హైదరాబాద్: బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే కొందరు బంగారం దుకాణాలు పెడుతుంటే, ఇంకొందరు బంగారంలో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే మరికొందరు మాత్రం ఇవేవి వద్దంటూ.. బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ మార్గాన్ని ఎంచుకుని అక్రమంగా గోల్డ్ తరలిస్తూ ఇప్పటివరకు చాలా మంది ఎయిర్‌పోర్ట్‌లోనే పట్టుబడుతున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ఈ దారిలోప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఉన్న గిరాకీ అలాంటిది మరీ.
తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తన లగేజీలో బంగారాన్ని దాచి దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు.
ఆ వ్యక్తి గోల్డ్‌ని అత్యంత తెలివిగా లిక్విడ్‌గా మార్చి చీరపై స్ప్రే చేసుకొని తీసుకొచ్చాడు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారు చీర ధర 28.01లక్షల రూపాయలు చేస్తుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దీనిపై విచారణ జరపుతున్నారు.
28 lakhs worth of gold was seized by customs at @RGIAHyd from a Dubai passenger. He concealed the gold by spraying it over clothes and packed it amidst the luggage. #gold #goldsmuggling #RGIA@hydcus @cbic_india @XpressHyderabad@NewIndianXpress pic.twitter.com/d9llirhQb3
— Priya Rathnam (@Rathnam_jurno) August 4, 2023
Comments
Please login to add a commentAdd a comment