Curfew restrictions
-
పంజాబ్‌లో టెన్షన్.. టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్
Patiala Clashes Punjab: పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాటియాలలో శివసేన కార్యకర్తలకు, ఖలిస్థాన్ మద్దతుదారులకు మధ్య శుక్రవారం ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాళీ మాత ఆలయం వెలుపల ఇరువర్గాల సభ్యులు కత్తులు ఊపుతూ ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతల విషయంలో వైఫల్యం చెందడంతో ప్రభుత్వం రాష్ట్ర పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంది. హింసను నియంత్రించడంలో విఫలమైనందుకు డిపార్ట్మెంట్లోని ముగ్గురు ఉన్నతాధికారులను భగవంత్ మాన్ సర్కార్ తొలగించింది. పాటియాలా రేంజ్ ఐజి, పాటియాలా ఎస్ఎస్పీ, ఎస్పీలను ఆ పదవి నుండి బదిలీ చేశారు. पटियाला में आज सुबह 9:30 से शाम 6 बजे तक मोबाइल इंटरनेट सेवाएं अस्थायी रूप से निलंबित किया गया: गृह विभाग, पंजाब सरकार | #Patiala | #PatialaViolence | #PatialaRiots | #Panjab | pic.twitter.com/KEFsOoi62j — IBC24 News (@IBC24News) April 30, 2022 ఇదిలా ఉండగా.. ఘర్షణల కారణంగా శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాజియాలా జిల్లాలో శనివారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాయిస్ కాల్స్ మినహా మొబైల్ ఇంటర్నెట్, SMS సేవలను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఇప్పటికే నగరంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. #Patiala pic.twitter.com/0XgntqTEcG — Jitender Sharma (@capt_ivane) April 29, 2022 ఇది కూడా చదవండి: భారత్‌లో కరోనా.. అంతకంతకు పెరుగుతున్న కేసులు -
ఎల్లుండి నుంచి రాష్ట్రమంతా.. ఒకేలా ఆంక్షలు
ఉపాధ్యాయులందరికీ టీకాలు పాఠశాలలు తెరిచేముందు టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల టీచర్లందరికీ టీకాలు ఇవ్వాలి. వ్యాక్సిన్ అందుబాటును బట్టి డిగ్రీ విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేపట్టాలి. ఆయా కాలేజీల్లోనే క్యాంపులు ఏర్పాటు చేసి టీకాలు ఇవ్వాలి. సీజనల్ వ్యాధులపై జాగ్రత్త వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. కోవిడేతర వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఔషధాలు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచాలి. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 15 నుంచి అన్ని జిల్లాల్లో ఒకేలాగా మాదిరిగా కోవిడ్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దుకాణాల్లో సిబ్బంది నుంచి వినియోగదారుల వరకూ అంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందేనని, ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాల యజమానులకు భారీ జరిమానా విధించాలని స్పష్టం చేశారు. అవసరమైతే రెండు మూడు రోజులు దుకాణాల మూసివేతకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించకుండా ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఎవరైనా ఫొటోలు తీసి పంపినా జరిమానాలు విధించాలని, దీనికోసం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ కేటాయించాలని సూచించారు. మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్కు ధరించకుంటే రూ.100 జరిమానాను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ‘కోవిడ్ తగ్గుతోంది.. తగ్గింది మళ్లీ పెరగకుండా ఉండాలంటే అందరికీ వ్యాక్సినేషన్ తప్పనిసరి. అది పూర్తయ్యేవరకు ఈ నిబంధనలన్నీ తప్పనిసరిగా అనుసరించాలి’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ముఖ్యాంశాలు ఇవీ.. అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేటి నుంచి అంతటా ఒకేలా సడలింపులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకేలాగా కర్ఫ్యూ సడలింపులు అమలు చేయాలి. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలించాలి. కర్ఫ్యూ సడలింపు సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కఠినంగా 144 సెక్షన్ అమలు చేయాలి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకూ కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలు కావాలి. రాత్రి 9 గంటల తరువాత దుకాణాలన్నీ మూసివేయాలి. 5 % లోపు ఉన్నందువల్లే సడలింపులు.. పాజిటివిటీ రేటు 5 శాతం లోపు ఉన్నందువల్లే సడలింపులు కల్పించాం. అయితే కోవిడ్ నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలి. ప్రజలు గుమిగూడకుండా ఆంక్షలు విధించాలి. మార్కెట్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఫోకస్డ్గా పరీక్షలు ఫీవర్ సర్వే అనంతరం ఫోకస్డ్గా టెస్టులు చేయాలి. జ్వరం, ఇతర లక్షణాలున్న వారికి పరీక్షలు చేసి తగిన మందులు అందించాలి. కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలి. కోవిడేతర వ్యాధుల పట్ల జాగ్రత్తలు.. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. కోవిడేతర వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. పీహెచ్‌సీల వారీగా సమీక్ష చేసి తగిన చర్యలు చేపట్టాలి. మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల్లో ఎక్కువగా పాము కాట్లు బారిన పడే ప్రమాదం ఉన్నందున ఇంజక్షన్లు సిద్ధంగా ఉంచాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగ్యూ లాంటి వ్యాధులు వర్షాకాలంలో ప్రబలే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన ఔషధాలు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచాలి. ఆ మందులు కూడా డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలతో ఉండాలి. నాడు – నేడుపై దృష్టి పెట్టాలి.. వైద్యశాఖలో నాడు – నేడులో భాగంగా పీహెచ్‌సీల వరకు కాంపౌండ్ వాల్ల నిర్మాణం చేపట్టాలి. పనులపై పూర్తి స్ధాయిలో దృష్టి సారించాలి. పెండింగ్ పనులపై ధ్యాస పెట్టాలి. థర్డ్ వేవ్ సన్నద్ధత.. థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. పిల్లల వైద్యుల నియామకం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సన్నద్ధతపై పూర్తి స్థాయిలో సమీక్షించాలి. మందులు కూడా సిద్ధంగా ఉండాలి. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, 104 కాల్ సెంటర్ ఇన్చార్జి ఏ.బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఏ. మల్లిఖార్జున, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, హెల్త్ యూనివర్సిటీ వీసీ శ్యామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆక్సిజన్ ప్లాంట్లపై.. రాష్ట్రవ్యాప్తంగా 97 చోట్ల 134 పీఎస్ఎ ప్లాంట్ల (ఆక్సిజన్ ప్లాంట్లు) ఏర్పాటుకు సంబంధించి సమీక్ష సందర్భంగా అధికారులు వివరాలను అందచేశారు. ఆగస్టు నెలాఖరునాటికి పూర్తి కానున్నట్లు తెలిపారు. 50 పడకలు దాటిన ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుపై పురోగతిని సీఎం జగన్ తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత ప్రైవేట్ ఆస్పత్రులకు ఈమేరకు ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనిపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సీఎం ఆదేశించారు. గర్భిణిలకు వ్యాక్సినేషన్ ప్రారంభించినట్లు ఈ సందర్భంగా అధికారులు చెప్పారు. ఉభయ గోదావరికి ఊరట అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేయనుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటిదాకా ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపు అమల్లో ఉంది. గురువారం నుంచి ఉభయ గోదావరితో పాటు అన్ని జిల్లాల్లో ఒకే మాదిరిగా ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు అమల్లోకి రానుంది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకూ అన్ని జిల్లాల్లో ఒకేలాగా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. -
కరోనా నిబంధనలు బ్రేక్.. కుక్క అరెస్టు
