వరద బాధితులకు రూ.2 కోట్ల విరాళం | Bharat Biotech Donates Rs 2 Crore to CM Flood Relief Fund | Sakshi
Sakshi News home page

వరద బాధితులకు రూ.2 కోట్ల విరాళం

Published Fri, Sep 6 2024 3:35 PM | Last Updated on Fri, Sep 6 2024 3:49 PM

Bharat Biotech Donates Rs 2 Crore to CM Flood Relief Fund

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం వ్యాక్సిన్‌ల తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ రూ. 2 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదలతో అతలాకుతలమైన బాధితులను ఆదుకునేందకు ఇరు రాష్ట్రాల సీఎం వరద సహాయ నిధులకు చెరో రూ.1 కోటి చొప్పున అందిస్తున్నట్లు వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టంతో పాటు  ప్రాణ నష్టం వాటిల్లంది. భారీ వర్షపాతం విస్తృతంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వరద బాధితుల సహాయార్థం పలు సంస్థలు విరాళాలు అందిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement