ఇక విమానంలో ప్రయాణం బోర్ కొట్టదట! | App designed for passengers at Shamsabad airport | Sakshi
Sakshi News home page

ఇక విమానంలో ప్రయాణం బోర్ కొట్టదట!

Published Wed, Feb 3 2016 7:21 PM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

ఇక విమానంలో ప్రయాణం బోర్ కొట్టదట! - Sakshi

ఇక విమానంలో ప్రయాణం బోర్ కొట్టదట!

శంషాబాద్ (రంగారెడ్డి): విమానంలో ప్రయాణం బోర్ కొట్టకుండా ప్రయాణికుల కోసం డిమాండ్‌పై వినోదం అందించడానికి శంషాబాద్ విమానాశ్రయ అధికారులు బుధవారం ఓ యాప్‌ను ప్రారంభించారు. ఫ్రాప్‌కార్న్ సంస్థతో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ యాప్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌లో చెకిన్ పూర్తి చేసిన తర్వాత... వైఫై ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రాఫ్‌కార్న్ పేరిట ఉన్న ఈ యాప్ ద్వారా సరికొత్త సినిమాలు, ఇతర వినోదాత్మకమైన వీడియోలు, చిత్రాలను కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ యాప్‌తో విమాన ప్రయాణం సరికొత్త అనుభూతిని అందిస్తుందని జీఎంఆర్ విమానాశ్రయ సీఈఓ ఎస్‌జీకే కిషోర్ ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్తులో ఈ యాప్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని విమానాశ్రయంలోని అన్ని టెర్మినళ్లకు విస్తరించనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయోగాత్మకంగా ఈ యాప్ సౌకర్యాన్ని అందిస్తున్నామని ఫ్రాప్‌కార్న్ సహాయ వ్యవస్థాపకులు భన్సాల్ తెలిపారు. దేశంలోనే ఇలాంటి సౌకర్యం తొలిసారిగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement