అనంతనాగ్ లో ముఫ్తీ గెలుపు
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అనంతనాగ్ ఉప ఎన్నికలలో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి హిలాల్ అహ్మద్ షాపై ఆమె 11,550 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలైన మెహబూబా ముఫ్తీకి 17వేల ఓట‍్లు పోల్ కాగా, ఆమె ప్రత్యర్థి షాకు కేవలం 5,589 ఓట్లు వచ్చాయి.