
గవర్నర్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్‌తో ఆదివారం సమావేశమయ్యారు. శాషనసభలో బీజేపీ ఎమ్మెల్యేలను సస్సెండ్ చేయడంపై గవర్నర్‌కు ఫిర్యదు చేశారు. దీనిపై స్పందించిన గవర్నర్ స్పీకర్ మధుసూధనాచారితో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. కేవలం ఏడు నిమిషాల్లోనే బిల్లును ఆమెదించారని తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లడుతూ భూసేకరణ బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రైతుల జీవితాల్ని నిర్ణయించే భూసేకరణ బిల్లును ఏడు నిమిశాల్లో ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త సంప్రదాయాలను తీసుకొస్తోందని బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు.