కేంద్రంపై అభాండాలు సరికాదు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల మిర్చి రైతులు తీవ్ర ఇబ్బం దులు పడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు డా.కె.లక్ష్మణ్ విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తన వైఫల్యాలను, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై అభాండాలు వేయడం మంచి పద్ధతి కాద న్నారు. రాష్ట్రంలో ఎంత మిర్చి సాగు చేశారు, దిగుబడి ఎంత వస్తుందనే లెక్కలు కూడా తెలియని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఒక ప్రకటనలో విమర్శించారు.
మిర్చి రైతులను ఆదుకోవాలని రెండు రోజుల క్రితం ఢిల్లీలో తాను, కేంద్రమంత్రి దత్తాత్రేయ, జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి అహ్లువాలియాను కలసి వినతిపత్రాన్ని సమర్పించామని తెలి పారు. దీనికి స్పందనగా మిర్చి క్వింటాల్ కు రూ.6,250గా నిర్ణయించినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు.