కరెంట్ షాక్‌తో జీహెచ్‌ఎంసీ కార్మికురాలు మృతి | GHMC worker died with electric shock at GVK mall | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్‌తో జీహెచ్‌ఎంసీ కార్మికురాలు మృతి

Published Sun, Sep 11 2016 9:26 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

GHMC worker died with electric shock at GVK mall

హైదరాబాద్: విధులు నిర్వర్తిస్తున్న జీహెచ్‌ఎంసీ కార్మికురాలు విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని బంజారాహిల్స్ జీవీకే మాల్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్‌బీటీ నగర్‌కు చెందిన హైమావతి జీహెచ్‌ఎంసీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది.

ఈ క్రమంలో నేటి ఉదయం జీవీకే మాల్ సమీపంలో రోడ్లు శుభ్రం చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ రవికిరణ్ అక్కడికి చేరుకుని ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. మృతురాలి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement