మిస్త్రీకి దొరకని జైట్లీ అపాయింట్మెంట్.. | Government to steer clear of Tata-Mistry tussle, for now | Sakshi
Sakshi News home page

మిస్త్రీకి దొరకని జైట్లీ అపాయింట్మెంట్..

Published Wed, Nov 2 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

మిస్త్రీకి దొరకని జైట్లీ అపాయింట్మెంట్..

మిస్త్రీకి దొరకని జైట్లీ అపాయింట్మెంట్..

గొడవలో ప్రస్తుతానికి
తలదూర్చకూడదని ప్రభుత్వం నిర్ణయం!

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఆధిపత్య పోరులో ప్రస్తుతానికి జోక్యం చేసుకోకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి తన వాదన వినిపించడం కోసం సైరస్ మిస్త్రీ ఆయన అపాయింట్‌మెంట్ అడిగారు. దీనికి జైట్లీ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో అటు మిస్త్రీ, ఇటు రతన్ టాటా... ఎవరినీ ప్రస్తుతానికి కలవకూడదని ఆర్థిక మంత్రి నిర్ణయించినట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

‘నాయకత్వ పోరులో ప్రభుత్వం ప్రస్తుతానికి వేలుపెట్టకూడదని భావిస్తోంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లేదా కోర్టులకు ఈ వివాదం చేరేవరకూ మంత్రులెవరూ మిస్త్రీ, టాటాలను కలిసే అవకాశం లేదు. ఒకరిపక్షాన నిలిచిందన్న ముద్ర పడకుండా ఉండటమే దీనికి ప్రధానకారణం. ఒకవేళ న్యాయపోరాటం మొదలైతే వివాదంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, టాటా-మిస్త్రీ వివాదంలో చోటుచేసుకుంటున్న సంఘటనలను నిశితంగా గమనిస్తున్నామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement