ప్రపంచంలో చాలామంది ఆరోగ్యం కోసం రకరకాల గృహవైద్యాలను అనుసరిస్తుంటారు. వాటిపై అపరిమితమైన నమ్మకం కలిగివుంటారు. ఒక్కోసారి అటుంటి ఆహారాలపై ఏవగింపు కలిగినా, ఆరోగ్యం పేరుతో వాటిని తింటారు. ఈ కోవలో కొందరు పాములను, మరికొందరు కీటకాలు, పురుగులను కూడా తింటుంటారు.
అది వర్జిన్ గుడ్డు..
ఇదేకోవలోకి వచ్చే ఒక ‘పోషకాహారం’ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. చైనాకు చెందిన చాలామంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మూత్రంలో గుడ్లను ఉడికించి, వాటిపై మసాలాలు చల్లి ఎంతో ఆనందంగా తింటుంటారు. యూరిన్‌లో గుడ్లను ఉడికించి, తినడం వలన మంచి ఆరోగ్యం సమకూరుతుందని చెబుతుంటారు. ఇలా మూత్రంలో ఉడికించిన గుడ్డును వారు వర్జిన్ గుడ్డు అని అంటారు. ఈ విధంగా గుడ్లను ఉడికించేందుకు కొందరు చైనావాసులు.. స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి మూత్రం సేకరిస్తారు.
స్కూలు టాయిలెట్లలో బకెట్లను ఉంచి..
మూత్రంలో ఉడికించిన గుడ్లను తినడం వలన ఎప్పుడూ జ్వరం రాదని కొందరు చైనావాసులు నమ్ముతారు. అదేవిధంగా రక్తపోటు అదుపులో ఉంటుందని కూడా చెబుతారు. మూత్రం సేకరించేందుకు ఇక్కడివారు ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారు. స్కూళ్ల టాయిలెట్‌లలో బకెట్లను ఉంచి, చిన్నారుల నుంచి మూత్రాన్ని సేకరిస్తారు. దానిని గుడ్లను ఉడికించేందుకు వినియోగిస్తారు.
ఇది కూడా చదవండి: చిరుతల మధ్య పోరాటం..‘అగ్నికి’ తీవ్రగాయాలు..!
Comments
Please login to add a commentAdd a comment