కశ్మీర్ అట్టుడుకుతోంది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భద్రతా దళాలు హతమార్చడంతో చెలరేగిన అల్లర్లు మరింత పెచ్చరిల్లాయి. తాజా అల్లర్లలో ఒక పోలీసు సహా ఆరుగురు చనిపోయారు. శనివారం నాటి అల్లర్లలో గాయపడి చికిత్స పొందుతున్న నలుగురు ఆస్పత్రిలో ఆదివారం ప్రాణాలు విడిచారు.