ఆలస్యంగా బయలుదేరిన ఎయిరిండియా విమానం | Air india flight has stopped due to technical issues | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా బయలుదేరిన ఎయిరిండియా విమానం

Published Sat, Jul 25 2015 8:02 PM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM

Air india flight has stopped due to technical issues

హైదరాబాద్(శంషాబాద్): ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో నిలిచిపోయిన ఎయిర్ ఇండియా జెడ్డా విమానం ఒకరోజు ఆలస్యంగా బయలుదేరింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు 155 మంది ప్రయాణికులతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన ఏఐ 965 విమానంలో సాంకేతిక లోపం తలె త్తడంలో అధికారులు దాన్ని నిలిపివేశారు.

శనివారం సాయంత్రం వరకు కూడా విమానంలోని సాంకేతికలోపం సరికాకపోవడంతో ఓ దశలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం 7 గంటలకు 155 ప్రయాణికులతో జెడ్డా విమానం ఇక్కడి నుంచి బయలుదేరినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement