శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా గృహనిర్బంధం నుంచి ఎట్టకేలకు విడుదల కానున్నారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ పాలనా యంత్రాంగ శుక్రవారం ఫరూక్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. కశ్మీర్‌ను స్వయం ప్రత్తిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు, కశ్మీర్ విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం అతన్ని నిర్బంధించిన విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ నుంచి (ఏడు నెలలుగా) ఆయన నిర్బంధం కొనసాగుతోంది.
83 ఏళ్ల ఫరూక్‌తో పాటు ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ ముఫ్తీ మహ్మద్‌లను నిర్బంధం నుంచి విడుదల చేయాలని కోరుతూ ప్రతిపక్షాలు గతకొంత కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభల్లోనూ విపక్ష సభ్యులు లేవనెత్తారు. ఈ మేరకు స్పీకర్‌కు లేఖను కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ఫరూక్‌ను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు అక్కడి అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీల నిర్బంధం మాత్రం ఇంకా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment