గవర్నర్‌ను కలిసిన మెహబూబా
దాదాపు రెండు నెలలుగా జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో పరిపాలనపై కొనసాగుతున్న సందిగ్ధత కొంతవరకు వీడే సూచనలు కనిపిస్తున్నాయి. పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ శుక్రవారం నాడు ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రాను కలిశారు.
ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి గవర్నర్‌తో చర్చించారని పీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు విషయంలో స్పష్టత వచ్చిందా.. లేదా అనే విషయం మాత్రం తెలియరాలేదు. గవర్నర్‌ను కలిసి వచ్చిన తర్వాత మెహబూబా ముఫ్తీ మీడియాకు కూడా ఏమీ చెప్పలేదు.