శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ అనూహ్యంగా ఓడిపోయారు. ఆమె దక్షిణ కశీ్మర్‌లోని బిజ్‌బెహరా స్థానం నుంచి పోటీచేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి బషీర్ అహ్మద్ వీరీ చేతిలో పరాజయం చవిచూశారు. తన ఓటమిపై ఇల్తిజా ముఫ్తీ మంగళవారం స్పందించారు. బీజేపీతో గతంలో పీడీపీ పొత్తు పెట్టుకోవడం ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు.
తన పరాజయానికి బీజేపీతో అప్పటి స్నేహం కారణం కాదని స్పష్టంచేశారు. తాను ఆశించిన ఫలితం రాలేదని, ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలు నిర్ణయించుకున్నారని, అందుకే ఆ పార్టీకి ఓటు వేశారని తెలిపారు. తమ నాయకులు, కార్యకర్తలు చాలామంది పీడీపీకి దూరమయ్యారని, దీనివల్ల పార్టీ కొంత బలహీన పడిందని అంగీకరించారు.
బిజ్‌బెహరా నుంచి గెలిచే అవకాశం తక్కువగా ఉందని తెలిసినప్పటికీ రిస్క్ చేశానని ఇల్తిజా ముఫ్తీ వ్యాఖ్యానించారు. రిస్క్ చేసినప్పటికీ తగిన ఫలితం రాలేదన్నారు. సురక్షితమైన నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే గొప్పేం ఉంటుందని ప్రశ్నించారు. పరాజయం ఎదురైనా కుంగిపోనని, పోరాటం సాగిస్తూనే ఉంటానని తేలి్చచెప్పారు. ఐదేళ్ల తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానో లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment