Worker died
-
విధులకు వెళ్తూ అనంతలోకాలకు..
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): ‘నాన్నా మాకు దిక్కెవరు.. పనికి వెళ్తున్నానని చెప్పి ఇలా వెళ్లిపోయావా.. రోడ్డు పాడుగాను నిన్ను మాకు దూరం చేసిందా.. ఇక మాకు నాన్నలేడా’.. అని నాగపురి రాజయ్య మృతదేహం వద్ద కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం రామగుండం మండలం మల్యాలపల్లెకు చెందిన నాగపురి రాజయ్య(48) ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు డీఎం ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం విధుల కోసమని సైకిల్‌పై మల్యాలపల్లె నుంచి రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టుకు వస్తున్న క్రమంలో లేబర్ గేట్ క్రాస్ చేసే సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో రాజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు మృతదేహం వద్ద రోదించారు. మృతుడికి భార్య కొమురమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రోడ్డుపై నిలిచిన ట్రాఫిక్.. రాజీవ్ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందడంతో గోదావరిఖని వైపు వెళ్లే వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ట్రాఫిక్, ఎన్టీపీసీ పోలీసులు సంఘటనా స్థలం వద్ద ట్రా ఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి కారణౖ మెన కారును ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లా రు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గోదావరిఖ ని ప్రభుత్వం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. సర్వీసు రోడ్డు లేకనే ప్రమాదం.. రాజీవ్ రహదారిపై బీ–పవర్ హౌస్ నుంచి సర్వీసు రోడ్డు లేకపోవడంతోనే మల్యాలపల్లెకు చెందిన రాజయ్య మృతిచెందాడని కాంట్రాక్టు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీసు రోడ్డు ఉంటే మెయిన్ రోడ్డుపైకి రాకుండా ఉండేవాడని, పట్టపగలే నిండు ప్రాణం పోవడంపై వారు రోడ్డు నిర్వాహకులు, సంబంధిత ప్రజాప్రతినిధుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 18న హైకింగ్ రెస్టారెంట్ ఎదుట రహదారిపై జరిగిన ప్రమాదంలో గోదావరిఖని హనుమాన్‌నగర్‌కు చెందిన కారు డ్రైవర్ నూతి రమేశ్ మృతిచెందిన విషాదం నుంచి ప్రజలు కోలుకోకముందే మరో ప్రమాదం జరగడంపై ఆవేదన చెందుతున్నారు. పట్టింపులేని ప్రజాప్రతినిధులు.. రాజీవ్ రహదారిపై సర్వీసు రోడ్డు లేకపోవడంతో వరుస రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలను కోల్పోవడంతో పాటు చాలామంది అంగవైకల్యానికి గురవుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ రోడ్డులో ఉన్న సర్వీసు రోడ్డును నిర్మించలేని వారు ఇంకా ఆయా కాలనీలలో ఉన్న సమస్యలు ఏం పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పడు పరామర్శించడం మానుకుని సర్వీసు రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. -
‘పోలవరం’ నిర్మాణంలో కార్మికుడు మృతి
పశ్చిమగోదావరి , పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో గేట్లు అమర్చే పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గాయాలపాలై ఒక కార్మికుడు మృతిచెందాడు. మరో కార్మికుడు తీవ్ర గాయాలతో రాజమండ్రి వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. పోలవరం ఎస్సై సీహెచ్ రామచంద్రరావు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం స్పిల్‌వే 32వ బ్లాక్‌లో గేట్ల పనులు జరుగుతున్నాయి. క్రేన్ సహాయంతో గేట్లు దించుతున్న సమయంలో అక్కడే పనిచేస్తున్న జార్ఖండ్ రాష్ట్రం పలామా జిల్లా హసీనాబాద్ మండలం ఉబ్రికోలన్ గ్రామానికి చెందిన భీమిలేష్ కుమార్ రామ్ (22) అనే కార్మికుడిపై రాడ్డు పడటంతో తీవ్రగాయాలపాలయ్యాడు. పోలవరం వైద్యశాలకు తరలించగా మృతిచెందాడు. 15వ బ్లాక్‌లో పనిచేస్తున్న సతీష్ అనే కార్మికుడు స్పిల్‌వే పై నుంచి జారిపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని పోలవరం వైద్యశాలకు తరలించారు. వైద్యాధికారి సుధాకర్ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. కార్మికుల ఆందోళన ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోటం వల్లే కార్మికుడు మృతిచెందాడని కార్మికులు ఆందోళనకు దిగారు. స్పిల్‌వే సమీపంలో ఉన్న నవయుగ ఏజెన్సీ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆగ్రహంతో రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయానికి ఉన్న అద్దం, సమీపంలో ఉన్న ఒక వాహనానికి చెందిన అద్దం పగిలాయి. అక్కడి నుంచి 150 మంది కార్మికులు నవయుగ గెస్ట్ హౌస్‌కు వెళుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై కె.శ్రీహరిరావు, నవయుగ ఏజెన్సీ ప్రతినిధులు అక్కడికి చేరుకుని చర్చలు జరిపారు. తమ కోసం ఎటువంటి రక్షణ, భద్రతా చర్యలు చేపట్టడం లేదని కార్మికులు తెలిపారు. కార్మికులను తీసుకువచ్చిన లేబర్ కాంట్రాక్టరుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని సీఐ, ఎస్సై, నవయుగ ఏజెన్సీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించి వెనుదిరిగారు. లేబర్ కాంట్రాక్టర్లతో కార్మికుల సమస్యలపై చర్చించినట్టు ఎస్సై రామచంద్రరావు తెలిపారు. సతీష్ అనే వ్యక్తి గాయాలై రాజమండ్రిలో చికిత్స పొందుతున్నాడని, వివరాలు రావాల్సి ఉందన్నారు. -
చనిపోతే.. అంతే!
జడ్చర్ల : భవన నిర్మాణానికి సంబంధించి బండలు దించుతుండగా ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతిచెందగా యాజమాన్యం మృతదేహాన్ని గు ట్టుగా అతని స్వరాష్ట్రం పశ్చిమబెంగాల్‌కు తరలిం చి చేతులు దులుపుకుంది. గురువారం ఆలస్యం గా వెలుగుచూసిన ఈ ఘటన మండలంలోని పో లేపల్లి గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులో నూతనంగా ఏర్పాటుచేసిన బిజినెస్ కళాశాలలో చోటుచేసుకుంది. స్థానికులు కొందరు సంబంధిత కళాశాల ఎదుట కొద్దిసేపు ఆందోళన చేపట్టడంతో ఈ విష యం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులో బిజినెస్ కళాశాలను ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయగా భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నా యి. పనుల్లో భాగంగా ఆదివారం అడుగు భా గంలో వేసే మార్బుల్స్‌ను లారీ నుంచి అన్లోడ్ చేస్తుండగా అవి ప్రమాదశాత్తు జారిపడి పశ్చిమబెంగాల్‌కు చెందిన గొల్జర్ రహమాన్(45) అనే కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో యాజమాన్యం వెంటనే ఎవరికీ తెలియకుండా గుట్టుగా అంబులెన్స్‌లో అతని స్వరాష్ట్రం పశ్చిమబెంగాల్‌కు తరలించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే గురువారం రహమాన్ సోదరులు ముజియలక్, అన్వర్ కళాశాల యాజమాన్యం వద్దకు వచ్చి తమ సోదరుడి మృతికి సంబంధించి విచారించారు. దీంతో యాజమాన్యం తమకు ఎలాంటి సంబంధం లేదని, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అంటూ చెప్పడంతో వారు స్థానిక అంబేద్కర్ సంఘం నాయకులను ఆశ్రయించారు. దీంతో బాధిత కుటంబానికి రూ.40 లక్షలు ఎక్స్‌గ్రేషియా, పిల్లలకు చదువు వసతి కల్పించాలని, భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఎదుట వారు ఆందోళన చేశారు. ఎస్ఐ వెంకటనారాయణ అక్కడికి చేరుకుని విచారించారు. ఆందోళనలో ఆంబేద్కర్ సంఘం నాయకులు రా జు, అంజి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రహమాన్‌ను పశ్చిమబెంగాల్ రాష్ట్రం కూచిబిహారి జిల్లా దుదీర్‌కుతి దేవంబాస్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈయనకు భార్య లైలిబీబీ, పిల్లలు లోవెలు హొసైన్, లబీబ్ ఇస్లాం ఉన్నారు. అసలేం జరుగుతుంది? పోలేపల్లి గ్రీన్ పార్కులో అసలేం జరుగుతుందన్న అనుమానాలు కలుగుతుంది. ఏదైనా ప్రమాదం చోటుచేసుకుని మరణిస్తే గుట్టుగా శవాలను మాయం చేయడమేనా అన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకు ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. గతంలోనూ అనేక ప్రమాద సంఘటనలు చోటుచేసుకుని పలువురు మృత్యువాత పడినా అవి పోలీసుల ఖాతాకు చేరకుండానే కథ ముగిసిపోయింది. ప్రస్తుతం కూడా ఇదే కోవలో రహమాన్ మృతదేహాన్ని రాష్ట్రం దాటించారంటే పరిస్థితిని ఊహించవచ్చు. వాస్తవంగా ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుడిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలి. అక్కడ చికిత్స చేయడం లేదా మరణించారని డాక్టర్లు ధ్రువీకరించిన తర్వాత పోలీసులకు సమాచారం అందించి చట్టప్రకారంగా వ్యవహరించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండానే గుట్టుచప్పుడు కాకుండా తమ చేతులు దులుపుకుంటున్నారు. వాట్సప్ ద్వారా ఎస్పీ దృష్టికి ఈ విషయాన్ని కొందరు జిల్లా ఎస్పీ అనురాధ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. మృతుడు, తదితర సంఘటన ఫొటోలను వాట్సప్ ద్వారా ఎస్పీకి పంపినట్లు సమాచారం. దీంతో ఎస్పీ సమగ్ర విచారణకు జడ్చర్ల పోలీసులను ఆదేశించినట్లు తెలిసింది. కాగా, సంఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ భాస్కర్‌గౌడ్ జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు తెలిపారు. అయితే అసలేం జరిగిందన్న వివరాలు వెల్లడించేందుకు సంబంధిత కళాశాల యాజమాన్యం ముందుకు రాకపోవడం గమనార్హం. -
కార్మికుడి మృతిపై అనుమానాలెన్నో..
లక్కవరపుకోట : మండలంలోని గేదులవానిపాలెం గ్రామానికి చెందిన గేదుల వెంకటరావు (42) విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్రామస్తులందరూ గురువారం ఉదయం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. వెంకటరావు శ్రీరాంపురం గ్రామ సమీపంలో గల స్టీల్ ఎక్సే్ఛంజ్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం కర్మాగారంలో ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తూ ఒక్కసారిగా పడిపోయాడు. దీంతో కర్మాగార ప్రతినిధులు స్పందించి ప్రథమ చికిత్స అందించి విశాఖపట్నం తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. సాధారణ మరణమే అయితే మృతుడి తల వెనుక భాగంలో దెబ్బ ఎందుకు తగిలిందని బంధువులు, కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. వెంకటరావు మృతి వెనుక ఏదో తతంగం జరిగి ఉంటుందని కుటంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు దిగిన బంధువులు ఇదిలా ఉంటే వెంకటరావు మృతదేహంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, గేదులవానిపాలెం, వేచలపువానిపాలెం, గనివాడ గ్రామాలకు చెందిన సుమారు నాలుగు వందల మంది కర్మాగారం గేటు వద్దకు చేరకుని ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి రూ.30 లక్షలు ఇస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్తామని బంధువులు స్పష్టం చేశారు. ఇందుకు యాజమాన్యం అంగీకరించకపోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన డీఎస్పీ పరిహారం అందజేయాలని కోరుతూ మృతుని కుటుంబీకులు, ఎంపీపీ కొల్లు రమణమూర్తి, జెడ్పీటీసీ సభ్యుడు కరెడ్ల ఈశ్వరరావు, గేదులవానిపాలెం, గనివాడ గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు గేదుల నర్శినాయుడు, మల్లు నాయుడు, గేదుల శాంత, తదితరులు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న విజయనగరం డీఎస్పీ ఏవీ రమణ, ఎస్.కోట సీఐ వై. రవి రంగలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. యాజమాన్యం ఇచ్చిన పరిహారం తీసుకోవాలని...లేనిపక్షంలో కేసు పెట్టుకోవచ్చని మృతుని కుటుంబ సభ్యులకు డీఎస్పీ వివరించారు. అనంతరం మరోసారి ఆందోళనకారులు, యాజమాన్యం చర్చించగా, ఆరు లక్షల రూపాయలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన విరమించారు. -
‘కాలా’ సెట్లో ప్రమాదం
చెన్నై: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కాలా (కారికాలన్) సినిమా షూటింగ్ సెట్లో ప్రమాదం జరిగింది. కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న కాలా చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నై శివారులోని హుండమల్లిలో జరుగుతుంది. షూటింగ్ సంబంధించిన ఓ భారీ సెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఓ కార్మికుడికి కరెంట్‌షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనుకోని సంఘటనతో యూనిట్ అంతా విషాదంలో మునిగిపోయింది. -
సైకో దాడి: కార్మికుడి మృతి
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం వెలుగుచూసింది. స్థానిక ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన నంది పైపుల ఫ్యాక్టరీలోకి ప్రవేశించిన ఓ సైకో అక్కడ నిద్రిస్తున్న ఓ కార్మికుడిపై దాడి చేసి హతమార్చాడు. ఇది గుర్తించిన తోటి కార్మికులు సైకోను బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఫ్యాక్టరీలో రోజువారి కూలీగా పని చేస్తున్న రాజేశ్వర్(50) అనే కార్మికుడిపై సైకో అశోక్ బండరాయితో దాడి చేశాడు. దీంతో తలకు తీవ్ర గాయాలైన రాజేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ హరినాథ్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని సైకోను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
కెమికల్ ఫ్యాక్టరీలో కూలీ మృతి
భిక్కనూరు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీ పిల్లర్‌లో పడి ఓ దినసరి కూలీ మరణించాడు. ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సదాశివనగర్ మండలానికి చెందిన సొన్నాయిల నర్సింలు (30) అనే యువకుడు దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. శనివారం భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీలో పనికి వెళ్లాడు. అక్కడ పిల్లర్ గుంతలో పడి మరణించాడు. ఆ సమయంలో ఎవరూ గమనించలేదు. ఆదివారం దీపావళి పండుగ కావడంతో పనులు జరగలేదు. సోమవారం పనులకు వెళ్లినవారికి పిల్లర్ గుంతలోని నీటిలో తేలుతూ నర్సింలు మృతదేహం కనిపించింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పైకి తీయించి, పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పనిచేస్తున్న సమయంలో ఫిట్స్‌కు గురై గుంతలో పడి మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడికి భార్య వసంత, కూతురు పల్లవి, తండ్రి గంగయ్య ఉన్నారు. -
కరెంట్ షాక్‌తో జీహెచ్ఎంసీ కార్మికురాలు మృతి
హైదరాబాద్: విధులు నిర్వర్తిస్తున్న జీహెచ్ఎంసీ కార్మికురాలు విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని బంజారాహిల్స్ జీవీకే మాల్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్బీటీ నగర్‌కు చెందిన హైమావతి జీహెచ్ఎంసీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో నేటి ఉదయం జీవీకే మాల్ సమీపంలో రోడ్లు శుభ్రం చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రవికిరణ్ అక్కడికి చేరుకుని ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. మృతురాలి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించారు. -
బాయిలర్‌లో పడి కార్మికుడి మృతి
ముత్తుకూరు: బాయిలర్‌లో పడి ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో గురువారం వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన రామదాసు(40) నేలటూరులోని ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ రోజు విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బాయిలర్‌లో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
సింగరేణి కార్మికుడు ఆత్మహత్య
