anantnag bypoll
-
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ముఫ్తీ
శ్రీనగర్ : పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ కవీంద్ర గుప్తా ...ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నెల 25న జరిగిన అనంత నాగ్ ఉప ఎన్నికల్లో ఆమె విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఫ్తీ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి హిలాల్ అహ్మద్ షాపై 12,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి, ముఫ్తీ తండ్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ మృతితో అనంతనాగ్లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మెహబూబా ముఫ్తీ ఈ ఏడాది ఏప్రిల్లో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం అనంతనాగ్ లోక్ సభ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. దాంతో లోక్ సభ నియోజకవర్గంలో తాజాగా ఎన్నికలు జరగనున్నాయి. -
అనంతనాగ్ లో ముఫ్తీ గెలుపు
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అనంతనాగ్ ఉప ఎన్నికలలో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి హిలాల్ అహ్మద్ షాపై ఆమె 11,550 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలైన మెహబూబా ముఫ్తీకి 17వేల ఓట్లు పోల్ కాగా, ఆమె ప్రత్యర్థి షాకు కేవలం 5,589 ఓట్లు వచ్చాయి. -
దూసుకుపోతున్న ముఖ్యమంత్రి
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అనంతనాగ్ ఉప ఎన్నికలలో దూసుకుపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక్కడ పీడీపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం ప్రారంభమైంది. ముందునుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్న ముఖ్యమంత్రి.. ఐదోరౌండు ముగిసేసరికి 6వేల ఓట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఇంతకుముందు ఇక్కడ పోటీ చేసిన దివంగత సీఎం ముఫ్తీమహ్మద్ సయీద్కు 6వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. అయితే, ఈసారి వేర్పాటువాదులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం, ఇటీవలి కాలంలో పదే పదే పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలు ఎగరడం లాంటి ఘటనలతో ఒకింత ఆందోళన నెలకొంది. అలాగే ఓట్ల లెక్కింపు సమయంలో కూడా కొంతమేర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొన్ని ఈవీఎంలకు సీల్ లేదని కాంగ్రెస్ అభ్యర్థి ఆందోళన చేయడం, లోయలోని కొన్ని ప్రాంతాల్లో వేర్పాటువాదులు ఐఎస్ఐఎస్ జెండాలు ఎగరేయడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.