అందరికీ విద్య ప్రభుత్వ లక్ష్యం
- అంబేడ్కర్ 126వ జయంతి వేడుకల్లో మంత్రి ఈటల
- అణగారిన వర్గాలకు ఉచిత విద్య అందించేందుకే గురుకులాలు
- దేశానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం
సాక్షి, హైదరాబాద్: దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి పౌరుడు విద్యావంతుడు కావాలని, ఈ లక్ష్యంతోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం విరివిగా గురుకులాలను ఏర్పాటు చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం భారతరత్న, డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, పద్మా రావుగౌడ్‌లతో కలసి ట్యాంక్‌బండ్ వద్ద ఆయ న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఈటల మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో అధిక శాతం బడుగు, బలహీన వర్గాలే ఉన్నాయని, వారి అభ్యున్నతికి అంబేడ్కర్ ఆశయాలను సూర్తిగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సమ సమాజ స్థాపనే లక్ష్యంగా ముందుకెళ్తు న్నామన్నారు. ఆకలితో ఉన్న కడుపునకు ఆస రా అందిస్తూ అందర్నీ విద్యాధికులను చేసేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు. మహమూద్ అలీ మాట్లాడుతూ, అంబేడ్కర్ జయంతి సందర్భంగా నగరంలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయను న్నామని, ఇప్పటికే మంత్రుల బృందం చైనాలో పర్యటించి విగ్రహ నిర్మాణంపై పలు కంపెనీలతో చర్చించిందని తెలిపారు.
కార్పొరేట్‌కు దీటుగా గురుకులాలు:జగదీశ్‌రెడ్డి
దళితుల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రత్యేక రాయితీ లిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యకు దీటుగా గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దుతా మని, ప్రపంచంలో ఎలాంటి విద్యార్థితోనైనా పోటీ పడేలా గురుకుల విద్యార్థులను తయా రు చేస్తామని చెప్పారు. గతేడాది ప్రారంభిం చిన 23 మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థినులు అన్ని యూనివర్సిటీల్లో టాప్ మార్కులు సాధించారని తెలిపారు.
మతపరమైన రిజర్వేషన్లొద్దు: బీజేపీ
మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేక మని, అంబేడ్కర్ సైతం ఈ విషయంపై స్పష్ట త ఇచ్చారని బీజేపీ శాసనసభ పక్ష నేత జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రే య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌లతో కలసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తూ సరికొత్త వివాదాలను ప్రేరేపిస్తోందని విమర్శించారు. భారతదేశ తొలి కార్మిక మంత్రిగా అంబేడ్కర్ సేవలందిం చారని దత్తాత్రేయ పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రధాని మోదీ శ్రమి స్తున్నా రని, దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిది ద్దేందుకు స్టాండప్ ఇండియా వంటి కార్యక్ర మాలు తీసుకొచ్చారని లక్ష్మణ్ తెలిపారు.
దళితుల హామీలు నెరవేర్చాలి: ఉత్తమ్
టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చి న హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొ న్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరిం చుకుని పార్టీ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, అంజన్ కుమార్, సత్యనారా యణ తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంలో సామాజిక న్యాయం కొరవ డిందని, కొన్ని వర్గాలకే పట్టం కడుతున్నా రని విమర్శించారు. దళితులకు ఎన్నో హామీ లిచ్చారని, కానీ వాటి అమలుపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. కాంగ్రె స్ శాసనసభ పక్ష నేత కె.జానారెడ్డి కూడా అంబేడ్కర్ విగ్రహానికి నివాళుర్పించారు.