
సాక్షి, శ్రీనగర్ : ఉగ్రవాదుల ఇళ్లను, కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవద్దని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భద్రతాదళాలను ఆదేశించారు. పీడీపీ మాజీ సర్పంచ్‌ను మిలిటెంట్లు మత్య చేయడంతో.. భద్రతా బలగాలు దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సీఎం మెహబూబాబ ముఫ్తీ.. మానిగామ్ పోలిస్ ట్రైనింగ్ స్కూల్ పాసింగ్ పెరేడ్‌లో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. ఉగ్రవాదులు.. భద్రతా బలగాలను చంపి.. వారి ఇళ్లను తగలబెట్టిన ఘటనలు ఈ మధ్య అక్కడక్కడా జరిగాయి. ఇదే విధంగా భద్రతా బలగాలు సైతం.. వ్యవహరిస్తే.. మనకు వారికి తేడా ఏముంటుంది అని అన్నారు.
గత వారం షోపియాన్ ప్రాంతంలోని ఉగ్రవాదుల ఇళ్లలో భద్రతా బలగాలు సోదాలు జరిపాయి. సోదాల అనంతరం కొందరు ఉగ్రవాదులు.. అధికార పీడీపీ, ప్రతిపక్ష నేషనల్ కాన్ఫెరెన్స్ నేతలను బెదిరించినట్లుతెలిసింది. ఇటువంటివ ఇమరోసారి జరిగితే.. మా టార్గెట్ మీరు అవుతారని ఉగ్రవాదులు.. నేతలను హెచ్చరించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment