పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ సిద్ధమవుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరగనున్న ఈ ఎన్నికల పోరుకు అన్ని పార్టీలు వ్యూహరచనల్లో తలమునకలయ్యాయి. ఎవరికివారే ఎదుటువారిని దెబ్బకొట్టేలా ఎత్తుగడలు వేస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరిగింది.
కాగా జమ్ముకశ్మీర్‌లో కమలం వికసించేలా బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తర్వాత తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ నుంచి ఎన్నికల సందడి చేస్తున్నారు. నేడు(శనివారం) ఉదయం 11 గంటలకు దోడాలో జరిగే ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు జమ్ములో అధికారులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఎన్నికల ర్యాలీ శాంతియుతంగా, సజావుగా జరిగేందుకు దోడా, కిష్త్వార్ జిల్లాల వ్యాప్తంగా బహుళ అంచెల భద్రతను మోహరించారు. అయితే గత 42 ఏళ్లలో దోడాలో ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1982లో దోడాలో ప్రధానమంత్రి పర్యటించారు.
Comments
Please login to add a commentAdd a comment