
విద్యార్థులు బాగోగులు చూసుకోండి: మోదీ
జమ్ముకశ్మీర్‌లో విద్యార్థులు జాగ్రత్త అని ప్రధాని నరేంద్రమోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి చెప్పారు. వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో విద్యార్థులు జాగ్రత్త అని ప్రధాని నరేంద్రమోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి చెప్పారు. వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఇటీవల వారికి వ్యతిరేకంగా పలు సంఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మోదీ ఈ సూచనలు చేశారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సోమవారం ముఫ్తీ, మోదీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చించుకున్నారు.
ముఖ్యంగా విద్యార్థులు, యువతకు సంబంధించిన అంశాలనే ఎక్కువగా ప్రస్తావించారు. విద్యార్థుల మనోభీష్టాలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని, వారి అభిరుచులు ఆసక్తులపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని కోరారు. గత వారం ఆరుగురు కశ్మీర్ విద్యార్థులపై రాజస్థాన్‌లోని మేవాడ్ యూనివర్సిటీలో దాడి జరిగిన నేపథ్యంలో విద్యార్థుల అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.