
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల్లో పండుగ వాతావరణాన్ని అపుడే నింపేసింది. గత రెండు సం.రాలుగా పెండింగ్ లో ఉన్న బోనస్ చెల్లించనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రకటించారు. ఈ డబుల్ బొనాంజాతో దాదాపు 33 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న తమ వార్షిక బోనస్ చెల్లించేందుకు అంగీకరించడంతో ఉద్యోగులు ఆనందోత్సాహాల్లో మునగనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన నిబంధనల ప్రకారం 2014-15 , 2015-16 సం.రాల బోనస్ విడుదల కానుంది. తరువాత ఇది 7 వ వేతన సంఘం కింద పరిధిలోకి వస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేఖరులకు చెప్పారు.