customes officers
-
వార్నీ.. ఈ ఐడియాలు ఎలా వస్తాయో, చీరను ఇలా కూడా వాడచ్చా!
హైదరాబాద్: బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే కొందరు బంగారం దుకాణాలు పెడుతుంటే, ఇంకొందరు బంగారంలో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే మరికొందరు మాత్రం ఇవేవి వద్దంటూ.. బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ మార్గాన్ని ఎంచుకుని అక్రమంగా గోల్డ్ తరలిస్తూ ఇప్పటివరకు చాలా మంది ఎయిర్‌పోర్ట్‌లోనే పట్టుబడుతున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ఈ దారిలోప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఉన్న గిరాకీ అలాంటిది మరీ. తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తన లగేజీలో బంగారాన్ని దాచి దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి గోల్డ్‌ని అత్యంత తెలివిగా లిక్విడ్‌గా మార్చి చీరపై స్ప్రే చేసుకొని తీసుకొచ్చాడు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారు చీర ధర 28.01లక్షల రూపాయలు చేస్తుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దీనిపై విచారణ జరపుతున్నారు. 28 lakhs worth of gold was seized by customs at @RGIAHyd from a Dubai passenger. He concealed the gold by spraying it over clothes and packed it amidst the luggage. #gold #goldsmuggling #RGIA@hydcus @cbic_india @XpressHyderabad@NewIndianXpress pic.twitter.com/d9llirhQb3 — Priya Rathnam (@Rathnam_jurno) August 4, 2023 -
చైనా బొమ్మలతో డేంజర్!
Dangerous Chemicals In China Toys: మేడ్ ఇన్ చైనా బొమ్మలకు అమెరికా చెక్ పోస్ట్ వేసింది. చైనా నుంచి నౌకల్లో చేరిన బొమ్మలను దేశంలోకి రాకుండా అడ్డుకుంది. తాజాగా పోర్ట్‌లోనే సుమారు ఏడు బాక్స్‌ల బొమ్మలను అధికారులు సీజ్ చేయడం విశేషం. ఇందుకు కారణం.. బొమ్మల్లో ప్రమాదకరమైన కెమికల్స్‌ను గుర్తించడం!. చైనా నుంచి వచ్చిన బొమ్మల్లో ప్రమాదకరమైన రసాయనాల ఆనవాళ్లను అమెరికా అధికారులు గుర్తించారు. ఈ మేరకు షిప్లో వచ్చిన మేడ్ ఇన్ చైనా బొమ్మల్ని అమెరికా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. భారత్‌లో బాగా ఫేమస్ అయిన లగోరి(స్వీట్, పల్లీ.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు) తరహా చైనా మేడ్ బొమ్మలూ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. జులై 16న చేపట్టిన కన్జూమర్ ప్రొడక్ట్స్ సేఫ్టీ కమిషన్(CPSC), సీబీపీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీలలో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్న బొమ్మల్ని గుర్తించారు. కొన్ని బొమ్మలకు సీసం, కాడ్మియం, బేరియం పూత పూస్తున్నారని, దానివల్ల పిల్లల ప్రాణాలకు ముప్పుపొంచి ఉందని పేర్కొంటున్నారు వైద్యులు. అంతేకాదు ఆగష్టు 24న చైనా నుంచి షిప్ ద్వారా వచ్చిన కొన్ని బొమ్మల్లోనూ ఈ కెమికల్స్ ఆనవాళ్లను నిర్ధారించారు. ఈ తరుణంలో అక్టోబర్ 4న అమెరికాకు చేరుకున్న చైనా బొమ్మల్ని సీజ్ చేయడం విశేషం. మరోవైపు హాలీడే షాపింగ్ సీజన్ నేపథ్యంలో యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీపీబీ) అప్రమత్తమైంది. అంతేకాదు ఆన్లైన్ షాపింగ్ చేసేప్పుడు పిల్లల బొమ్మల విషయాల్లో జాగ్రత్తగా ఎంచుకోవాలని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఎఫెక్ట్‌తో చైనా బొమ్మల వర్తకంపై భారీ ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. చదవండి: చైనాలో భారీ కార్పొరేట్ పతనం తప్పదా? -
స్మగ్లింగ్ ముఠా: కాసుల ఎర.. అమాయకుల చెర
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన సర్ఫరాజ్ అహ్మద్‌కు మూడేళ్ల క్రితం కోరుట్లలో ఉండే జీశాన్, తౌఫిక్, తన్వీర్లతో పరిచయమైంది. ‘దుబాయ్ నుంచి ఓ పార్శిల్ తీసుకురావాలి, విమానం, వీసా ఖర్చులన్నీ మేమే చూసుకుంటం. పార్శిల్ తీసుకొచ్చినందుకు రూ.40 వేలు ఇస్తం’ అన్నారు. డబ్బుల ఆశతో సర్ఫరాజ్ 2018 ఏప్రిల్ 13న దుబాయ్ వెళ్లి, 15న అక్కడ ఓ మనిషిని కలిశాడు. ఆయన ఇచ్చిన పార్శిల్ తీసుకుని నేపాల్ మీదుగా వస్తుండగా ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ పార్శిల్లో అక్రమంగా తరలిస్తున్న అర కిలో బంగారం ఉండటంతో స్వాధీనం చేసుకుని సర్ఫరాజ్‌పై కేసు పెట్టా రు. ఆ పార్శిల్లో ఏముందో తెలియని సర్ఫరాజ్ మూడేళ్లుగా నేపాల్ జైల్లో మగ్గుతున్నాడు. సర్ఫరాజ్ అరెస్టు కాగానే జీశాన్, తౌఫిక్, తన్వీర్‌లు పరారయ్యారు. అన్యాయంగా ఇరుక్కుని జైల్లో మగ్గుతున్న తన భర్తను ఎలాగైనా విడిపించాలని సర్ఫరాజ్ భార్య అఫ్రిన్ బేగం మంత్రి కేటీఆర్‌ను వేడుకుంటోంది. ఒక్క సర్ఫరాజ్ మాత్రమేకాదు.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో ఒకరు, కోరుట్లలో ఒకరు, కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరొకరు బంగారం స్మగ్లింగ్ ముఠా కారణంగా నేపాల్ జైల్లో మగ్గుతున్నారు. ఈ ముఠాలు వేల రూపాయలు ఎరగా వేస్తూ వీరిని ఉచ్చులోకి దించుతున్నాయి. కొందరు ఎయిర్‌పోర్టులో అధికారుల కళ్లుగప్పి బయట పడుతుండగా, మరికొందరు కస్టమ్స్‌కు చిక్కి జైలుపాలవుతున్నారు. కోరుట్ల: చిన్నాచితకా పనులు చేసుకుంటూ డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్న నిరుపేద యువకులను బంగారం స్మగ్లింగ్ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. నాందేడ్‌కు చెందిన కొందరు ముంబై, దుబాయ్ గోల్డ్ స్మగ్లింగ్ ముఠాలతో సంబంధాలు ఏర్పరచుకుని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన యువతకు డబ్బు ఎరవేసి బంగారం స్మగ్లింగ్ కోసం వినియోగించుకుంటున్నట్లు తెలిసింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. కొందరికి నేరుగా బంగారం తీసుకురావాలని చెబుతుండగా, మరికొందరికి ఓ పార్సిల్ తీసుకురావాలని నమ్మబలుకుతున్నారు. కాసుల ఆశకు దుబాయ్ వెళ్తున్న యువకులు.. దుబాయ్, హైదరాబాద్, నేపాల్ ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో దొరికిపోయి జైల్లో మగ్గుతున్నారు. తాము దుబాయ్ పంపిన వారిలో ఎవరైనా కస్టమ్స్ తనిఖీల్లో దొరికిపోతే.. ఆ ముఠా సభ్యులు వెంటనే తమ మకాం వేరే చోటికి మార్చుతున్నారు. కిలోకు రూ.5 లక్షలు తేడా.. మనదేశంలో బంగారం ధరలతో పోల్చితే.. దుబాయ్‌లో తులానికి రూ.4 వేల నుంచి రూ.5వేల వరకు తక్కువగా ఉంటుంది. ఈ లెక్కన కిలో బంగారం ఇండియాకు చేరవేస్తే రూ.5 లక్షల వరకు గిట్టుబాటు అవుతుంది. ఈ సంపాదనకు ఆశపడ్డ స్మగ్లర్లు అమాయకులకు కాసులు ఎరవేస్తున్నారు. ఈ ముఠాలపై నిఘాపెట్టి అమాయకులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత
సాక్షి, చెన్నై : చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు దాదాపు 8 కోట్ల రూపాయలు విలువ చేసే 23 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారం తరలింపుకు పాల్పడుతున్న సింగపూర్, మలేసియా నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బంగారం అక్రమ తరలింపు వెనక ఇంకా ఎవరైన ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
లేడీస్ ఫుట్‌వేర్‌లో 38 కిలోల బంగారం
సాక్షి, ముంబయి : లేడీస్ ఫుట్‌వేర్‌లో అక్రమంగా తరలించిన రూ.11.40 కోట్ల విలువైన 38 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం సీజ్ చేశారు. థాయ్‌లాండ్ నుంచి కంటెయినర్లో వచ్చిన ఈ సరుకులను డోంగ్రికి చెందిన దిగుమతిదారు అల్ రెహమ్ ఇంపెక్స్ సంస్థ భారత్‌కు రప్పించింది. అయితే ఇవి మహిళలు ఉపయోగించే బాత్రూమ్ స్లిప్పర్ అని అధికారులకు చెప్పారు. థాయ్‌లాండ్ నుంచి దిగుమతైన కంటెయినర్‌పై సందేహాలు నెలకొనడంతో ఈనెల 21న చేరుకున్న ఈ కన్సైన్మెంట్ను కస్టమ్స్ పరిశీలన కోసం సేవ్రి టింబర్ పాండ్‌కు తరలించారు. కంటెయినర్‌ను పరిశీలించిన అధికారులు మహిళల స్లిప్పర్స్‌లో ఒక్కోటి కిలో బరువున్న 38 బంగారు కడ్డీలు కనుగొన్నారు. వీటిపై థాయ్‌లాండ్ మార్కింగ్స్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ జరుగుతోందని కస్టమ్స్ కమిషనర్ ప్రాచీ సరూప్ తెలిపారు. 1993 ముంబయి పేలుళ్లకు ముందు సముద్ర మార్గం గుండా గోల్డ్ స్మగ్లింగ్‌ను ఈ ఘటన గుర్తుకుతెచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో దుబాయ్ నుంచి అక్రమంగా తరలించిన రూ.15 కోట్ల విలువైన 52 కిలోల బంగారాన్ని ఢిల్లీలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. ఈ రాకెట్లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను అరెస్ట్ చేశారు. -
శంషాబాద్‌లో బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 645 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఆదివారం ఉదయం రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు అతని వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు.