసుకున్నారు. ► 04:22 PM ముంపు బాధితులకు అండగా ఉంటాం: సీఎం జగన్ తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేశారని ప్రశంసించారు. ఇంత పారదర్శకతతో గతంలో ఎప్పుడూ జరగలేదు. ముంపు బాధితులకు అండగా ఉంటామన్నారు. వరద సహాయ చర్యల్లో అధికార యంత్రాంగం అంతా పాల్గొంది. ఎన్యుమరేషన్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశించామని సీఎం తెలిపారు. వరదలతో నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. ► 04:14 PM ఫొటో గ్యాలరీని పరిశీలించిన సీఎం జగన్ పోలవరం నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. తిరుమలాపురం చేరుకున్న సీఎం.. వరద బాధిత గ్రామాలకు సంబంధించి ఫొటో గ్యాలరీని పరిశీలించారు. తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించనున్నారు. ► 03:18 PM కన్నయ్యగుట్టకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలించనున్నారు. తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులతో సమావేశం కానున్నారు. ► 03:03PM వేలేరుపాడు హెలీప్యాడ్ చేరుకున్న సీఎం జగన్ వేలేరుపాడు హెలీప్యాడ్‌కు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి కన్నయ్యగుట్టకు బయలుదేరనున్నారు. వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలించనున్నారు. తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులతో సమావేశం కానున్నారు. ► 01:45PM పరిహారం ఇచ్చాకే పోలవరం నింపుతాం: సీఎం జగన్ ఇది మీ ప్రభుత్వం. గత ప్రభుత్వం మాదిరి వరద బాధితులను నిర్లక్ష్యంగా వదిలేయదు. మీ కోసం ఎంతైనా చేస్తాం. దగ్గరుండి కలెక్టర్ స్థాయి అధికారులే సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. రేషన్ సకాలంలో అందించాం. నష్టపోయిన చట్టి గ్రామస్తులకు పదివేల రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇస్తున్నా. కేంద్రం నుంచి రావాల్సిన సాయం కోసం పోరాడాల్సి వస్తోంది. స్వయంగా మూడుసార్లు ప్రధానిని కలిసి మాట్లాడా. పోలవరం కోసం మొదట్లో త్యాగాలు చేసిన నిర్వాసితులకు పరిహారం పెంచి ఇస్తామని, సెప్టెంబర్‌లోగా చెల్లించి తీరతామని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్. ► 01:40PM చట్టి గ్రామంలో సీఎం జగన్ పరామర్శ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ► ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయం పోలవరం ముంపు బాధితులకు భరోసా ఇచ్చే క్రమంలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు ముంపు మండలాలతో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి రూ.20 వేల కోట్లు అవసరం. ఆ ప్యాకేజీ కోసం కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నాం. వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో అయితే మేమే ఇచ్చేవాళ్లం. అంత కాబట్టే కేంద్రం సాయం చేయాల్సిందే. పోలవరం పునరావాసం అంతా కేంద్రం చేతుల్లోనే ఉంది. ఆ సాయం కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం. సెప్టెంబర్‌లోగా పోలవరం నిర్వాసితులకు పరిహారం అందేలా చూస్తాం. పూర్తి పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టు నింపుతాం. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయం అని సీఎం జగన్ పేర్కొన్నారు. ►11:40AM పోలవరం నిర్వాసితుల పరిహారం విషయంలో కేంద్రంతో కుస్తీ పడుతూనే ఉన్నామని, కేంద్రం చెల్లించకుంటే రాష్ట్రం తరపున సెప్టెంబర్‌లోగా పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం చెల్లిస్తామని, ఆతర్వాతే ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని సీఎం జగన్.. నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. ►11:35AM పారదర్శకంగా బాధితులకు పరిహారం అందించాం. అందరికీ రేషన్, ఇంటింటికీ రూ. 2 వేలు అందించాం. అధికారులను భాగస్వామ్యం చేసి.. కావాల్సిన వనరులు సమకూర్చాం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అందరికీ సహయం, అన్ని సౌకర్యాలు అందాయని కోయుగూరు వరద బాధితులు తెలిపారు. ►11:25AM వరదలతో నష్టపోయిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని, ప్రతీ ఒక్కరికీ పరిహారం అంది తీరుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. కోయుగూరు గ్రామంలో నిర్వాసితులతో సీఎం జగన్ మాట్లాడారు. ►11:21AM అల్లూరి జిల్లా చింతూరు మండలం కొయుగురు గ్రామంలో వరద బాధితులతో సీఎం జగన్ ముఖాముఖి. ►10:50AM చింతూరు మండలంలో సీఎం జగన్ పర్యటన.. కుయుగూరు గ్రామంలో బాధితులతో ముఖాముఖికి సర్వం సిద్ధం. పరామర్శించి.. వరద సాయం గురించి నేరుగా అడిగి తెలుసుకోనున్న సీఎం. ►10:15AM అల్లూరి జిల్లా చింతూరుకు చేరుకున్న సీఎం జగన్. ► కాసేపట్లో చింతూరుకు చేరుకోనున్న సీఎం జగన్ ► వరద ప్రాంతాల్లో బాధితుల పరామర్శలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోరోజు పర్యటన మొదలైంది. బుధవారం ఉదయం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ నుంచి ఆయన బయలుదేరారు. ► బాధితులకు అందుతున్న సహాయక చర్యల గురించి నేరుగా వాళ్ల ద్వారానే అడిగి తెలుసుకుంటున్నారు ఆయన. ఈ పర్యటనలో బాగంగా.. ఇవాళ (బుధవారం) అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. షెడ్యూల్ ప్రకారం.. ► ముందుగా.. ఉదయం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు చేరుకుంటారు. ► అల్లూరి జిల్లా చింతూరు మండలం కుయుగూరు గ్రామంలో తొలుత పర్యటిస్తారు. ► ఆపై చట్టి గ్రామంలో వరద బాధితులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం కల్లా ఏలూరు జిల్లాకు చేరుకుంటారు సీఎం జగన్. ► వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకుని వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫొటోగ్యాలరీని పరిశీలిస్తారు. ► ఆపై తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశమవుతారు. ► ఆపై వరద ప్రాంతాల పర్యటన ముగించుకుని.. తిరిగి తాడేపల్లికి బయల్దేరుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరదల్లోనూ.. వెలుగుల కోసం.!
సాక్షి, అమరావతి: కరెంటు తీగ నీటిలో పడిందంటే..అటువైపు వెళితే షాక్ కొడుతుందని భయడుతుంటాం..అలాంటిది కిలోమీటర్ల కొలదీ హై టెన్షన్, లో టెన్షన్ అనే తేడా లేకుండా విద్యుత్ తీగలు తెగిపోయి వరదనీటిలో వేలాడుతుంటే..వాటిని సరిచేయడానికి చేసే ప్రయత్నం ఎంత ప్రమాదకరమో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో పడవలపై వెళ్లి లైన్లను సరిచేసేందుకు వందలాది మంది విద్యుత్ శాఖ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో చీకటి అలుముకున్న గ్రామాల్లో వెలుగులు నింపేందుకు ప్రాణాలకు తెగించి రేయింబవళ్లు పనిచేస్తున్నారు. భారీ దెబ్బ.. గోదావరి వరదల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీ ఎల్) పరిధిలోని అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ప్రధానంగా 12 మండలాల్లోని 406 గ్రామాల్లో 70,148 సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 8 సబ్స్టేషన్లు, 33కేవీ ఫీడర్లు 3, 11కేవీ ఫీడర్లు 46 దెబ్బతిన్నాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (టీడీఆర్) 3,964 పాడయ్యాయి. వీటిలో 3 సబ్ స్టేషన్లు, 33కేవీ ఫీడర్లు 3, 11కేవీ ఫీడర్లు 4, టీడీఆర్‌లు 383 బాగుచేశారు. వ్యవసాయ బోర్లు పూర్తిగా నీటమునగడంతో 5,368 సర్వీసులకు విద్యుత్ అందించలేని పరిస్థితి ఏర్పడింది. మిగతా వాటిలో 10,073 సర్వీసులకు అందిస్తున్నారు. 230 ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులు, ఆస్పత్రులు, సెల్ టవర్లకు ఇంకా విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. నిరంతర ప్రయత్నం.. అత్యవసర సర్వీసులకు, వరద బాధితులు పునరావాస కేంద్రాలకు, పలు వసతి గృహాలు, పాఠశాలలకు తాత్కాలిక విద్యుత్ లైన్లు, పవర్ జనరేటర్ల ద్వారా విద్యుత్ అందిస్తున్నారు. ఇక దెబ్బతిన్న వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు ట్రాన్స్ఫార్మర్లు సిద్ధం చేశారు. అవసరమైన కండక్టర్లు, కేబు ళ్లతో సహా 17,280 స్తంభాలను అందుబాటులో ఉంచారు. ప్రతి డివిజన్‌లోనూ 24 గంటలూ అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో జూనియర్ లైన్మెన్ దగ్గర్నుంచి డిస్కం సీఎండీ వరకూ 850 మంది సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. స్వయంగా పర్యవేక్షిస్తున్నాం వరదల వల్ల విద్యుత్ వైర్లు నీటిలో మునిగిపోయాయి. వెంటనే వాటిని సరిచేయాలి. లేదా విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. అలా నిలిపివేయాలన్నా కూడా ఆ ప్రాంతానికి వరద నీటిలోనే వెళ్లాలి. అది చాలా ప్రమాదకరం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎవరూ ప్రాణాలతో మిగలరు. అయినప్పటికీ వెళుతున్నాం. నాతో పాటు కొందరు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయికి పడవలపై వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెంటనే విద్యుత్ సరఫరా చేసేలా ప్రయత్నిస్తున్నాం. – కే సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ ఇదీ చదవండి: CM YS Jagan: 48 గంటల్లో సాయం -
ఏపీ వరద బాధితులకు గీతా ఆర్ట్స్ సాయం..
Geeta Arts Funding To Andhra Pradesh Flood Victims: సినిమాలు నిర్మిస్తూ డబ్బులు సంపాదించడమే కాదు, అవసరానికి సహాయం కూడా చేస్తారు సినీ నిర్మాతలు. అలాంటి కోవకే చెందినదే ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. అయితే గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోడానికి పలువురు తమవంతు సాయం కూడా అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తిరుపతి వరద బాధితులకు ఆర్థిక సాయం అందించింది. వారికోసం రూ. 10 లక్షలను ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ స్వయంగా ట్విటర్లో ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు తమవంతు సాయం చేస్తున్నట్లు పేర్కొంది. We have made a humble donation of Rs 10 lakh to @AndhraPradeshCM relief fund to help with the relief measures in flood-affected areas of #TirupatiRains. — Geetha Arts (@GeethaArts) November 24, 2021 ఇలా ఇంతకుముందు 'గీతా ఆర్ట్స్2' బ్యానర్లో వచ్చిన 'గీతా గోవిందం' సినిమా ఫ్రాఫిట్‌ను కేరళ వరద బాధితులకు సహాయంగా అందించారు. మరోవైపు గీతా ఆర్ట్స్ బ్యానర్లో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'గని' చిత్రం ఈ క్రిస్మస్కి థియేటర్లలో సందడి చేయనుంది. -
ఏపీ వరద నష్టాలపై పరిహారానికి క్లెయిమ్‌లు
ముంబై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద నష్టాలకు సంబంధించి పరిహారం కోరుతూ జనరల్ బీమా కంపెనీలకు క్లెయిమ్ దరఖాస్తుల వెల్లువ మొదలైంది. సెప్టెంబర్ నెల చివర్లో వచ్చిన వరదలకు సంబంధించి సుమారు రూ.300 కోట్ల పరిహారం మేరకు క్లెయిమ్ దరఖాస్తులు రావచ్చని అంచనా వేస్తున్నట్టు ప్రభుత్వ రంగ జనరల్ బీమా కంపెనీల అసోసియేషన్ (జిప్సా) మీడియాకు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో వరదలకు సంబంధించి రూ.15కోట్ల మేర తాము పరిహారం రూపంలో చెల్లించాల్సి రావచ్చని ప్రభుత్వ రంగ అతిపెద్ద జనరల్ బీమా కంపెనీ న్యూఇండియా అస్యూరెన్స్ చైర్మన్ జీ శ్రీనివాసన్ చెప్పారు. పరిహారం వేగంగా చెల్లించేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. పరిహారం చెల్లింపునకు ఎస్బీఐ చర్యలు: ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇప్పటి వరకు పరిహారం కోరుతూ 23 దరఖాస్తులు వచ్చాయి. రూ.2.68 కోట్ల నష్టాలకు సంబంధించిన క్లెయిమ్స్‌ను అందుకున్నామని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ హెడ్ పంకజ్ వర్మ చెప్పారు. వీటిని పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. విపత్తు స్వభావాన్ని అంచనా వేసిన మీదట డాక్యుమెంటేషన్ మార్గదర్శకాలను సులభతరం చేశామని చెప్పారు. పరిహార చెల్లింపును వేగవంతం చేసేందుకు వీలుగా తమ బృందాలు ఇప్పటికే వరద నష్టాల అంచనా సర్వేను పూర్తి చేశాయన్నారు. ప్రత్యేక నైపుణ్య బృం దం, స్వతంత్ర సర్వేయర్లతో కూడిన ప్యానల్‌ను హైదరాబాద్‌లో ఉంచామని పాలసీదారులకు సాయ మందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వర్మ తెలిపారు.