కోల్‌సిటీ: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఓ సింగరేణి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 10 ఇంక్లయిన్ గనిలో ఎలక్ట్రిషియన్ హెల్పర్‌గా పని చేస్తున్న సమ్మయ్య (50) బుధవారం తెల్లవారుజామున ఇంటి వెనుక స్లాబ్‌కు ఉరేసుకుని ఉండగా స్తానికులు గుర్తించారు. మతుడికి భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సమ్మయ్య కొంత కాలంగా మద్యానికి బానిస కాగా, కడుపునొప్పి, నడుమునొప్పి వేధిస్తుండడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
అరబిందో ఫార్మాలో కార్మికుడి మృతి
బొల్లారం: నగరంలోని బాచుపల్లి సమీపంలోని అరబిందో ఫార్మాలో ఓ కార్మికుడు శుక్రవారం ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. బ్రహ్మానందం (25) అనే కార్మికుడు కంటెయినర్ శుభ్రం చేస్తుండగా అందులో పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
సింగరేణిలో కార్మికుడు మృతి
శ్రీరామ్‌పూర్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం శ్రీరామ్‌పూర్ డివిజన్ పరిధిలోని ఆర్కే6 గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్న మాలెం నర్సయ్య (55) శనివారం తెల్లవారుజామున టబ్‌ల మధ్య చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి విధులకు వచ్చిన నర్సయ్య మరికొద్దిసేపట్లో తిరిగి వెళ్లాల్సి ఉండగా... ఆ లోపే ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందడంతో తోటి కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. నర్సయ్యకు భార్య ,ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
కామినేని ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలో మెడికల్ కళాశాల నూతన భవనం నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తిరుపతి అనే యువ కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు పెద్ద సంఖ్యలో బుధవారం ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మృతుడి బంధువులతో ఆస్పత్రి యాజమాన్యం చర్చలు జరుపుతోంది. సంఘటనపై వివరాలు తెలియాల్పి ఉంది. -
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
విజయనగరం : విజయనగరం జిల్లా కేంద్రంలోని వీ టీ అగ్రహారంలో ఉన్న అరుణ్ జూట్ మిల్లులో పనిచేస్తున్న బి.అప్పలనాయుడు(35) అనే కార్మికుడు మిల్లులో పనిచేస్తుండగా ఆదివారం తెల్లవారుజామున కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కార్మిక నేతలు మిల్లు ఎదుట ఆందోళన చేపట్టారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
విజయనగరం: కరెంట్ షాక్‌తో వ్యక్తి చనిపోయిన సంఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయపురంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. మండల పరిధిలోని గరివిడి గ్రామానికి చెందిన దన్నాన శ్రీనివాసులు అలియాస్ రాజు(40)అనే కూలి ఓ మైనింగ్ యజమాని ఇంట్లో పనిచేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంటి ఆవరణ శుభ్రం చేస్తుండగా..కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాటేసిన కరెంట్
కరెంట్ షాక్‌తో పాలేరు దుర్మరణం ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజు వేస్తుండగా విద్యుదాఘాతం పెద్దేముల్ మండలం మంబాపూర్లో ఘటన పెద్దేముల్ : ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజు వేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో ఓ పాలేరు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన అదివారం పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ శివారులో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హన్మగల్ల భాస్కర్ (35) మంబాపూర్ గ్రామ శివారులో తాండూరు ప్రాంతానికి చెందిన నగల వ్యాపారి పాండు ఫాంహౌస్‌లో ఆరునెలలుగా పాలేరుగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా, మూడు రోజుల క్రితం ఫాంహౌస్‌లో బోరుమోటార్ పనిచేయడం లేదు. ఈ విషయాన్ని భాస్కర్ తన యజమాని పాండు దృష్టికి తీసుకెళ్లాడు. ఆదివారం ఉదయం బోరు మెకానిక్ వస్తాడు...నీవు అక్కడే ఉండాలని చూసుకో.. అని యాజమాని భాస్కర్‌కు సూచించాడు. దీంతో ఆయన బోరుమోటార్ వద్ద గడ్డి, ముళ్లకంపలు శుభ్రం చేశాడు. అనంతరం పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలించి ఫ్యూజు పోయిందని గుర్తించాడు. ఫ్యూజ్ పోవడంతోనే బోరుమోటర్ పనిచేయడం లేదేమోనని భావించాడు భాస్కర్. ఫ్యూజ్ వేస్తే బోరుమోటార్ నడుస్తుండొచ్చనుకున్నాడు. దీంతో ట్రాన్స్ఫార్మర్ దిమ్మెపైకి ఎక్కి ఫ్యూజు వేసే యత్నం చేశాడు. అయితే అదే విద్యుత్ స్తంభానికి మంబాపూర్ గ్రామానికి కరెంట్ సరఫరా అయ్యే మెయిన్ లైన్ కూడా ఉంది. దానిని భాస్కర్ గమనించకపోవడంతో ఫ్యూజులు వేస్తుండగా పైన ఉన్న తీగలు భాస్కర్ తలకు తగలడంతో విద్యుదాఘాతమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్తంభంపైనే తీగలపై ఆయన మృతదేహం వేలాడుతోంది. ఈ విషయాన్ని గమనించిన పక్కపొలం రైతులు మృతుడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఫాంహౌస్ యజమాని, మంబాపూర్ గ్రామస్తులు ఘటనా స్థలానికి పెద్దఎత్తున చేరుకున్నారు. భాస్కర్ మృతికి మీరే బాధ్యులంటూ ఫాంహౌస్ యజమాని పాండును నిలదీసి దూషించసాగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పెద్దేముల్ ఎస్ఐ రమేష్, విద్యుత్ ఏఈ మైపాల్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆందోళనకారులను పోలీసులు సముదాయించారు. మృతుడికి భార్య భాగ్యమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కు అయిన భాస్కర్ మృతితో భార్యాపిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలని గ్రామస్తులు కోరారు. -
మమకారంతో వెళ్లి.. మృత్యు ఒడికి...
కొత్తపల్లి :భవాని మాలధారణ చేయాలని అతడు సంకల్పించాడు. మనవరాలి పుట్టిన రోజుకు వెళ్లలేనేమోనని భావించి, ఈలోగా చూసొద్దామని ఆ చిన్నారిపై ఉన్న మమకారంతో కుమార్తె ఇంటికి వచ్చాడు. వారితో ఆనందంగా గడిపి, స్వగ్రామానికి బైక్‌పై తిరుగుపయనమయ్యాడు. వారంతా అతడికి సంతోషంగా వీడ్కోలు పలికారు. అదే అతడికి తుది వీడ్కోలు అయింది. ఉప్పాడ-పిఠాపురం రోడ్డులో యండపల్లి జంక్షన్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భవన నిర్మాణ కార్మికుడు మరణించాడు. అతడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి రూరల్ మండలంలోని పాత చింతల నామవరానికి చెందిన కడియపు సత్యనారాయణ (55) తాపీ పని చేస్తుంటాడు. సోమవారం అతడు భవాని మాలధారణ వేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ నెల 24వ తేదీన తన మనవరాలి పుట్టిన రోజు చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి వెళ్లలేనని భావించి, ఈలోగా మనవరాలితో పాటు అల్లుడు, కుమార్తెను చూసొద్మాని ఆదివారం ఉదయం వారి ఊరైన కొత్తపల్లికి బయలుదేరాడు. కొత్తపల్లిలో ఉన్న అల్లుడు శ్రీనివాస్, కుమార్తెను కలుసుకున్నాడు. ఐదేళ్ల మనవరాలిని ఎత్తుకుని కొద్దిసేపు గారాబం చేశాడు. స్వగ్రామానికి వెళ్తేందుకు బైక్‌పై తిరుగు పయనమయ్యాడు. ఉప్పాడ-పిఠాపురం రోడ్డులో యండపల్లి జంక్షన్ శివారున అతడి బైక్‌ను వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొని, ఆగకుండా వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికుల సహకారంతో 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. అతడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎస్సై ఎన్.కొండయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. పని చేయని ఆక్సిజన్ సిలిండర్ సంఘటనలో సత్యనారాయణకు తీవ్ర గాయాలు కాగా, 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు సిబ్బంది అంబులెన్సలో ఎక్కించారు. అతడికి ఆక్సిజన్ ఎక్కించేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించగా సిలిండర్ ఓపెన్ చేసే బటన్ విరిగి ఉంది. స్థానికంగా ఉన్న నాగులాపల్లి రక్షిత మంచినీటి పథకం కాంట్రాక్ట్ సిబ్బంది సిలిండర్ బటన్‌ను ఓపెన్ చేశారు. సమయానికి ఆక్సిజన్ అంది ఉంటే అతడు చనిపోయి ఉండేవాడు కాదని స్థానికులు పేర్కొన్నారు.