
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. దుబాయ్ నుంచి ఈకే–526 విమానంలో గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అతడు ధరించిన చెప్పులకు వెండి రంగులో ఉన్న డిజైన్ పలకలను తొలగించడంతో బంగారం బయటపడింది. అంతేకాకుండా అతడి బ్యాగేజీలో ఉన్న ఫేషియల్ క్రీమ్ బాక్సులో కూడా బంగారం లభించింది. మొత్తం 495 గ్రాముల బరువు కలిగిన బంగారం విలువ 24.14 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు.