కరెంట్ షాక్‌తో వ్యక్తి చనిపోయిన సంఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయపురంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.
విజయనగరం: కరెంట్ షాక్‌తో వ్యక్తి చనిపోయిన సంఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయపురంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. మండల పరిధిలోని గరివిడి గ్రామానికి చెందిన దన్నాన శ్రీనివాసులు అలియాస్ రాజు(40)అనే కూలి ఓ మైనింగ్ యజమాని ఇంట్లో పనిచేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంటి ఆవరణ శుభ్రం చేస్తుండగా..కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.