![rahul gandhi attacks Jaitley - Sakshi](/styles/webp/s3/article_images/2017/10/26/Rahul-.jpg.webp?itok=4KjbFsFU)
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విటర్ వార్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా.. ఆర్థిక వృద్ధిరేటుపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ ట్విటర్‌లో స్పందించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. చెప్పిన ఆర్థిక వృద్ధిరేటు ఒక ప్రహసనంలా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఆర్థిక వృద్ధిరేటుపై ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనను రాహుల్ గాంధీ కొట్టిపారేశారు. అంతేకాక గత మూడేళ్ల కాలంలో కేవలం జీడీపీ సగటు కేవలం 7.5గా ఉందని ఆయన చెప్పారు. అదేవిధంగా జీడీపీపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రికార్డులను కలిపి ఆయన ట్వీట్ చేశారు.
Dear Mr. Jaitley, May the Farce be with you. pic.twitter.com/Dxb5jFCaEa
— Office of RG (@OfficeOfRG) October 25, 2017
Comments
Please login to add a commentAdd a comment