నేడు మెహబూబా ప్రమాణ స్వీకారం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ పదమూడో ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పీడీపీ అధ్యక్షురాలు, దివంగత సీఎం ముఫ్తీ మొహహ్మద్ సయీద్ కుమార్తె అయిన 56 ఏళ్ల మెహబూబా.. రాష్ట్రంలో తొలి మహిళా సీఎంగా, దేశంలో తొలి ముస్లిం మహిళా సీఎంగా చరిత్ర సృష్టించనున్నారు. బీజేపీ మద్దతుతో సీఎం పీఠం అధిరోహించనున్న ఆమెతో గవర్నర్ వోహ్రా రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయిస్తారు.