
సాక్షి, మెదక్: జిల్లాలోని మనోహరబాద్ మండలం కళ్లకల్ మహాలక్ష్మి స్టీల్ ప్లాంట్‌లో బాయిలర్ క్రేన్ వైర్ తెగిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన మహేష్ యాదవ్, నల్గొండ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ సుమన్ గా గుర్తించారు. సామర్థ్యానికి మించి బరువు వేయడం వల్ల వైర్ తెగిపోయినట్లు సమాచారం. మానవ తప్పిదం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు సుమారు 8 గంటలు శ్రమించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment