![మరిన్ని రూ. 500 నోట్లు వస్తున్నాయ్!](/styles/webp/s3/article_images/2017/09/4/51483008092_625x300.jpg.webp?itok=JYSJAG3x)
మరిన్ని రూ. 500 నోట్లు వస్తున్నాయ్!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత భారీ ప్రయోజనాలు ఇపుడు కనిపిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రకటించారు. రీమానిటైజేషన్ ప్రక్రియం వేగం పుంజుకుందనీ రిజర్వ్ బ్యాంకు దగ్గర పెద్ద మొత్తంలో కరెన్సీ అందుబాటులో ఉందనీ పేర్కొన్నారు. ముఖ్యంగా రూ.500 నోట్ల చెలామణి పెరిగిందనీ, మరిన్ని నోట్లను అందుబాటులోకి తేనున్నామని ఆర్థికమంత్రి ప్రకటించారు. డిమానిటైజేషన్ తర్వాత దేశంలో అశాంతి అలజడికి సంబంధించి ఒక్క సంఘటన కూడా నమోదు కాలేదని జైట్లీ స్పష్టం చేశారు.
విమర్శకుల అంచనాలను తలదన్ని అన్ని రంగాలు అభివృద్ధిని సాధించాయాటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ఈ మేరకు బ్యాంకుల్లో గుర్తించదగిన ప్రభావం ఇప్పటికే కనిపిందని జైట్లీ చెప్పారు. అన్ని విభాగాలలో పరోక్ష పన్నుల వసూలు గణనీయంగా పెరిగిందన్నారు. డిసెంబర్ 19 నాటికి డైరెక్ట్ టాక్స్ 14.4 శాతం, కేంద్ర పరోక్ష పన్నులు వరకు 26.2 శాతం, కేంద్ర వాణిజ్య పన్ను 43.3 శాతం పెరుగుదలను నమోదు చేసినట్టు చెప్పారు. అలాగే గత సంవత్సరంతో పోలిస్తే రబీ విత్తనాలు 6.3 శాతం పెరిగినట్టు ఆర్థిక మంత్రి చెప్పారు.