బెంగళూరు మార్కెట్లో యువతి హల్చల్ | Nigerian Woman Creates Ruckus in Bengaluru Market | Sakshi
Sakshi News home page

బెంగళూరు మార్కెట్లో యువతి హల్చల్

Jun 28 2016 12:26 PM | Updated on Oct 17 2018 5:27 PM

బెంగళూరు మార్కెట్లో యువతి హల్చల్ - Sakshi

బెంగళూరు మార్కెట్లో యువతి హల్చల్

బెంగళూరులోని మార్కెట్ ప్రాంతంలో ఓ నైజీరియన్ యువతి హల్ చల్ చేసింది. ఫుల్లుగా డ్రగ్స్ తీసుకొని వీధుల్లో నానా రచ్చ చేసింది.

బెంగళూరు: బెంగళూరులోని మార్కెట్ ప్రాంతంలో ఓ నైజీరియన్ యువతి హల్ చల్ చేసింది. ఫుల్లుగా డ్రగ్స్ తీసుకొని వీధుల్లో నానా రచ్చ చేసింది. ఈ సమయంలో ఆమెతోపాటు మరోకరు కూడా ఉన్నాడు. ముందుగా ఓ షాపింగ్ మాల్లోకి వెళ్లిన యువతి అక్కడి సామాన్లు నేలకేసి కొట్టడమే కాకుండా వ్యక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నించింది.

అడ్డుచెప్పిన వారిపై చేయి చేసుకుంది. పోలీసులు కూడా ఆమెను ఆపలేకపోయారు. దీంతో లేడీ కానిస్టేబుళ్లను పిలిపించి ఆమెను కట్టడి చేసేందుకు యత్నించినా వారి వశం కూడా కాలేదు. దీంతో దొంగచాటుగా ఓ వ్యక్తి వెళ్లి ఆమెపై ఒక బట్టతో ముసుగేసి కిందపడేసి బందించారు. చేతులు కట్టేసి తొలుత పోలీస్ స్టేషన్ కు ఆ వెంటనే ఓ ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఆమె చెప్పడం మాత్రం నైజీరియన్ యువతి అని చెప్పింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement