ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించండి | Allow for government formation | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించండి

Published Sun, Mar 27 2016 2:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించండి - Sakshi

ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించండి

కశ్మీర్ గవర్నర్‌కు పీడీపీ-బీజేపీ కూటమి లేఖలు
 
 జమ్మూ: జమ్మూ కశ్మీర్లో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు తాము సిద్ధమని పీడీపీ-బీజేపీ పార్టీలు శనివారం రాష్ట్ర గవర్నర్‌కు తెలిపాయి. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ గవ ర్నర్ ఎన్‌ఎన్ వోహ్రాను కలసి లేఖను సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునిస్తూ బీజేపీ కూడా ఆయనకు లేఖను అందించింది. అనంతరం మెహబూబా విలేకరులతో మాట్లాడుతూ బేషరతుగా మద్దతిచ్చిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వం  శాంతి, సామరస్యం, అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుందన్నారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడన్న అంశంపై ఇరు పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ ప్రమాణస్వీకారం చేయనుండగా, డిప్యూటీ సీఎంగా  నిర్మల్‌సింగ్ వ్యవహరిస్తారు. పీడీపీ-బీజేపీ సంకీర్ణ కూటమి కలసికట్టుగా ముందుకు సాగుతుందని, ప్రమాణస్వీకార తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. మెహబూబా తండ్రి ముఫ్తీ మహమూద్ సయీద్ మరణానంతరం ఈ ఏడాది జనవరి 8న  రాష్ట్రంలో గవర్నర్ పాలన ను విధించారు.   

 ఎలాంటి విభేదాలూ లేవు: నయీమ్ అక్తర్
 కేబినెట్ పదవుల పంపకంలో బీజేపీతో ఎలాంటి అభిప్రాయభేదాలూ లేవని పీడీపీ అధికార ప్రతినిధి నయీమ్ అక్తర్ తెలిపారు. మంత్రి పదవులపై విభేదాల వార్తలు పూర్తిగా నిరాధారమని ఆయన కొట్టివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement