శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మఖ్యమంత్రిగా పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ(56) బాధ్యతలను స్వీకరించే కార్యక్రమం ప్రస్తుతానికి వాయిదా పడింది. గురువారం కన్నుమూసిన ముఖ్యమంత్రి, ఆమె తండ్రి మొహమ్మద్ సయీద్ నాలుగవ రోజు కర్మకాండ (చౌహరం) కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలు జనవరి 10 ఆదివారం నిర్వహించునున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అప్పటివరకు అధికారిక వ్యవహారాల్లో పాల్గొనడానికి ఆమె విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర గవర్నర్ ఎన్ ఎన్ వోరా అధికారిక వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు గవర్నర్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలో ప్రస్తుతం ముఫ్తీ కుటుంబం ఉందని, ఇపుడు ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడలేమని పీడీపీ పార్టీ సీనియర్ నేత తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలను తాత్కాలికంగా గవర్నర్ ఎన్ ఎన్ వోరా నిర్వహిస్తారని చెప్పారు. రాజ్యాంగ పరంగా ఎదురయ్యే ఇబ్బందులను మెహబూబా ముఫ్తీ దృష్టికి తీసుకెళ్లినపుడు వాటిని కూడా ఆమె తోసి పుచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఏడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేయాలని పెద్దలు ఆమెకు సూచించారు.
కాగా రాష్ట్ర సీఎం ముప్తీ మహమ్మద్ సయూద్ నిన్న అనారోగ్యంతో కన్నమూయడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఆయన కుమార్తె, అనంతనాగ్ ఎంపీ, మెహబూబా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు బీజేపీ- పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
తాత్కాలింగా గవర్నర్ రూల్
Published Fri, Jan 8 2016 4:32 PM | Last Updated on Mon, Jul 29 2019 6:59 PM
Advertisement