ఇండోర్: చట్టం ముందు అందరూ సమానమే అని ఓ నిబంధన మన రాజ్యాంగంలో ఉంది. ఇండోర్ పోలీసులు ఈ నిబంధనను తూచా తప్పకుండా పాటించారు. ఎలా అంటారా ? కరోనా నిబంధనలు పాటించలేదని యజమానితో పాటు ఉన్న కుక్కను కూడా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో విలయతాండవం చేస్తోంది. దీంతో వైరస్ కట్టడికి ఇప్పటికే రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకురాగా.. పలు రాష్ట్రాలు లాక్డౌన్ కూడా విధించాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సైతం నైట్‌కర్ఫ్యూను అమలు చేస్తోంది. రాష్ట్రంలో కరోనా నిబంధనలు అమలులో ఉండగా ఇండోర్‌లోని పలాసియా ప్రాంతంలో ఓ వ్యాపారవేత్త తన పెంపుడు కుక్కను తీసుకొని బయటకు తీసుకువచ్చాడు. అదే సమయంలో కర్ఫ్యూను అమలు చేసేందుకు పోలీస్ బృందం పెట్రోలింగ్ వచ్చారు. ఆ బృందానికి ఈ వ్యక్తి కుక్కతో బయట తిరగడం కనిపించింది. ఇంకేముంది యజమానినే గాక కుక్కని కూడా అదుపులోకి తీసుకొని జైలుకు పంపారు. అయితే.. కుక్క అరెస్టుపై జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ అరెస్టు సోషల్ మీడియాల్లో సంచలనంగా మారింది. ( చదవండి: వైరల్: ఈ కుక్కకి రోడ్ల పై చెత్త వేస్తే నచ్చదు.. ) -
ముంబై, కర్ణాటకల్లో రాత్రి కర్ఫ్యూ
న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు/ముంబై: కొత్త తరహా కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో పలు రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించాయి. ముంబైలో మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రాగా, నేటి(డిసెంబర్ 24) నుంచి జనవరి 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు కర్నాటక ప్రకటించింది. అయితే, డిసెంబర్ 24 అర్ధరాత్రి నిర్వహించే ‘మిడ్నైట్ మాస్’ ప్రార్థనలకు మినహాయింపునిస్తున్నట్లు పేర్కొంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నామని, ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని ముంబై నగర పోలీసులు తెలిపారు. బార్లు, పబ్‌లపై కూడా రాత్రి 11 గంటల తరువాత తెరిచి ఉంచకుండా ఆంక్షలు విధించామన్నారు. ముంబైతో పాటు అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 11 మందికి పాజిటివ్ లండన్ నుంచి ఢిల్లీకి నాలుగు విమానాల్లో వచ్చిన ప్రయాణికుల్లో 11 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తంగా 50 మంది ప్రయాణీకులను ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపించారు. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను గుజరాత్ ప్రభుత్వం ఆదేశించింది. క్రిస్మమస్, నూతన సంవత్సర వేడుకలను బృందాలుగా జరుపుకోవడంపై ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా అధికారులు నిషేధం విధించారు. బార్లు, రెస్టారెంట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఈ ఉత్సవాలను నిషేధించినట్లు ప్రకటించారు. డెహ్రాడూన్, ముస్సోరి, రిషికేష్‌ల్లో ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. -
రాళ్ల దాడి, 144 సెక్షన్ అమలు
షిల్లాంగ్: మత ఘర్షణలు చెలరేగొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం పోలీసులు కర్ఫ్యూ విధించారు. తమ మతానికి చెందిన పిల్లలపై దాడి చేశారంటూ మరో మతానికి చెందినవారు నిరసనలకు దిగడంతో.. షిల్లాంగ్ నగరంలో వాణిజ్య కేంద్రమైన మోట్‌ఫ్రాన్ ఉద్రిక్తలకు కేంద్రంగా మారింది. గురువారం రాత్రి నుంచి అక్కడ పరిస్థితులు అదుపు తప్పాయి. వివరాలు.. గురువారం ఉదయం తన పిల్లలపై ఏ కారణం లేకుండా ఒక వర్గానికి చెందిన మహిళ దాడి చేసిందని ఓ బస్ డ్రైవర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల చొరవతో ఆ గొడవ సామరస్యంగా సద్దుమణిగింది. కానీ, తన కొడుకును అకారణంగా గాయపరిచిన వారిపై ప్రతీకారం తీర్చుకొనేందుకు బాధితుని తండ్రి సిద్ధమయ్యాడు. ఇరుగు పొరుగు వారిని, సహోద్యోగులను మతం పేరుతో రెచ్చగొట్టి గురువారం రాత్రి మోట్‌ఫ్రాన్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి, పాత్రికేయుడు, మరి కొంతమంది గాయపడ్డారు. ఈ ఘర్షణ శుక్రవారం ఉదయం వరకూ కొనసాగింది. పరిస్థితి అదుపు తప్పి మత ఘర్షణలకు దారి తీయొచ్చని భావించిన ఖాసీ హిల్స్ (తూర్పు) డిప్యూటీ కమిషనర్ పీటర్ ఎస్.దిఖార్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపి వేశారు. కర్ఫ్యూతో ఉద్రిక్తతలు సద్దుమణిగాయని ఆయన తెలిపారు. జయా, మావ్‌ఖర్, ఉమ్‌సోసన్, రియత్సంతియా, వాహింగ్దా, మిషన్, మాప్రేమ్, లున్‌డింగ్రీ, అమా విల్లా, ఖ్వాలాపతి, వాతప్రూ, సన్నీ హిల్, కంటోన్మెంట్, మావ్‌లంగ్‌లలో కర్ఫ్యూ విధించారు. -
కల్లోలంగానే కశ్మీర్...
-
కల్లోలంగానే కశ్మీర్...
- తాజా అల్లర్లలో ఓ పోలీసు సహా ఆరుగురి మృత్యువాత - రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ నియంత్రణలు శ్రీనగర్ : కశ్మీర్ అట్టుడుకుతోంది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భద్రతా దళాలు హతమార్చడంతో చెలరేగిన అల్లర్లు మరింత పెచ్చరిల్లాయి. తాజా అల్లర్లలో ఒక పోలీసు సహా ఆరుగురు చనిపోయారు. శనివారం నాటి అల్లర్లలో గాయపడి చికిత్స పొందుతున్న నలుగురు ఆస్పత్రిలో ఆదివారం ప్రాణాలు విడిచారు. దీంతో ఇప్పటి వరకూ కశ్మీర్ అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 21కి చేరింది. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్, దక్షిణ కశ్మీర్‌లోని 4 జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ తరహా నియంత్రణలను అధికారులు కొనసాగిస్తున్నారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. కశ్మీర్ పరిణామాలను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధమని చెప్పారు. ముఫ్తీ ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఆందోళనల్లో సామాన్య పౌరులు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతాబలగాలు అనవసరంగా ఆయుధాలను ఉపయోగించి ఉంటే, దర్యాప్తు జరుపుతామన్నారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని హురియత్ కాన్ఫరెన్స్ తదితర వేర్పాటువాద సంస్థలతో పాటు, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, లెఫ్ట్‌పార్టీలను కోరారు. కశ్మీర్లో అనేక చోట్ల ఆదివారం కూడా హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పుల్వామాలోని నెవా ప్రాంతంలో ఆదివారం భద్రతా సిబ్బందికీ, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇర్ఫాన్ అహ్మద్ అనే 18 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడని, అతడిని శ్రీనగర్‌లోని ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. మరో గుర్తుతెలియని వ్యక్తి కూడా పుల్వామా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని చెప్పారు. అనంతనాగ్ జిల్లాలోని సంగమ్ ప్రాంతంలో మొబైల్ బంకర్ వాహనాన్ని ఆందోళనకారులు జీలం నదిలోకి తోసేయడంతో అందులో ఉన్న పోలీస్ డ్రైవర్ ఫిరోజ్ అహ్మద్ మరణించాడని తెలిపారు. మరో ఘటనలో పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఓ హెడ్ కానిస్టేబుల్ రెండు కాళ్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని చెప్పారు. కాగా, శనివారం ఆందోళనకారులు దమ్హల్ హంజిపొరా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో గల్లంతైన ముగ్గురు పోలీసుల ఆచూకీ ఇంకా లభించలేదని కశ్మీర్ విద్యా శాఖ మంత్రి నయీమ్ అక్తర్ తెలిపారు. ఆదివారం ఆందోళనకారులు మూడు పోలీస్ స్థావరాలను, మరో మూడు ప్రభుత్వ కార్యాలయాలను, పీడీపీ ఎమ్మెల్యే నివాసాన్ని, ఓ బీజేపీ కార్యాలయంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. అల్లర్లను ఆసరాగా చేసుకున్న మిలిటెంట్లు పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. అమరనాథ్ యాత్ర నిలుపుదల కశ్మీర్లో ఉద్రిక్తతల నేపథ్యంలో అమరనాథ్ యాత్రను వరుసగా రెండో రోజు నిలిపేశారు. జమ్మూ నుంచి కొత్త బృందాన్ని పంపలేదని జమ్మూ డిప్యూటీ కమిషనర్ సిమ్రన్దీప్సింగ్ చెప్పారు. అయితే కశ్మీర్‌లోని బేస్ క్యాంపుల నుంచి యాత్ర కొనసాగుతోందని చెప్పారు. మరోవైపు అమరనాథ్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా సిబ్బం ది రక్షణ ఏర్పాట్లు చేశారు. కాగా, ఇప్పటి వరకూ 1,18,747 మంది భక్తులు అమరనాథుడిని దర్శించుకున్నారు.