మెహబూబా ముఫ్తీ
జమ్మూ: కాంగ్రెస్ లేని రాజకీయ కూటమి లేదా థర్డ్ ఫ్రంట్‌తో బీజేపీని ఓడించడం సాధ్యంకాదని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. దేశ మౌలిక పునాదులను బీజేపీ పెకిలించివేస్తోందని ఆమె మంగళవారం దుయ్యబట్టారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరపడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమన్నారు. బీజేపీ ఎన్నికలు జరిపించడం ద్వారా కశ్మీర్ ప్రజలకు ఏదో మేలు చేస్తున్నంత భావనలో ఉందన్నారు.
దేశాన్ని నిర్మించడంలో 70ఏళ్లపాటు కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందని, దేశంలో ఆ పార్టీకి మినహా ప్రత్యామ్నాయం లేదని ముఫ్తీ అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్న తెలంగాణ సీఎం మాటలపై ఆమె స్పందించారు. కాంగ్రెస్ లేని ఏ కూటమి బీజేపీతో యుద్ధం చేయలేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన తరుణం వచ్చిందని ముఫ్తీ చెప్పారు. దేశ లౌకిక రూపును మార్చి ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేయాలని మోదీ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు.
చదవండి: న్యూడెమోక్రసీలో చీలిక.. ప్రజాపంథా పార్టీ ఆవిర్భావం
Comments
Please login to add a commentAdd a comment