![Boiler of Chemical Factory Explodes in Bassi - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/24/chemical.jpg.webp?itok=p7yaP0FR)
రాజస్థాన్‌లోని జైపూర్ పరిధిలో గల బస్సీలోని షాలిమార్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. గాయపడిన ఇద్దరిని ఎస్‌ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతిచెందాడు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళానికి చెందిన వాహనాలు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మృతులను మనోహర్, హీరాలాల్, కృష్ణలాల్ గుర్జార్, గోకుల్ హరిజన్‌లుగా పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో చేరిన వారిని ఇంకా గుర్తించలేదు. పరిశ్రమలోని బాయిలర్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక దళం, రెస్క్యూ టీం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment