హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి వచ్చిన విమానంలో ప్రయాణికుల వద్ద సోదాలు చేశారు. ఓ ప్రయాణికుడి నుంచి 5 కేజీల బంగారాన్ని ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.