బాయిలర్‌లో పడి కార్మికుడి మృతి
Published Thu, Jul 21 2016 1:58 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
ముత్తుకూరు: బాయిలర్‌లో పడి ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో గురువారం వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన రామదాసు(40) నేలటూరులోని ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ రోజు విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బాయిలర్‌లో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement