
అప్‌డేట్స్
ముగిసిన సీఎం జగన్ పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన ముగిసింది. నిన్న కోనసీమ జిల్లాలో పర్యటించిన సీఎం.. నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించారు. వరద బాధితులతో ఆయన నేరుగా మాట్లాడారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యల గురించి నేరుగా వాళ్ల ద్వారానే అడిగి తెలుసుకున్నారు.
► 04:22 PM
ముంపు బాధితులకు అండగా ఉంటాం: సీఎం జగన్
తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేశారని ప్రశంసించారు. ఇంత పారదర్శకతతో గతంలో ఎప్పుడూ జరగలేదు. ముంపు బాధితులకు అండగా ఉంటామన్నారు. వరద సహాయ చర్యల్లో అధికార యంత్రాంగం అంతా పాల్గొంది. ఎన్యుమరేషన్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశించామని సీఎం తెలిపారు. వరదలతో నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
► 04:14 PM
ఫొటో గ్యాలరీని పరిశీలించిన సీఎం జగన్
పోలవరం నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. తిరుమలాపురం చేరుకున్న సీఎం.. వరద బాధిత గ్రామాలకు సంబంధించి ఫొటో గ్యాలరీని పరిశీలించారు. తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించనున్నారు.
► 03:18 PM
కన్నయ్యగుట్టకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలించనున్నారు. తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులతో సమావేశం కానున్నారు.
► 03:03PM
వేలేరుపాడు హెలీప్యాడ్ చేరుకున్న సీఎం జగన్
వేలేరుపాడు హెలీప్యాడ్‌కు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి కన్నయ్యగుట్టకు బయలుదేరనున్నారు. వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలించనున్నారు. తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులతో సమావేశం కానున్నారు.
► 01:45PM
పరిహారం ఇచ్చాకే పోలవరం నింపుతాం: సీఎం జగన్
ఇది మీ ప్రభుత్వం. గత ప్రభుత్వం మాదిరి వరద బాధితులను నిర్లక్ష్యంగా వదిలేయదు. మీ కోసం ఎంతైనా చేస్తాం. దగ్గరుండి కలెక్టర్ స్థాయి అధికారులే సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. రేషన్ సకాలంలో అందించాం. నష్టపోయిన చట్టి గ్రామస్తులకు పదివేల రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇస్తున్నా. కేంద్రం నుంచి రావాల్సిన సాయం కోసం పోరాడాల్సి వస్తోంది. స్వయంగా మూడుసార్లు ప్రధానిని కలిసి మాట్లాడా. పోలవరం కోసం మొదట్లో త్యాగాలు చేసిన నిర్వాసితులకు పరిహారం పెంచి ఇస్తామని, సెప్టెంబర్‌లోగా చెల్లించి తీరతామని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్.
► 01:40PM
చట్టి గ్రామంలో సీఎం జగన్ పరామర్శ
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు.
► ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయం
పోలవరం ముంపు బాధితులకు భరోసా ఇచ్చే క్రమంలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు ముంపు మండలాలతో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి రూ.20 వేల కోట్లు అవసరం. ఆ ప్యాకేజీ కోసం కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నాం. వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో అయితే మేమే ఇచ్చేవాళ్లం. అంత కాబట్టే కేంద్రం సాయం చేయాల్సిందే. పోలవరం పునరావాసం అంతా కేంద్రం చేతుల్లోనే ఉంది. ఆ సాయం కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం. సెప్టెంబర్‌లోగా పోలవరం నిర్వాసితులకు పరిహారం అందేలా చూస్తాం. పూర్తి పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టు నింపుతాం. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయం అని సీఎం జగన్ పేర్కొన్నారు.
►11:40AM
పోలవరం నిర్వాసితుల పరిహారం విషయంలో కేంద్రంతో కుస్తీ పడుతూనే ఉన్నామని, కేంద్రం చెల్లించకుంటే రాష్ట్రం తరపున సెప్టెంబర్‌లోగా పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం చెల్లిస్తామని, ఆతర్వాతే ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని సీఎం జగన్.. నిర్వాసితులకు భరోసా ఇచ్చారు.
►11:35AM
పారదర్శకంగా బాధితులకు పరిహారం అందించాం. అందరికీ రేషన్, ఇంటింటికీ రూ. 2 వేలు అందించాం. అధికారులను భాగస్వామ్యం చేసి.. కావాల్సిన వనరులు సమకూర్చాం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అందరికీ సహయం, అన్ని సౌకర్యాలు అందాయని కోయుగూరు వరద బాధితులు తెలిపారు.
►11:25AM
వరదలతో నష్టపోయిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని, ప్రతీ ఒక్కరికీ పరిహారం అంది తీరుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. కోయుగూరు గ్రామంలో నిర్వాసితులతో సీఎం జగన్ మాట్లాడారు.
►11:21AM
అల్లూరి జిల్లా చింతూరు మండలం కొయుగురు గ్రామంలో వరద బాధితులతో సీఎం జగన్ ముఖాముఖి.
►10:50AM
చింతూరు మండలంలో సీఎం జగన్ పర్యటన.. కుయుగూరు గ్రామంలో బాధితులతో ముఖాముఖికి సర్వం సిద్ధం. పరామర్శించి.. వరద సాయం గురించి నేరుగా అడిగి తెలుసుకోనున్న సీఎం.
►10:15AM
అల్లూరి జిల్లా చింతూరుకు చేరుకున్న సీఎం జగన్.
► కాసేపట్లో చింతూరుకు చేరుకోనున్న సీఎం జగన్
► వరద ప్రాంతాల్లో బాధితుల పరామర్శలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండోరోజు పర్యటన మొదలైంది. బుధవారం ఉదయం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ నుంచి ఆయన బయలుదేరారు.
► బాధితులకు అందుతున్న సహాయక చర్యల గురించి నేరుగా వాళ్ల ద్వారానే అడిగి తెలుసుకుంటున్నారు ఆయన. ఈ పర్యటనలో బాగంగా.. ఇవాళ (బుధవారం) అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు.
షెడ్యూల్ ప్రకారం..
► ముందుగా.. ఉదయం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు చేరుకుంటారు.
► అల్లూరి జిల్లా చింతూరు మండలం కుయుగూరు గ్రామంలో తొలుత పర్యటిస్తారు.
► ఆపై చట్టి గ్రామంలో వరద బాధితులతో సమావేశమవుతారు.
మధ్యాహ్నం కల్లా ఏలూరు జిల్లాకు చేరుకుంటారు సీఎం జగన్.
► వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకుని వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫొటోగ్యాలరీని పరిశీలిస్తారు.
► ఆపై తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశమవుతారు.
► ఆపై వరద ప్రాంతాల పర్యటన ముగించుకుని.. తిరిగి తాడేపల్లికి బయల్దేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment