బడ్జెట్లో ప్రజలకు భారీగా వరాల జల్లులు!
బడ్జెట్లో ప్రజలకు భారీగా వరాల జల్లులు!
Published Tue, Nov 15 2016 8:08 PM | Last Updated on Thu, Sep 27 2018 4:27 PM
నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటించిన సంచలన నిర్ణయంతో బ్యాంకుల వద్ద, ఏటీఎం వద్ద ఎక్కడ చూసినా భారీ క్యూలైన్లే దర్శనమిస్తున్నాయి.. మధ్యతరగతి ప్రజలు, పేదవారు పడుతున్న ఈ కష్టాలకు ఉపశమనంగా ఎన్డీయే ప్రభుత్వం అరుణ్ జైట్లీ ద్వారా వరాల జల్లులు కురిపించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబు రేట్లలో ఉపశమనం కల్పించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం వేతనాలు ఆర్జించే వారిలో కూడా బీజేపీ స్థానాన్ని మరింత సంఘటితం చేయనుందని వెల్లడవుతోంది.
మరో వైపు నోట్ల రద్దుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీకి ఐదు రాష్ట్రాల్లో సమీపంలో జరుగబోయే ఎన్నికలు ఎంతో కీలకంగా మారాయి. 250 మిలియన్ ప్రజల మన్ననలు పొందాలంటే ఎలాగైనా బీజేపీ మరోకీలక స్టెప్స్ తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాలు ఎన్నికల పోలింగ్కు వెళ్లే ముందే బడ్జెట్ ప్రవేశపెట్టి దానిలో కురిపించాల్సిన వరాలన్నీ కురిపించనున్నట్టు పలువురు పేర్కొంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్షా సైతం అరుణ్ జైట్లీకి బడ్జెట్ను ఓ ఆయుధంగా మరలుచుకుని, ప్రజలను మన్ననలు సంపాదించుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. నోట్ల రద్దుకు వెల్లడవుతున్న వ్యతిరేకతను బడ్జెట్లో ప్రవేశపెట్టబోయే ఈ పన్ను ప్రోత్సహకాల ద్వారా భర్తీచేసుకోవాలని కేంద్రం వ్యూహాలు రచిస్తోంది.
ఈ విషయాన్ని పరోక్షంగా ప్రదాని నరేంద్రమోదీ నోట్ల రద్దు విషయంపై ఆదివారం కర్నాటక, బెల్గంలో జరిగిన సభలో వెల్లడించారు. ప్రస్తుతం కొంత కష్టాన్ని భరించాల్సి వస్తుందని, కానీ కొన్ని వారాల, నెలల్లోనే ప్రజలకు మరింత లాభం చేకూరుతుందని తెలిపారు. ప్రధాని మాటలు నిజం చేయడానికి బడ్జెట్ను ఓ సాధనంగా వాడుతారని బీజేపీ సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టనుందని, రుణమాఫీ వంటి పథకాలను ఉత్తరప్రదేశ్లో తీసుకురాబోతున్నారని వెల్లడించారు. ఈ ప్రణాళికలన్నీ నోట్ల రద్దుతో జమైన నగదుతోనే సాకారం చేస్తున్నారని పేర్కొన్నారు. బ్యాంకింగ్ సిస్టమ్లోని రూ.6 లక్షల కోట్ల అనధికారిక నగదు వచ్చిందని ప్రభుత్వం అంచనా వేస్తుందని, అదేవిధంగా ఇటీవల ప్రవేశపెట్టిన ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ కింద మరో రూ.65 కోట్ల లెక్కలో చూపని నల్లధనం బయటపడినట్టు ఓ టాప్ లీడర్ చెప్పారు.
అంతేకాక మోదీ తదుపరి టార్గెట్గా బినామీ లావాదేవీలపై కన్ను వేయబోతున్నారని, ఒకపక్క ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని మోదీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు పదునైన ఆయుధాలుగా మారనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి . బడ్జెట్లో ప్రవేశపెట్టబోయే పథకాలు కూడా ఎన్నికల కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్డుగా ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే బడ్జెట్ తేదీల మార్పుపై అది కేంద్రానికి సంబంధించిన విషయమని ఎన్నికల సంఘం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అంతేకాక, దానిలో ప్రవేశపెట్టబోయే పథకాలు కూడా ఎన్నికల సంఘం కోడ్ కిందకు రావని ఓ టాప్ ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
Advertisement
Advertisement