జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సీఎం మెహబూబాఫ్తీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నేతృత్వంలోని జమ్మకశ్మీర్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సుహైల్ బుఖారీ మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. తాను పీడీపీ నుంచి వైదొలిగినట్లు సుహైల్ బుఖారీ వెల్లడించారు. అందుకు గల కారణాలను ఆయన వివరించలేదు.
అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సుహైల్ బుఖారీకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగూరా-క్రీరీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ఆశించారు, అయితే గత నెలలో మాజీ మంత్రి బషారత్ బుఖారీ తిరిగి పీడీపీలోకి రావడంతో ఆయనకు వాగూరా-క్రిరీ టికెటు ఇచ్చే వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సుహైల్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
జర్నలిస్టు అయిన సుహైల్ బుఖారీ.. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి ఆయన సన్నిహితుడు. ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు సలహాదారుగా కూడా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment