యశవంతపుర: నిధి ఆశ చూపి దంపతులకు రూ. 5 లక్షలు మోసం చేసి దొంగస్వామి అదృశ్యమైన ఘటన హాసన్ జిల్లాలో చోటు చేసుకుంది. తాలూకాలోని దొడ్డహళ్లి గ్రామానికి చెందిన గౌడకు గ్రామంలో కొంత భూమి ఉంది. ఆ భూమిలో నిధి ఉందంటూ మంజేగౌడ అనే దొంగస్వామి నమ్మించాడు. దైవశక్తితో బయటకు తీస్తానంటూ ముందుగానే మూడు కేజీల బంగారు పూత పూసిన బంగారు విగ్రహాన్ని పాతి పెట్టాడు.
మొదట భూమి యజమాని గౌడ–లీలావతి దంపతులు పూజ చేస్తే బయటకు తీస్తానని చెప్పి వారి భూమిలో పాతి పెట్టిన నకిలీ పసిడి విగ్రహాన్ని బయటకు తీసి దంపతులకు ఇచ్చాడు. విగ్రహానికి రక్తాభిషేకం చేయాలని చెప్పి లీలావతి వేలును కోశాడు. దీంతో వేలు తెగిపోయింది. వారం రోజుల తరువాత గౌడ దంపతులు విగ్రహాన్ని తీసుకుని బంగారు షాపులో పరీక్షించగా అది వెండిదిగా తేలింది. అంతకు ముందే స్వామీజీ రూ. 5 లక్షల తీసుకుని పరారయ్యాడు. వేలు తెగిపోవడంతో లీలావతి ఆస్పత్రి పాలైంది. అయితే ఈ ఘటనపై ఇంత వరకు కేసు నమోదు కాలేదు.
(చదవండి: వివాహేతర సంబంధం ఉందనే అనుమానం.. ఫోన్‌లో మాట్లాడుతుంటే చూసి..)
Comments
Please login to add a commentAdd a comment