ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా రాష్ట్ర అభివృద్ధి
కరీంనగర్ రుణం తీర్చుకోకుంటే ‘తెలంగాణ’కు అర్థముండదు: తుమ్మల
కొత్తపల్లి(కరీంనగర్): ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. కరీంనగర్ రూరల్ 2 మండలం ఎలగందులలో రూ.60 కోట్లతో ఎల్‌ఎండీ రిజ ర్వాయర్‌పై నిర్మించ తలపెట్టిన పాత రహదారి పునరు ద్ధరణ పనులకు ఆదివారం ఆర్థిక మంత్రి ఈటలతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం బహిరంగ సభలో తుమ్మల మాట్లాడుతూ ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తే అడ్డు తప్పించైనా పనులు చేపడతామన్నారు.
బంగారు, ఆకుపచ్చ, భాగ్యవంతమైన తెలంగాణ నిర్మించి తీరు తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఉన్నత స్థానంలో నిలిపిన కరీంనగర్ జిల్లా ప్రజల రుణం తీర్చుకోకుంటే తెలంగాణ సాధించిన అర్థమే ఉండదని తుమ్మల వ్యాఖ్యానించారు. మంత్రి ఈటల మాట్లాడుతూ కరీంనగర్‌ను పర్యాటక కారిడార్‌గా తీర్చిదిద్ది అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలుపుతామన్నారు.