two years
-
చీటింగ్ కేసులోమంత్రికి రెండేళ్ల జైలు శిక్ష
నాసిక్: 30 ఏళ్ల నాటి చీటింగ్, ఫోర్జరీ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావు కొకాటేకు నాసిక్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, యాభైవేల జరిమానా విధించింది. ఈ కేసులో మంత్రి సోదరుడు సునీల్ కోకాటేను కూడా దోషిగా పేర్కొంటూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కోకాటే సోదరులు 1995లో తాము తక్కువ ఆదాయ వర్గానికి (ఎల్ఐజీ) చెందినవారమని పేర్కొంటూ ముఖ్యమంత్రి విచక్షణ కోటా కింద ఇక్కడి యోలకర్ మాలలోని కాలేజీ రోడ్డులో రెండు ఫ్లాట్లను పొందారు. దీనిపై మాజీ మంత్రి, దివంగత టీఎస్ ఢిఘోల్ ఫిర్యాదు మేరకు అప్పట్లో సర్కార్వాడ పోలీస్ స్టేషన్లో కోకాటే సోదరులు, మరో ఇద్దరిపై చీటింగ్, ఫోర్జరీ కే సు నమోదైంది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం కొకాటే సోదరులకు శిక్ష, జరిమానా విధించిన కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. కాగా ఈ కేసులో తనకు బెయిల్ లభించిందని, ఉత్తర్వులపై పైకోర్టులో అప్పీలు చేస్తానని మంత్రి కొకాటే తెలిపారు. -
Russia-Ukraine War: యుద్ధం X రెండేళ్లు
సైనికంగా సూపర్ పవరైన రష్యా చోటా దేశమైన ఉక్రెయిన్‌పై ఉన్నట్టుండి విరుచుకుపడి నేటికి రెండేళ్లు. ఉక్రెయిన్ ‘సంపూర్ణంగా నిస్సైనికీకరణే’ లక్ష్యంగా 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేపట్టిన ఈ దుందుడుకు చర్య ప్రపంచ దేశాలన్నింటినీ నిత్యం ఏదోలా ప్రభావితం చేస్తూనే వస్తోంది. రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం రెండేళ్లు దాటినా కొనసాగుతూనే ఉందంటే ఉక్రెయిన్ కనబరచిన తిరుగులేని తెగువే ప్రధాన కారణం. కానీ కొన్నాళ్లుగా ఉక్రెయిన్ క్రమంగా చతికిలపడుతుండగా రష్యా దూకుడు పెంచుతోంది. అయినా లొంగేందుకు ఉక్రెయిన్ ససేమిరా అంటోంది. పైగా ఆక్రమిత భూభాగాల నుంచి వైదొలగి, తమకు కలగజేసిన అపార నష్టానికి రష్యా భారీగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పుడప్పట్లో ముగిసే సూచనలు కని్పంచడం లేదు... యుద్ధం తొలినాళ్లలో రష్యా దూకుడు ప్రదర్శించింది. రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపం దాకా దూసుకెళ్లాయి. యూరప్‌లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రాన్ని ఆక్రమించడంతో యావత్ యూరప్ ఖండం భద్రతాపరమైన ఆందోళనలతో ఉలిక్కిపడింది. కానీ ఆ జోరుకు నెల రోజుల్లోనే బ్రేకులు పడ్డాయి. ఉక్రెయిన్ దళాలు ముప్పేట దాడులతో రష్యా సైన్యాన్ని దిగ్బంధించాయి. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల దన్నుతో పైచేయి సాధిస్తూ వచ్చాయి. వాటి తీవ్ర ఆంక్షలతో రష్యా అతలాకుతలమైంది. కానీ సెప్టెంబర్ నాటికి జపోరిజియాతో పాటు కీలకమైన డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్ ప్రాంతాలను స్వా«దీనం చేసుకున్నట్టు ప్రకటించింది. రష్యాకు చెందిన భారీ యుద్ధ నౌకలతో పాటు క్రిమియాతో రష్యాను కలిపే కీలక బ్రిడ్జిని పేల్చేయడం వంటి చర్యలతో ఉక్రెయిన్ అప్పుడప్పుడూ పైచేయి సాధిస్తూ వచి్చంది. 2023 మేలో ఏకంగా మాస్కోలో పుతిన్ అధికార నివాసమైన క్రెమ్లిన్‌పై రెండు ఉక్రెయిన్ డ్రోన్లు దూసుకెళ్లి కలవరం రేపాయి. తర్వాత నుంచీ ఉక్రెయిన్ దూకుడు నెమ్మదించసాగింది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడి దెబ్బకు తొలుత అపార నష్టం చవిచూసిన రష్యా సైన్యం తానూ అదే బాట పట్టింది. కొంతకాలంగా ఇరు బలగాలూ డ్రోన్లపైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి! విదేశాల నుంచి భారీగా అందుతున్న వాటికి అదనంగా 2023లోనే ఉక్రెయిన్ ఏకంగా 3 లక్షల డ్రోన్లను తయారు చేసుకుంది! వాటిని 2024లో 10 లక్షలకు పెంచజూస్తోంది. వీటికి చిన్న తరహా మిసైళ్లు తోడవుతున్నాయి. ఇప్పుడేంటి...! రష్యా తాజాగా ఉక్రెయిన్‌లోని అది్వవ్కా నగరాన్ని ఆక్రమించింది. ఆ క్రమంలో అతి భారీగా ఆయుధ సామగ్రిని కోల్పోయింది. కాకపోతే కొన్నాళ్లుగా విపరీతంగా వచి్చపడుతున్న చమురు అమ్మకాల లాభాలతో రెట్టించిన ఉత్సాహంతో యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. పైగా లక్షలాదిగా అదనపు సైనికులను సిద్ధం చేసుకుంటోంది. ఇవన్నీ ఉక్రెయిన్‌కు భారీ హెచ్చరిక సంకేతాలే. స్వీయ సాయుధ సామగ్రి నిండుకుంటుండటమే గాక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అమెరికా, పాశ్చాత్య దేశాల నుంచి సాయమూ బాగా తగ్గింది. ఏదేమైనా రష్యా గెలిచేదాకానో, పుతిన్ అధికారంలో ఉన్నంత వరకో యుద్ధం కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ పోరులో ఉక్రెయిన్ మాత్రం ఇప్పటికే బహుశా ఇంకెప్పటికీ కోలుకోలేనంతగా దెబ్బ తిన్నది. అపార నష్టం... ► యుద్ధంలో మరణించిన, క్షతగాత్రులైన రష్యా, ఉక్రెయిన్ సైనికుల సంఖ్య ఏకంగా 5 లక్షలు దాటినట్టు అంచనా. ► 12,000 మందికి పైగా అమాయక ఉక్రేనియ న్లు యుద్ధానికి బలయ్యారు. 20,000 పై చిలుకు మంది క్షతగాత్రులయ్యారు. ► కోటి మంది దాకా ఉక్రేనియన్లు నిర్వాసితులయ్యారు. వీరిలో 60 లక్షలకు పైగా విదేశాలకు వలసబాట పట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద వలసగా నిలిచింది. ► అమెరికా, పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు ఇప్పటికే బిలియన్ల కొద్దీ ఆర్థిక సాయం, అంతకు మించి అత్యాధునిక ఆయుధ సాయం చేస్తూ వస్తున్నాయి. ► ఐఎంఎఫ్ కూడా 15.6 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందజేసింది. యుద్ధంలో ఉన్న ఓ దేశానికి ఆర్థిక సాయం ఐఎంఎఫ్ చరిత్రలోనే తొలిసారి. ► రెండేళ్ల యుద్ధంలో 20 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని మాత్రమే రష్యా ఆక్రమించగలిగింది. అందులోనూ సగం తిరిగి తమ వశమైనట్టు ఉక్రెయిన్ చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గూగుల్ అకౌంట్... వాడకుంటే డిలీటే!
మీ గూగుల్ అకౌంట్‌ను ఈ మధ్య అసలే వాడటం లేదా? దాని వంక కన్నెత్తి చూసి రెండేళ్లయిందా? అయితే అది ఇక శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది. ఈ మేరకు కొత్త పాలసీని 2023 డిసెంబర్ 1 నుంచి గూగుల్ అందుబాటులోకి తెస్తోంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తూ గూగుల్ ఈ వారమే తన యూజర్లందరికీ మెయిల్స్ పంపింది. తాను అందించే అన్ని సరీ్వసులు, ప్రొడక్టులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘మా యూజర్లు అకౌంట్‌ను వాడటం మానేసినా వారి డేటా పూర్తిగా గోప్యంగా, సురక్షితంగా ఉండేలా చూడటమే మా లక్ష్యం. అకౌంట్ డిలీషన్ అందులో భాగమే’’ అని గూగుల్ ప్రకటించింది. వీటికి వర్తిస్తుంది ► గూగుల్ అకౌంట్‌ను రెండేళ్ల పాటు సైన్ ఇన్ చేయకపోతే, వాడకపోతే. ► ఒకసారి డిలీట్ చేసిన అకౌంట్ తాలూకు జీ మెయిల్ అడ్రస్‌ను ఇంకెవరికీ కేటాయించబోరు. ► సేఫ్టీ, సెక్యూరిటీ కారణాల రీత్యా తన పాలసీని ఇలా అప్డేట్ చేస్తున్నట్టు గూగుల్ తెలిపింది. ► అయితే అకౌంట్‌ను డిలీట్ చేసే ముందు గూగుల్ పలుమార్లు రిమైండర్ మెయిల్స్ పంపుతుంది. అవి సదరు అకౌంట్‌తోపాటు యూజర్ తాలూకు రికవరీ అకౌంట్‌కు కూడా వెళ్తాయి. ► ఏదైనా చర్య తీసుకోవడానికి కనీసం 8 నెలల ముందు నుంచే ఈ మెయిల్స్ రావడం మొదలవుతుంది. మీ గూగుల్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలంటే... ► తరచూ లాగిన్ అవుతూ ఉన్నా... ► కనీసం రెండేళ్లకు ఒకసారైనా లాగిన్ అయినా... ► గూగుల్ డ్రైవ్ వాడినా... ► మెయిల్ పంపినా, చదివినా... ► యూట్యూబ్‌లో వీడియో చూసినా... ► ఏ గూగుల్ యాప్ డౌన్లోడ్ చేసినా... ► థర్డ్ పార్టీ యాప్, సరీ్వస్ లను గూగుల్ ద్వారా సైన్ ఇన్ చేసినా మీ గూగుల్ ఖాతాకు ఎలాంటి ఢోకా ఉండదు. మినహాయింపులున్నాయ్.. గూగుల్ అకౌంట్ డిలీషన్ పాలసీకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వాటి ప్రకారం రెండేళ్ల పాటు వాడకంలో లేని అకౌంట్లను డిలీట్ చేసే కొత్త విధానం ఈ కింది వాటికి వర్తించదు ► యూట్యూబ్ చానల్స్, ఖాతాకు, కామెంట్లున్న గూగుల్ అకౌంట్ ► డబ్బులతో కూడిన గిఫ్ట్ కార్డులున్న జీ మెయిల్ అకౌంట్ ► పబ్లిషిడ్ అప్లికేషన్ ఉన్న అకౌంట్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఖమ్మంలో విచిత్ర ఘటన.. రెండేళ్ల తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షం..
సాక్షి, ఖమ్మం జిల్లా: రెండేళ్ల క్రితం అదృశ్యమైన తల్లి చనిపోయిందనుకొని కర్మకాండలు పూర్తి చేశారు ఆమె కుటుంబ సభ్యులు. తిరిగి ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఈ విచిత్ర ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పుల్లూరు మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ-తిరపతయ్య దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి జీవనం సాగిస్తున్నారు. నాగేంద్రమ్మకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో రెండు సంవత్సరాల క్రితం ఇంటి నుండి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా సమాచారం దొరకకపోవడంతో పత్రికల్లోనూ, టీవీలోనూ ఆమె ఆచూకీ కోసం వెతక సాగారు. ఆమె వివరాల కోసం వెతికే సమయంలో సమీప ప్రాంతంలో కొండమీద ఒక మహిళను హత్య చేసిన సంఘటన జరిగింది. హత్యగావించబడ్డ మహిళ ఆధారాలు లభించకపోవడంతో మతిస్థిమితం లేక తప్పిపోయిన నాగేంద్రమ్మనే ఆ మహిళగా భావించి ఆమె కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేసి గత్యంతరం లేని పరిస్థితిలో కర్మకాండలు కూడా పూర్తి చేశారు. తిరిగి రెండు సంవత్సరాల తర్వాత ఆమె కుమారుడు సోషల్ మీడియాలో కన్న తల్లిని గుర్తించిన కుమారుడు కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేశాడు. ఖమ్మం జిల్లా మధిరలో ఆర్కే ఫౌండేషన్ అనాథా శ్రమంలో ఉన్నట్టు ఆ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. తప్పిపోయిన నాగేంద్రమ్మనే ఆ మహిళగా గుర్తుపట్టారు. వెంటనే కుటుంబ సభ్యులు నాగేంద్రమ్మను అనాథాశ్రమంలో కలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. మధిర పోలీసులను సంప్రదించారు. సరైన ఆధారాలు ఉండటంతో మహిళను వారి బంధువుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. సీఎం జగన్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగార్థులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకున్నారు. వారి విజ్ఞప్తి మేరకు వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. పలు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు వీటి భర్తీ కోసం పోలీస్ శాఖ అక్టోబర్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, 411 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. వయో పరిమితి పెంచి తమకు కూడా అర్హత కల్పించాలంటూ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగార్థులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులపై సీఎం అధికారులతో సమావేశమయ్యారు. వారికి అవకాశం కల్పించేలా రెండేళ్లపాటు వయో పరిమితి పెంచుతూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కానిస్టేబుల్ జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 24 ఏళ్లు ఉండేది. ఇప్పుడు రెండేళ్ల సడలింపుతో 26 ఏళ్లు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 24 ఏళ్ల వయోపరిమితిలో ఐదేళ్లు ఇదివరకే సడలింపు ఇచ్చారు. ఆ ప్రకారం 29 ఏళ్లు వయస్సు వారు కానిస్టేబుల్ పోస్టులకు అర్హులు. దీనికి తాజా మినహాయింపుతో 31 ఏళ్ల వయస్సు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఐ పోస్టులకు జనరల్‌లో 27 ఏళ్ల వరకు అవకాశం ఉండేది. ప్రస్తుతం రెండేళ్ల పెంపుతో 29 ఏళ్ల వయసు ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 32 ఏళ్ల నుంచి 34 ఏళ్ల వరకు వయో పరిమితి పెరిగింది. సీఎం నిర్ణయం వల్ల లక్షలాది మంది అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతుందని అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: పోస్టుల భర్తీ ప్రక్రియ ఇలా.. -
భారత్: 2 ఏళ్ల ఆయుష్షు తగ్గింది.. ఎందుకో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: కరోనా మానవ జీవితాలపై పెను ప్రభావం చూపించింది. భారీ సంఖ్యలో మరణాలతో పాటు అనేక శారీరక, మానసిక రుగ్మతలకు కారణమయ్యింది. అంతేకాదు మానవుని సగటు జీవిత కాలాన్ని సైతం ఏకంగా రెండేళ్లు తగ్గించేసిందని తేలింది. దేశంలో దశాబ్ద కాలం కిందట ఉన్న సగటు ఆయుష్షు కాలానికి ఇది క్షీణించింది. కోవిడ్–19కు ముందు మరణాల తీరును, ఆ తర్వాత జరిగిన మరణాలపై ముంబైలోని అంతర్జాతీయ జనాభా అధ్యయన సంస్థ (ఐఐపీఎస్) ఆధ్యయనం చేసింది. కోవిడ్–19కు ముందు పురుషుడు సగటున 69.5 సంవత్సరాలు, మహిళ సగటున 72 సంవత్సరాల పాటు జీవిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే కోవిడ్–19 తీవ్రత తర్వాత పురుషుడి సగటు జీవితకాలం 67.5 ఏళ్లకు, మహిళ సగటు జీవితకాలం 69.8 ఏళ్లకు తగ్గినట్లు ఐఐపీఎస్ పరిశీలన వివరిస్తోంది. చదవండి: ముందుంది ముప్పు.. చేయద్దు తప్పు.. గమనించగలరు నడివయస్కులపైనే అధిక ప్రభావం.. కోవిడ్–19తో ఆరోగ్య సంక్షోభాలు అధికంగా నమోదైనట్లు వివిధ రకాల పరిశీలనలు చెబుతున్నాయి. కోవిడ్–19కు గురైన వారిపైనే కాకుండా ఇతరులపైనా దీని ప్రభావం పడింది. సాధారణ చిక్సితలకు కూడా సకాలంలో సేవలు లభించని పరిస్థితులు, మందుల కొరత, కార్పొరేట్ దోపిడీ లాంటి కారణాలు ఇతర వర్గాలపై ప్రభావాన్ని చూపగా.. కరోనా వైరస్ సోకిన బాధితులకు తక్షణ వైద్యం అందకపోవడం, విషమించిన తర్వాత చికిత్సకు వెళ్లడం లాంటి కారణాలతో ఆరోగ్య సమస్యలు పెరిగాయి. ప్రధానంగా నడివయస్కులపై ఇది ఎక్కువ ప్రభావం చూపింది. 35 నుంచి 69 ఏళ్ల మధ్య వయసు వారి ఆయువు రెండేళ్లు తగ్గినట్లు ఐఐపీఎస్ అధ్యయనం స్పష్టం చేస్తోంది. చదవండి: తెలంగాణలోనూ ఏవై.4.2 వేరియంట్ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19కు ముందు, ఆ తర్వాత మరణాల రేటును ఐఐపీఎస్ విశ్లేషించింది. కోవిడ్–19 మరణాలే కాకుండా సాధారణ మరణాలకు సంబంధించిన గణాంకాలను సైతం పరిశీలనకు తీసుకున్న ఐఐపీఎస్.. వయసుల వారీగా మరణాల రేటును అంచనా వేసింది. మొత్తంగా 2010కి ముందు ఉన్న సగటు జీవితకాలానికి ప్రస్తుత సగటు ఆయుష్షు పతనమైనట్లు పరిశీలన వివరిస్తోంది. మానవ మరణాలకు 21 రకాల వైరస్ సంక్రమణలు కారణంగా ఉండగా... తాజాగా కోవిడ్–19ను సైతం ఆ జాబితాలో చేర్చడంతో సంక్రమణల సంఖ్య 22కు పెరిగింది. -
2 Years YSJagan Ane Nenu: భద్రతలో రాజీ లేదు
వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళల భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు సీఎం వైఎస్ జగన్. రెండేళ్ల పాలన కాలంలో మహిళ భద్రత విషయంలో రాజీలేని ధోరణి కనబరిచారు. మహిళలపై అఘాయిత్యాలు అరికట్టే లక్ష్యంతో కొత్తగా దిశా చట్టం తెచ్చారు. ఈ చట్టం పక్కాగా అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశా పోలీస్ స్టేషన్లు ప్రారంభించి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారు. కేవలం చట్టం చేయడం, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతోనే సరిపెట్టుకోలేదు దాన్ని అమలు చేసేందుకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చారు. ప్రత్యేకంగా మహిళ రక్షణ కోసం గస్తీ కాసేందుకు 900 దిశా పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు. అంతేకాదు ఘటనా స్థలంలో ఆధారాలు పకడ్బందీగా సేకరించేందుకు 18 ఇంటిగ్రేటెడ్ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వెహికల్స్‌ని కూడా రెడీ చేశారు. దీని వల్ల నేరాలు చేసిన వ్యక్తులకు శిక్షలు పడేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేపడితే పక్కాగా చేయడం సీఎం జగన్ నైజం అని చెప్పేందుకు ఈ పనులు మరో ఉదాహరణగా నిలుస్తున్నాయి. హెల్ప్‌డెస్క్‌లు రాష్ట్రవ్యాప్తంగా 700 దిశా హెల్ప్ డెస్కులు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో 12 లక్షల మందికి పైగా మహిళలు అభయం యాప్‌ని డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో ఎవరైనా ఆపదలో ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు వెంటనే వారికి రక్షణగా వచ్చేందుకు పెట్రోలింగ్ వాహనాలు అన్ని వేళల్లో సిద్ధంగా ఉంటాయి. ఇటీవల కాలంలో మహిళలపై పెరిగిపోయిన సైబర్ నేరాలను అరికట్టేందుకు నడుం ఏపీ ప్రభుత్వం బిగించింది. మహిళలను సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు 50 సైబర్ కియోస్కులు ఏర్పాటు చేశారు. -
2 years YSJagan ane nenu: మానవీయ కోణంలో అభివృద్ధి అడుగులు
వెబ్‌డెస్క్: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రెండేళ్ల పాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఓ వైపు భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారు. దావోస్, సింగపూర్ పర్యటనలు చేయకుండా... ఏపీలో ఉంటూనే భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. రాష్ట్ర యువతకు స్థానికంగా ఉపాధి లభించేలా మౌలిక రంగాల్లో కీలక మార్పులు చేపడుతున్నారు. అభివృద్ధికి అసలైన నిర్వచనం అభివృద్ధికి అసలు సిసలైన నిర్వచనం ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. నిన్నటి కంటే ఈరోజు బాగుండి, ఈ రోజు కంటే రేపు బాగుంటుందని సామాన్యుడు ఎప్పుడు భావిస్తాడో అదే అసలైన అభివృద్ధి అంటోంది. అంతకుముందున్న ప్రభుత్వం అభివృద్ధి అంటే భవంతులు, ఫ్లై ఓవర్లు, హైటెక్ హంగులు అంటూ కలరింగ్ ఇస్తే.. అభివృద్ధికి మానవీయ కోణం జోడించి ముందుకు సాగుతోంది. సామాన్యులకు తమ బతుకుపై భరోసా కల్పించడమే అసలైన అభివృద్ధి అని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. పెట్టుబడుల వరద ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఏపీకి రికార్డు స్థాయిలో రూ 6,234 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా కనీసం 39,578 మందికి ఉపాధి లభించనుంది. ఇవి కాకుండా రూ 31,668 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 117 కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ పెట్టుబడులు కూడా వస్తే ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లోకి 4,383 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్‌లో రూ. 2,000 కోట్లు, ఐటీలో రూ. 250 కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. వలసలు ఆపేయాలని దేశంలోనే అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న రెండో రాష్ట్రంగా ఏపీ ఉన్నప్పటికీ.... ఉపాధి కోసం ఇక్కడి మత్స్యకారులు గుజరాత్ వలస వెళ్లే దుస్థితి నెలకొంది. అలా వెళ్లిన వారు సముద్ర జలాల్లో సరిహద్దులు దాటి పాకిస్తాన్ నేవీకి చిక్కి ఎన్నో కష్టాలు పడేవారు. గతంలో ఏ ప్రభుత్వం వీరి బాగోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ మత్స్యకారుల సమస్యను పరిష్కరించేందుకు, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు తీర ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ యాక్షన్ ప్లాన్‌ని సీఎం జగన్ సిద్ధం చేశారు. దీని ప్రకారం రూ. 1510 కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నెలలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. వీటికి తోడు రూ. 1,360 కోట్ల రూపాయల వ్యయంతో మరో నాలుగు షిప్పింగ్ హార్బర్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. అంతేకాదు వందకు పైగా అక్వాహబ్లు వాటికి అనుబంధంగా 120 రిటైల్షాపులు ఏర్పాటు చేయనున్నారు. కేవలం మౌలిక సదుపాయలు, మార్కెటింగ్‌లో మార్పులు చేస్తే సరిపోదని భావించిన ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నంలో ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం అవుతోంది. -
2 Years YS Jagan Ane Nenu: సంక్షేమ సంతకం
వెబ్‌డెస్క్: సంక్షేమ పథకాలు ప్రకటించడంలోనే కాదు వాటిని అమలు చేయడంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరికొత్త పంథాను నెలకొల్పారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నూతన ఒరవడిని సృష్టించారు వైఎస్ జగన్. రెండేళ్లలోనే లెక్కకు మిక్కిలిగా ప్రజాసంక్షేమ పథకాలు ప్రారంభించారు. గత రెండేళ్లుగా ఎంతో సాహసంతో వాటిని అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారు. సంక్షేమ క్యాలెండర్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతీ సంక్షేమ పథకానికి సంబంధించి క్యాలెండర్‌ని ప్రకటించారు. అందులో ఏ పథకానికి ఎన్ని నిధులు ఏ తేదిన విడుదల అవుతాయనే వివరాలు ముందుగానే తెలియజేశారు. ఈ క్యాలెండర్‌ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఈ క్యాలెండర్ ప్రకారం రాబోయే జూన్‌లో జగనన్న తోడు తొలి విడత, వైఎస్సార్ వాహన మిత్ర రెండో విడత, వైఎస్సార్ చేయూత మూడో విడత చెల్లింపులు చేయనుంది జగన్ ప్రభుత్వం. ప్రతీ మంగళవారం ఒక్కో పథకానికి నిధులు విడుదల చేయనుంది. సంక్షేమానికి రూ. 1.25 లక్షల కోట్లు రెండేళ్ల కాలంలో కనివినీ ఎరుగని రీతిలో 94.5 శాతం వాగ్ధానాలను పూర్తి చేసింది జగన్ ప్రభుత్వం. ఐదేళ్ల కాలంలో అమలు చేయాల్సిన పథకాలను రెండేళ్లలోనే ఆచరణలో పెట్టి రికార్డు సృష్టించారు జగన్. సంక్షేమ పథకాలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 129 వాగ్ధానాలు చేయగా అందులో ఇప్పటికే 107 హామీలు అమల్లోకి వచ్చాయి. 24 నెలల కాలంలో లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రూ. 93,708 కోట్ల రూపాయలు చేరగా... పరోక్షంగా మరో రూ. 31,714 కోట్లు అందించింది జగన్ సర్కార్. మొత్తంగా రెండేళ్ల పాలనలో సంక్షేమ పథకాలపై ఏకంగా రూ. 1.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది. తనపర బేధం లేదు ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ సంక్షేమ పథకానికి ప్రతిపక్ష పార్టీ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నా.. ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతోంది ఏపీ ప్రభుత్వం. కులం, మతం, ప్రాంతం, పార్టీ బేధాలు చూడకుండా అర్హుడైతే చాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న, రాబోయే తరానికి మంచి జరగాలనే లక్ష్యంతోనే సర్కారు ముందుకు వెళ్తోంది. ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేందుకు 9,260 కొత్త వాహనాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. లబ్దిదారులకు నాణ్యమైన రేషన్ అందించడంలో భాగంగా అదనంగా రూ.830 కోట్లు వెచ్చించారు. సొంతింటి కల సాకారం సరైన పక్కా ఇళ్లు లేని వారు, అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుత్ను పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ధృడ సంకల్పం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గతంలో ఎన్నడూ కనివినీ ఎగురని రీతిలో ప్రభుత్వమే ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణ ఖర్చులకు కూడా భరించాలని నిర్ణయించారు. మొత్తం 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా దాదాపు 28,54,983 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఈ పట్టాలన్నీ మహిళల పేరు మీదే జారీ చేశారు. శరవేగంగా ఇళ్ల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. జూన్ 1 నుంచి 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా అంతా సిద్ధం చేయాలంటూ అధికారులకు సీఎం జగన్ టార్గెట్ ఇచ్చారు కరోనా ఉన్నా.. ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలో 2019లో మే 30 ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ వెంటనే ఆరు నెలలకే కరోనా మహమ్మారి ప్రపంచంపై దాడి చేసింది. కోవిడ్ ఎఫెక్ట్‌తో ఆర్థిక వ్యవస్థ ఒడిదుడులకు లోనైంది. ఆశించిన ఆదాయం రాలేదు. 24 నెలల పాలనలో 14 నెలలు పాటు కొవిడ్ ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఐనప్పటికీ ఏ ఒక్క సంక్షేమ పథకం నిధుల లేమితో నీరుగారి పోలేదు. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపుతూ ఏ ఒక్క పథకం అమలు వాయిదా పడలేదు. ఎన్నికల మెనిఫెస్టోలో ప్రజలకు వాగ్ధానం చేసిన నవరత్నాలను పరమ పవిత్రంగా భావిస్తూ ఎన్నికష్టాలు ఎదురైనా నవరత్నాల అమలులో వెనక్కి తగ్గలేదు. సంక్షేమ ప్రభుత్వం - వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా 36,70,425 మందికి రూ.19,306.20 కోట్ల సాయం - వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రూ. 5,615 కోట్లతో 17. 27 లక్షల మందికి లబ్ది - వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద 2,294 మందికి రూ.6.96 కోట్ల సాయం అందచేత - వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా రూ.45.69 కోట్లు ఖర్చు - వైఎస్సార్ లా నేస్తం ద్వారా 721 మందికి రూ.3.21 కోట్లు వెచ్చించారు - వైఎస్సార్ ఆరోగ్య ఆసరా క్రింద 1,69,516 మందికి రూ.115 కోట్ల సాయం అందించిన ప్రభుత్వం - వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.1,177.23 కోట్ల నిధులు విడుదల. ఈ పథకం ద్వారా 3,51540 మందికి లబ్ది కుటుంబాలు, కులాల వారీగా - సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో 86 శాతం కుటుంబాలకు లబ్ది - ఒకే పథకం అందుకున్న కుటుంబాలు 18 శాతం - రెండు, అంత కన్నా ఎక్కువ లబ్ది పొందిన కుటుంబాలు 82 శాతం - ప్రత్యక్ష, పరోక్ష నగదు కలిపి రెండేళ్లలో ఇచ్చిన మొత్తం రూ.1,31,725 కోట్లు - ప్రత్యక్ష నగదు బదిలీ కింద నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసింది రూ.95,528 కోట్లు - పరోక్ష నగదు కింద అందిన సాయం రూ.36,197 కోట్లు - ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ.46,405 కోట్లు ఖర్చు చేయగా లబ్ది పొందిన బీసీలు 3,31,06,715 మంది - ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ. 15,304 కోట్లు వెచ్చించగా లబ్ది పొందిన ఎస్సీలు 1,06,14,972 మంది - ప్రత్యక్ష నగదు నగదు బదిలీ రూ. 4,915 కోట్లు జమ చేయగా లబ్ది పొందిన ఎస్టీలు 29,71,144 మంది - ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ. 3,374 కోట్లు ఖర్చు చేయగా లబ్ది పొందిన మైనార్టీలు 19,88,961 మంది - ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ. 7,368 కోట్లు వెచ్చించగా ప్రయోజనం పొందిన కాపులు 30,85,472 మంది - ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ. 18,246 కోట్లు ఖర్చు చేయగా లబ్ది పొందిన ఓసీలు 1,49,21,396 మంది -
2 Years YSJagan Ane Nenu: ప్రజల నాడి పట్టిన ప్రభుత్వం
అమరావతి: పేద, మధ్యతరగతి ప్రజలు ఎవరూ ఇబ్బందిపడకుండా అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో వైద్య రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో మొదలు పెట్టి టెలిమెడిసన్ వరకు వైద్య సేవలను విస్త్రృతం చేశారు. గత రెండేళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వైద్యానికి అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే చాలు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సాయం పొందే వెసులుబాటు ఏపీ ప్రజలకు సీఎం జగన్ అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా క్యాన్సర్‌తో సహా 2,434 వైద్య ప్రక్రియలకు ఉచితంగా చికిత్సలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వెలుపల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలలోని 130కి పైగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఆదాయ పరిమితిని 5 లక్షలకు పెంచడంతో రాష్ట్రంలోని దాదాపు 95 శాతం కుటుంబాలు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వచ్చాయి. అంతేకాదు ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోగులు కోలుకునే వరకు వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని జననేత వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా రోజుకు రూ. 225ల చొప్పున గరిష్టంగా నెలకు రూ.5,000ల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. డాక్టర్ల సూచన మేరకు ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులూ రోగులకు ఆర్థిక భరసా కల్పిస్తున్నారు. పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నారులకు రెండు చెవులకూ కాక్లియర్ పరికరం అమర్చడం వంటి అరుదైన సేవలందిస్తోంది. కార్పొరేటుకి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు సమూలంగా మార్చి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్య సేవలు అందించాలనే లక్క్ష్యంతో నాడు-నేడు పథకం కింద ఆసుపత్రుల ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్‌లు, 1,147 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆసుపత్రులు, 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనంత మంది సిబ్బంది ఉండాలనే లక్ష్యంతో గడిచిన రెండేళ్లలో 9,712 డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందిని నియమించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కొత్త మెడికల్ కాలేజీలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ వంతున కొత్తగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు వీటికి తోడుగా కొత్తగా మూడు క్యాన్సర్, రెండు కిడ్నీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు గిరిజన ప్రాంత ప్రజల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఐటీడీఏల పరిధిలో ఆరు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టారు. దశలవారీగా మూడేళ్లలో అన్ని పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 1,088 కొత్త అంబులెన్సులు ఆపత్కాలంలో రోగులకు అత్యసర వైద్య సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం రూ.210 కోట్లతో 1,088 అంబులెన్సులు కొనుగోలు చేసింది. వీటిని 104, 108 సర్వీసులలో ఉపయోగిస్తున్నారు. ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే ఘటనా స్థలికి అంబులెన్స్ చేరుకునే వీలు చిక్కింది. మరోవైపు 104 సేవల్లో భాగంగా వైద్య సిబ్బంది పల్లెలకు వెళ్లి బీపీ, షుగర్, ఈసీజీ ఇలా 20 రకాల వైద్య సేవలతో పాటు మందులు ఉచితంగా అందిస్తున్నారు. 104, 108 సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు నేటి పరిస్థితులకు తగ్గ గౌరవ వేతనం అందిస్తున్నారు. కంటి వెలుగు వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా కంటి వైద్య సేవలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వారికి కంటి అద్దాలు అందిస్తున్నారు. మరోవైపు అవ్వా తాతలకు గ్రామ సచివాలయాల్లో ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేపడుతున్నారు. శస్త్ర చికిత్సలు జరిగిన వారికి ఇంటివద్దకే వచ్చి ఉచిత కంటి అద్దాలు అందచేసేలా ఈ పథకానికి సీఎం జగన్ రూప కల్పన చేశారు. టెలిమెడిసిన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14,410 కాల్ సెంటర్ ద్వారా టెలిమెడిసిన్ సేవలు అందిస్తోంది. ప్రతీ జిల్లాకు ఒక టెలిమెడిసిన్ సేవా కేంద్రంతో పాటు ప్రతీ కేంద్రంలో 10 నుంచి 15 మంది స్సెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. వీరు రోగి నుంచి జబ్బు వివరాలు తెలుసుకొని మందులు, సూచనలను ఫోన్ ద్వారా అందిస్తున్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో టెలీమెడిసిన్ కేంద్రాల ద్వారా ప్రతి రోజు వేలాదిమంది రోగులకు ఆరోగ్య సేవలు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. -
సత్నాం సింగ్‌పై రెండేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్బీఏ) జట్టుకు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన తొలి బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా ఘనతకెక్కిన సత్నాం సింగ్ భమారా డోపింగ్‌లో దొరికిపోయాడు. దీంతో 25 ఏళ్ల భమారాపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) క్రమశిక్షణా ప్యానెల్ గురువారం ప్రకటించింది. బెంగళూరులో దక్షిణాసియా క్రీడల సన్నాహక శిబిరం సందర్భంగా గతేడాది నవంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లోనే సత్నాం సింగ్ డోపీగా తేలడంతో రెండేళ్ల సస్పెన్షన్ వేటు వేశారు. దీన్ని సవాలు చేసిన సత్నాం డోపింగ్ నిరోధక క్రమశిక్షణా కమిటీ (ఏడీడీపీ)తో విచారణ జరిపించాలని ‘నాడా’ను కోరాడు. ఈ విచారణలో సత్నాం ‘వాడా’ నిషేధిత ఉత్ప్రేరకం హైజినమైన్ను తీసుకున్నట్లు తేలిందని ‘నాడా’ గురువారం నిర్ధారించింది. గతేడాది నవంబర్ నుంచే శిక్ష అమల్లోకి వస్తుందని పేర్కొన్న జాతీయ సంస్థ 19 నవంబర్ 2021 వరకు అతను ఎలాంటి టోర్నీల్లో ఆడరాదంటూ నిషేధం విధించింది. ఐదేళ్ల క్రితం ఎన్బీఏ డెవలప్మెంట్ లీగ్‌లో టెక్సాస్ లెజెండ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన భమారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చరిత్ర సృష్టించాడు. ఆసియా చాంపియన్‌షిప్స్, 2018 కామన్వెల్త్ గేమ్స్, 2019 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. -
మారటోరియం రెండేళ్లు ఉండొచ్చు
న్యూఢిల్లీ: బ్యాంకు అప్పులపై విధించిన మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపాయి. కోవిడ్–19 లాక్డౌన్, ఆంక్షల మూలంగా ఆర్థికవ్యవస్థ మందగించిందని, ఏప్రిల్– జూన్ త్రైమాసికంలో స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో దాదాపు 24 శాతం లోటు నమోదైందని కేంద్రం, ఆర్బీఐల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభావితవర్గాలకు సహాయపడేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో మార్చి నుంచి ఆర్నెళ్ల పాటు లోన్ల వాయిదాలపై కేంద్రం మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఇది ఆగస్టు 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో మారటోరియంను రెండేళ్లు పొడిగించే అవకాశం ఉందని కేంద్రం... అత్యున్నత న్యాయస్థానానికి తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. కిస్తుల్లో వడ్డీ కలిపే ఉంటుందని, వాటి వసూలు వాయిదా వేసినందున బ్యాంకులు వడ్డీపై మళ్లీ వడ్డీ వేస్తున్నాయని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మారటోరియం కాలంలో వడ్డీ వేయకుండా కేంద్రం, ఆర్బీఐలను ఆదేశించాలని ఆగ్రావాసి గజేంద్ర శర్మ తన పిటిషన్లో కోరారు. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. వడ్డీపై మళ్లీ వడ్డీ వేస్తున్న అంశాన్ని బుధవారం విచారిస్తామని సుప్రీం పేర్కొంది. కేంద్రం ఇప్పటికే ఈ విషయంలో అఫిడవిట్‌ను దాఖలు చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. తమకు ఆ అఫిడవిట్ ఇంకా అందలేదని కోర్టు తెలుపగా... బెంచ్ అఫిడవిట్‌ను పరిశీలించాలని, రెండు మూడు రోజుల తర్వాత విచారణ జరిపినా, బుధవారమే విచారణకు స్వీకరించినా నష్టమేమీలేదని మెహతా అన్నారు. వడ్డీపై వడ్డీ అంశాన్ని కేంద్రం, ఆర్బీఐ, బ్యాంకర్లు కలిసి పరిశీలించే అవకాశమివ్వాలన్నారు. మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. వాయిదా వేసిన కిస్తులపై వడ్డీని మాఫీ చేయడం ఆర్థిక సహజసూత్రాలకు విరుద్ధమని కేంద్రం తెలిపింది. ఒకవేళ వడ్డీ మాఫీ చేస్తే... క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించిన వారికి అన్యాయం చేసినట్లే అవుతుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. -
అగ్రశ్రేణి క్రికెటర్‌ను తాకింది...
ఢాకా/దుబాయ్: బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేళ్ల నిషేధం విధించింది. ఫిక్సింగ్ చేసేందుకు తనను కొందరు బుకీలు సంప్రదించిన సమయంలో అవినీతి నిరోధక బృందానికి షకీబ్ సమాచారం ఇవ్వకపోవడంతో అతనిపై చర్య తీసుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది. 2018లో జరిగిన రెండు టోర్నీల సందర్భంగా షకీబ్‌ను బుకీ సంప్రదించాడు. బంగ్లా కెప్టె న్పై ఐసీసీ మూడు వేర్వేరు ఆరోపణలు చేసింది. అతను తన తప్పు అంగీకరించడంతో శిక్ష విధించింది. ‘అవినీతికి పాల్పడేందుకు ఎవరైనా సంప్రదించినప్పుడు ఏదైనా తప్పనిసరి కారణం ఉంటే తప్ప ఆలస్యం చేయకుండా వెంటనే సమాచారం అందించాలి. ఎంత ఆలస్యం చేస్తే విచారణ అంత సంక్లిష్టంగా మారుతుంది. సరిగ్గా చెప్పాలంటే ఏ మ్యాచ్ కోసమైతే సంప్రదించారో ఆ మ్యాచ్ ముగిసేవరకు కూడా ఆగరాదు’ అని ఐసీసీలోని అవినీతి నిరోధక విభాగంలో నిబంధన 2.4.4 చెబుతోంది. దీని ప్రకారం కనీసం ఆరు నెలల నుంచి గరిష్టంగా ఐదేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఈ నిబంధనను షకీబ్ అతిక్రమించాడు. అత్యంత అనుభవజ్ఞుడైన షకీబ్‌కు నియమ నిబంధనలపై అన్ని రకాలుగా అవగాహన ఉందని, అయినా సరే అతను దీనిని వెల్లడించకపోవడం తప్పిదంగా భావిస్తున్నట్లు ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ వ్యాఖ్యానించారు. ప్రపంచ క్రికెట్లో చిన్నపాటి కుదుపు. మళ్లీ ఫిక్సింగ్ తుఫాన్ ఒక అగ్రశ్రేణి క్రికెటర్‌ను తాకింది. అయితే ఈ సారి కొంత భిన్నమైన రూపంలో! మ్యాచ్‌లు ఫిక్స్ చేయకపోయినా, అందుకు ప్రేరేపించిన వారి గురించి ఐసీసీకి సమాచారం ఇవ్వడంలో విఫలమైనందుకు తీవ్ర చర్య! బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్, ప్రపంచ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై రెండేళ్ల నిషేధం పడింది. ఫిక్సింగ్‌కు సంబంధించిన వివాదంలో ఒక అంతర్జాతీయ కెప్టెన్‌పై ఈ తరహాలో వేటు పడటం అనూహ్య, అరుదైన పరిణామం. తాజా శిక్ష నేపథ్యంలో 32 ఏళ్ల షకీబ్ కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. ఏడాది తర్వాత ఆడవచ్చు... రెండేళ్ల నిషేధంలో మొదటి సంవత్సరంలో షకీబ్ పూర్తిగా ఆటకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో అతను మళ్లీ ఎలాంటి తప్పూ చేయరాదు. ఐసీసీ అవినీతి నిరోధక ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తర్వాతి 12 నెలలు అతనిపై ఐసీసీ పర్యవేక్షణ (సస్పెండెడ్ సెన్టెన్స్) కొనసాగుతుంది. 2020 అక్టోబర్ 29 నుంచి షకీబ్ మళ్లీ క్రికెట్ బరిలోకి దిగేందుకు అర్హుడవుతాడు. వరల్డ్ కప్‌కు దూరం... తాజా పరిణామంలో షకీబ్ భారత్‌తో జరిగే టెస్టు, టి20 సిరీస్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఐసీసీ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో 3వ (టెస్టు), 1వ (వన్డే), 2వ (టి20) స్థానాల్లో అతను కొనసాగుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా పలు లీగ్‌లలో షకీబ్ కీలక ఆటగాడు. నిషేధం నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్లో అతను ఆడే అవకాశం లేదు. అయితే అన్నింటికి మించి ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచ కప్ అవకాశాలు కోల్పోవడం బంగ్లాదేశ్ జట్టుకు పెద్ద దెబ్బ. ఈ టోర్నీ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరుగుతుంది. అక్టోబర్ 29 నుంచి అతను అందుబాటులోకి వస్తున్నా నిషేధం కొనసాగుతున్న సమయంలో అతడిని ఎంపిక చేసే సాహసం బంగ్లా బోర్డు చేస్తుందా అనేది సందేహమే. విభేదాలే కారణమా! కొన్నాళ్ల క్రితం బంగ్లాదేశ్ క్రికెట్లో ఫిక్సింగ్‌కు సంబంధించి వార్తలు వచ్చాయి. ఇవేవీ నిర్ధారణ కాకున్నా బంగ్లా బోర్డుకు దీనిపై సమాచారమైతే ఉంది. అయితే ఇప్పుడు సరిగ్గా భారత్‌తో సిరీస్‌కు ముందు ఏడాది క్రితంనాటి అంశం బయటపడటం సందేహాలు రేకెత్తించింది. వారం రోజుల క్రితం తమ కాంట్రాక్ట్ ఫీజులు పెంచడం మొదలు ఇతర సమస్యలు తీర్చాలంటూ బంగ్లా క్రికెటర్లు సమ్మె చేయగా దీనికి షకీబ్ నాయకత్వం వహించాడు. చర్చలు సఫలమై సమ్మె ముగిసినా... అంతర్గతంగా పరిస్థితి చక్కబడలేదు. షకీబ్ తదితర ఆటగాళ్లు తిరుగుబాటు చేసి భారత్‌తో సిరీస్‌కు వెళ్లకుండా కావాలని అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ స్వయంగా బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ బహిరంగ వ్యాఖ్య చేయడం దీనిని నిర్ధారించింది. బుధవారం బంగ్లా జట్టు భారత్‌కు బయల్దేరాల్సి ఉంది. బోర్డు రాజకీయాలకు, షకీబ్ నిషేధానికి ఏదైనా సంబంధం ఉండవచ్చని వినిపిస్తోంది. ఐపీఎల్ వరకు ఆగమంటావా!...షకీబ్‌తో బుకీ వాట్సప్ సంభాషణ బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే పాల్గొన్న ముక్కోణపు వన్డే టోర్నీ, ఐపీఎల్లో ఒక మ్యాచ్‌కు సంబంధించి బుకీలు షకీబ్‌తో ఫిక్సింగ్ చేయించేందుకు ప్రయత్నించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారంలో భారత బుకీగా అనుమానిస్తున్న అగర్వాల్ అనే వ్యక్తి షకీబ్‌తో వాట్సప్ చాటింగ్ చేశాడు. ముందుగా 2017 నవంబర్‌లో ఢాకా ప్రీమియర్ లీగ్ సమయంలో ఒక మిత్రుడి ద్వారా షకీబ్ ఫోన్ నంబర్‌ను అగర్వాల్ తెలుసుకున్నాడు. ఆ తర్వాత తనను కలవాలనుకుంటున్నట్లు మెసేజ్‌లు పెట్టాడు. 2018 జనవరిలో ముక్కోణపు టోర్నీ సందర్భంగా ‘మనం ఈ టోర్నీలో పని చేద్దామా లేక ఐపీఎల్ వరకు ఆగమంటావా’ అని అగర్వాల్ సందేశం పంపాడు. 2018 ఏప్రిల్‌లో పంజాబ్, సన్‌రైజర్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. సన్‌రైజర్స్ తరఫున ఆ మ్యాచ్‌లో ఎవరెవరు ఆడుతున్నారో బుకీ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దీనికీ షకీబ్ స్పందించలేదు. ఆ తర్వాత అగర్వాల్‌ను బుకీగా భావించి తాను దూరమైనట్లు షకీబ్ ఐసీసీ విచారణలో వెల్లడించాడు. అయితే ఈ సమాచారం మొత్తం తమకు అందించకపోవడమే షకీబ్ చేసిన తప్పని ఐసీసీ చెప్పింది. నిషేధం కారణంగా నేను ఎంతో ప్రేమించే ఆటకు దూరం కావడం చాలా బాధగా ఉంది. అయితే బుకీ సంప్రదించిన విషయాన్ని చెప్పనందుకు నాపై విధించిన శిక్షను అంగీకరిస్తున్నాను. అవినీతికి వ్యతిరేకంగా పని చేయడంలో ఆటగాళ్లు ముందు వరుసలో ఉండాలని ఐసీసీ కోరుకుంటుంది. ఈ విషయంలో నా బాధ్యత నిర్వర్తించలేకపోయాను. క్రికెట్ అవినీతి రహితంగా ఉండాలనే చాలా మందిలాగే నేనూ కోరుకుంటున్నా. ఇకపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగంతో కలిసి పని చేస్తా. నేను చేసిన తప్పును కుర్రాళ్లు చేయకుండా చూస్తా. –షకీబ్ అల్ హసన్ కెప్టెన్లుగా మోమిన్, మహ్ముదుల్లా షకీబ్ దూరమైన నేపథ్యంలో భారత్‌తో జరిగే టెస్టు, టి20 సిరీస్‌లకు బంగ్లాదేశ్ కొత్త కెప్టెన్లను ప్రకటించింది. టెస్టు జట్టుకు మోమినుల్ హక్, టి20 జట్టుకు మహ్ముదుల్లా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఈ పర్యటనలో భారత్–బంగ్లా మధ్య 3 టి20 మ్యాచ్‌లు, 2 టెస్టులు జరుగుతాయి. మరోవైపు షకీబ్‌కు తాము అండగా నిలుస్తామని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. ‘షకీబ్ తప్పు చేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయం తనకూ తెలుసు. ఐసీసీ నిర్ణయంలో ప్రభుత్వం చేసేదేమీ లేదు కానీ అతను తన తప్పు తెలుసుకొని మరింత తెలివైన ఆటగాడిగా తిరిగొస్తాడు’ అని హసీనా వ్యాఖ్యానించారు. వివాదాల ‘హీరో’ అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 12 వేల పరుగులు, 500కు పైగా వికెట్లు... మూడు ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో నిలిచిన ఏకైక ఆల్‌రౌండర్... ఒకే టెస్టులో సెంచరీ చేయడంతో పాటు రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టిన అరుదైన రికార్డు... 13 ఏళ్ల కెరీర్లో షకీబ్ అల్ హసన్ సాధించిన ఘనతలెన్నో... మరో మాటకు తావు లేకుండా, నిస్సందేహంగా అతను బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు. జట్టు సారథిగా కూడా అతను ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించాడు. అయితే అంతే స్థాయిలో అతను వివాదాలతో కూడా సహవాసం చేశాడు. తాజా నిషేధం నేపథ్యంలో గతంలో షకీబ్ చేసిన తప్పుల జాబితాను చూస్తే... ►2010 సైట్‌స్క్రీన్‌కు అడ్డుగా వచ్చిన అభిమానిని దూషించి బ్యాట్‌తో కొట్టేందుకు ప్రయత్నించాడని ఆరోపణ. మ్యాచ్ రిఫరీ హెచ్చరిక. కొన్నాళ్లకు ఢాకాలోని సొంత మైదానంలోనే ప్రేక్షకులు గేలి చేయడంతో వారిని తిడుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. మూడేళ్ల తర్వాత ఇదే మైదానంలో మ్యాచ్ చూస్తున్న తన భార్యపై కామెంట్ చేశారంటూ ఒక అభిమానితో గొడవ. మ్యాచ్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ వదిలి వెళ్లడంపై హెచ్చరిక. ►2014 షకీబ్ కెరీర్లో ఇది తీవ్ర ఘటన. శ్రీలంకతో మ్యాచ్‌లో తాను అవుటైన తీరును భారీ స్క్రీన్‌పై కెమెరామెన్ చూపించడంతో...అక్కడ కాదు ‘ఇక్కడ’ చూడమన్నట్లుగా అసభ్య సైగలు చేశాడు. మూడు వన్డేల నిషేధం, జరిమానా పడగా, ఆ తర్వాత క్షమాపణ కోరాడు. ►2014 ప్రవర్తన ఏమాత్రం సరిగ్గా లేదంటూ బంగ్లా బోర్డు ఆరు నెలల నిషేధం విధించింది. ఆ తర్వాత జట్టు కోచ్ హతురసింఘేతో గొడవ పడ్డాడు. ►2018 శ్రీలంకతో నిదాహస్ ట్రోఫీ మ్యాచ్‌లో అంపైర్లు ‘నో బాల్’ ఇవ్వనందుకు నిరసనగా సహచరులతో సహా మైదానం వీడి మ్యాచ్‌ను బహిష్కరించే ప్రయత్నం చేశాడు. ఐసీసీ 25 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా విధించింది. షకీబ్ అంతర్జాతీయ కెరీర్ -
పటేల్ ఉద్యమనేత హర్ధిక్ పటేల్‌కు ఎదురుదెబ్బ
-
ఓటుకు నోటు @ 2 ఏళ్లు
-
ఆకతాయికి రెండేళ్ల సత్ ప్రవర్తన విధింపు
ఆకివీడు : అమ్మాయిల్ని వేధిస్తున్నాడనే ఆరోపణపై స్థానిక కోసూరు వారి వీధికి చెందిన ఎండీ ఫరూక్‌కు రెండేళ్ల సత్ ప్రవర్తన, రూ.10 వేల విలువైన హామీతో కూడిన జామీను ఇవ్వాలని భీమవరం ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.దీనబాబు శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ ఏడాది జనవరి 3వ తేదీన ఆ ప్రాంతానికి చెందిన యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి కేవీఎస్వి ప్రసాద్ కేసు నమోదు చేసి ఫరూక్‌ను రిమాండ్‌కు పంపారని ఎస్సై ఆకుల రవి చెప్పారు. వాదోపవాదాలు అనంతరం తీర్పు చెప్పారని, రెండేళ్లలో సత్ ప్రవర్తన కలిగి ఉండకపోతే శిక్ష వేస్తారన్నారు. ప్రాసిక్యూష¯ŒS తరపున ఏపీపీ బి.మోహనరావు వాదించారని చెప్పారు. -
ఆ విషాదానికి రెండేళ్లు
- జీవచ్ఛవాలుగా పెనుకొండ బస్సు ప్రమాద బాధితులు - ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వ సాయం పెనుకొండ సమీపంలోని ‘షీప్ ఫామ్’. 2015 జనవరి 7న ఉదయం 8.24 గంటలు. మడకశిర నుంచి బయలుదేరిన ‘పల్లె వెలుగు’ బస్సు (ఏపీ 28 జెడ్ 1053) పెనుకొండకు చేరువలో ఉంది. స్కూళ్లు, కాలేజీలకు బయలుదేరిన గ్రామీణ విద్యార్థులతో పాటు 87 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. స్నేహితులైన విద్యార్థులు ఉత్సాహంగా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటున్నారు. మరికొందరు మరో రెండ్రోజుల్లో రానున్న సంక్రాంతి సెలవులు ఎలా గడపాలో ముచ్చటించుకుంటున్నారు. మరో 5 నిమిషాల్లో పెనుకొండకు చేరుతుందనగా... పల్లె వెలుగు బస్సు కాస్తా మృత్యు శకటమైంది. ముందు వెళుతున్న ఆటోను దాటి వెళ్లే క్రమంటో ఘోర ప్రమాదానికి గురైంది. ఇరుకు ఘాట్ రోడ్డు పక్కనే ఉన్న 150 అడుగుల లోతైన గుంతలో పడిపోయి కుప్పలా మారిపోయింది. ఒక్కసారిగా ప్రయాణికుల ఆర్తనాదాలు.. 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యుఒడికి చేరుకున్నారు. మృతుల్లో మావటూరు, బండపల్లి, నాగలూరు తదితర గ్రామాలకు చెందిన ఇంటర్, డిగ్రీ విద్యార్థులతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. త్రీవంగా గాయపడిన 65 మందిని పెనుకొండ, హిందూపురం, అనంతపురం ఆస్పత్రులకు తరలించారు. ఈ విషాదానికి నేటితో సరిగ్గా రెండేళ్లు. జీవచ్ఛవాలుగా మారిన బాధితులకు ప్రభుత్వ సాయం ప్రకటనలకే పరిమితమైంది. - పెనుకొండ తక్షణ సాయమందించి ఆదుకున్న జగన్ ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదు. సమాచారం అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ నేతలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాలగుండ్ల శంకరనారాయణలతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స కోసం చేరిన బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు జగన్ తక్షణ సాయంగా రూ. లక్ష చొప్పున సాయమందించారు. క్షతగాత్రులకూ తగిన సాయాన్ని అప్పట్లో ఆయన అందించారు. ఈ ఘటనతో ఆలస్యంగా తేరుకున్న ప్రభుత్వం... మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. అయితే ఈ పరిహారం నేటికీ చాలా మందికి అందలేదు. బాధిత విద్యార్థుల్లో చాలామంది కాళ్లు చచ్చుబడిపోయి, ఆపరేషన్ సమయంలో వేసిన స్టీల్ రాడ్లను తొలగించుకునే ఆర్థిక స్థోమత లేక, మెరుగైన చికిత్సలు చేయించుకునేందుకు డబ్బు లేక మానసిక వేదన అనుభవిస్తున్నారు. నడవలేకున్నా... తల్లిదండ్రులకు భారంగా మారాను. కాళ్లు చచ్చుబడిపోయాయి. నడవలేని స్థితిలో ఉన్నాను. మాది నిరుపేద కుటుంబం. కూలినాలి చేసుకుని నా తల్లిదండ్రులు పద్మ, శ్రీనివాసులు కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రమాద జరిగినప్పుడు ప్రభుత్వం అందజేసిన రూ. 2 లక్షలు నా చికిత్సలకే అయిపోయింది. ఇంకా కోలుకోలేదు. ఓపెన్ ఇంటర్‌కు కట్టాను. ప్రభుత్వం స్పందించి ఏదైనా ఉద్యోగం ఇవ్వాలి. లేకుంటే బతుకు కష్టమవుతుంది. - మూలింటి రమణ, ఇంటర్ విద్యార్థి, మావటూరు, పెనుకొండ మండలం ఆరోజు నుంచి మంచంపైనే.. ప్రమాదం జరిగినప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాను. ప్రమాద సమయంలో ప్రభుత్వం రూ. 2లక్షలు ఇచ్చింది. ఇది ఆస్పత్రి ఖర్చులకే సరిపోలేదు. ఇప్పటికే రూ. లక్షలు ఖర్చు పెడుతూ మా తల్లిదండ్రులు రామాంజినప్ప, లక్ష్మిదేవి పలు ఆస్పత్రుల చుట్టూ నన్ను తిప్పుతున్నారు. నాపై వారు మమకారాన్ని చంపుకోలేక పోతున్నారు. 2016 ఆగస్ట్ 30న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా చికిత్సలకు, అప్పులకుగాను రూ. 8లక్షలు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఈ మొత్తం అందలేదు. - కురుబ రాధ, ఇంటర్ విద్యార్థిని మేకలపల్లి, సోమందేపల్లి మండలం ఇప్పటికీ కొడుకు ఊహల్లోనే.. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు (అశోక్) బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికీ వాడ్ని తలచుకోని ఘడియ అంటూ లేదు. మా కళ్లముందే తిరుగుతున్నట్లు ఉంటుంది. ఫొటో చూస్తే ఇప్పటికీ కళ్లు చెమర్చుతుంటాయి. ప్రతి ఏటా జనవరిన వాడి జ్ఞాపకార్థం కార్యం చేస్తుంటాం. టీచర్ కోర్సు పూర్తి చేసిన నా కుమార్తెకు ఉద్యోగం కల్పించి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. - జయమ్మ, అశోక్ తల్లి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు.. కొడుకుపైనే ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటిమి. బస్సు ప్రమాదంలో వాడ్ని పొట్టనబెట్టుకుంది. ఆర్టీసీ నుంచి ఇంత వరకూ ఎలాంటి సాయం అందలేదు. ఇంకా కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. - సన్నంజినప్ప, మృత విద్యార్థి నరేంద్ర తండ్రి, మావటూరు, పెనుకొండ మండలం పరిహారం ఇవ్వలేదు బస్సు ప్రమాదంలో నాకు రెండు చేతులు విరిగిపోయి నరకం అనుభవించాను. నేను చనిపోతానని నా కుటుంబ సభ్యులు బెంగళూరులో ఓ బ్రిడ్జి కింద నన్ను వదిలేసి వచ్చారు. బెంగళూరు మహా నగర పాలక సంస్థ అధికారులు ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించి వైద్యం చేయించారు. ప్రాణాలతో బయటపడ్డాను. ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 3 లక్షల పరిహారాన్ని నాకు ఇవ్వలేదు. - రామాంజినప్ప, చెరుకూరు -
చంపి..అవయవాలు వేరుచేసి..
మైసూరు(కర్ణాటక): రాచనగరి మైసూరులో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల వయసున్న గుర్తు తెలియని చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. తల, కాలు, చేయి వేరు చేసి చెత్తకుప్పల్లో పడేసి వెళ్లిన ఉదంతం గురువారం రాత్రి వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని గాంధీనగర సమీపంలో కుక్కలు కుళ్లిన మానవ అవయవాలను పీక్కుతింటూంటుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని హత్య చేసి తల, కాళ్లు, చేతులు వేరు చేసినట్లు గుర్తించారు. బాలుడా లేక బాలికా అనేది కూడా గుర్తు పట్టని విధంగా కత్తులతో పొడిచినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. అనంతరం అవయవాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కేఆర్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మైసూరులో రెండేళ్ల చిన్నారి హత్య
– అవయవాలను వేరు చేసిన హంతకులు మైసూరు (కర్ణాటక) : రాచనగరి మైసూరులో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల వయసున్న గుర్తు తెలియని చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. తల, కాలు, చేయి వేరు చేసి చెత్తకుప్పల్లో పడేసి వెళ్లారు. ఈ ఉదంతం గురువారం రాత్రి వెలుగు చూసింది. ఎన్ఆర్ మోహల్లా పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని గాంధీనగర సమీపంలో కుక్కలు మానవ శరీర అవయవాలను పీక్కుతింటూ పోట్లాడుకుంటుండగా స్థానికులు గమనించారు. కుళ్లిన స్థితిలో మానవ అవయవాలు కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిశితంగా పరిశీలించారు. చిన్నారిని హత్య చేసి తల, కాళ్లు, చేతులు వేరు చేసినట్లు గుర్తించారు. బాలుడా లేక బాలికా అనేది కూడా గుర్తు పట్టకుండా సున్నిత ప్రదేశంలో అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. అనంతరం అవయవాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కేఆర్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రెండేళ్లకే నూరేళ్లు
గుడివాడలో డెంగీతో చిన్నారి మృతి గుడివాడ టౌన్: డెంగీ జ్వరం గుడివాడ పట్టణంలో తిష్ట వేసింది. గతవారం రోజుల్లో మూడు మరణాలు సంభవించటం ఇందుకు నిదర్శనం. స్థానిక ధనియాల పేటకు చెందిన ఎస్కె దోష్ బీ (2) అనే చిన్నారి బాలిక డెంగీ వాధితో గురువారం మృతి చెందింది. పోయిన గురువారం జ్వరం గమనించిన తల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. శనివారం పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు డెంగ్యీ సోకిందని బుధవారం ప్లేట్లెట్స్ ఎక్కించారు. అయినప్పటికి ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం చిన్నారికి నూరేళ్లు నిండాయి. ఈ పాపకు ఇటీవలే తల్లిదండ్రులు రెండో పుట్టినరోజును ఘనంగా జరిపారు. అంతలోనే విగతజీవిగా మారడం కన్నవారితో పాటు బంధుమిత్రుల్ని తీవ్ర విషాదం నింపింది. పారిశుధ్య లేమితో దోమల బెడద పట్టణంలో పారిశుధ్య లోపం వల్ల దోమల బెడద విపరీతంగా పెరిగిపోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా దోమలు బాధిస్తున్నాయని, బురదరోడ్లు, మురుగునీటి వల్ల వాటి బెడద సమస్యగా మారిందని వాపోయారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. పట్టణంలో జ్వరాలు ఇంటింటినీ వేధిస్తున్నా వైద్య శిబిరాలు నిర్వహించడం లేదు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల్లో పండుగ వాతావరణాన్ని అపుడే నింపేసింది. గత రెండు సం.రాలుగా పెండింగ్ లో ఉన్న బోనస్ చెల్లించనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రకటించారు. ఈ డబుల్ బొనాంజాతో దాదాపు 33 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న తమ వార్షిక బోనస్ చెల్లించేందుకు అంగీకరించడంతో ఉద్యోగులు ఆనందోత్సాహాల్లో మునగనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన నిబంధనల ప్రకారం 2014-15 , 2015-16 సం.రాల బోనస్ విడుదల కానుంది. తరువాత ఇది 7 వ వేతన సంఘం కింద పరిధిలోకి వస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేఖరులకు చెప్పారు. -
మల్లన్నసాగర్ నిర్మాణాన్ని అడ్డుకోవద్దు
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ నారాయణఖేడ్: రెండేళ్లలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని, ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు సరికాదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ తెలిపారు. ఆదివారం నారాయణఖేడ్ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లన్నసాగర్ నిర్మాణం పూర్తయితే ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. సింగూరు ప్రాజెక్టులో సైతం నీరు నింపేలా ప్రభుత్వం ప్రణాళికలు తయారుచేసిందన్నారు. చెరువులు నిండితే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇతర రాష్ట్రాలు నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్.. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబాకర్, మార్కెట్ యార్డుల నిర్మాణం, రహదారులు, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నట్లు తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గం సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సమావేశంలో సర్పంచ్ అప్పారావుషెట్కార్, గొర్రెలకాపరుల సహకార సంఘం జిల్లా చైర్మన్ మల్శెట్టి యాదవ్, జెడ్పీటీసీలు నిరంజన్, రవి, టీఆర్ఎస్ నాయకులు పండరియాదవ్, మూఢ రామకృష్ణ, పురంజన్, బాసిత్, వెంకట్‌నాయక్, రవీందర్‌నాయక్ ఉన్నారు. మొక్కలు నాటిన మురళీయాదవ్ నారాయణఖేడ్‌లోని చేనేత సహకార సంఘం భవనం వద్ద టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, సర్పంచ్ అప్పారావుషెట్కార్, టీఆర్ఎస్ ఖేడ్ అధ్యక్షుడు ప్రభాకర్ మొక్కలు నాటారు. -
తల్లితో మోదీ ఫొటోకు భారీస్పందన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇటీవల తన తల్లితో అధికారిక నివాసంలో దిగిన ఫోటోకు 17 లక్షలకు పైగా స్పందనలు వచ్చాయని ఫేస్బుక్ వెల్లడించింది. ఎన్డీఏ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఫేస్బుక్ ద్వారా మోదీ తన పాలనను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లారో వివరిస్తూ.. కథనాన్ని విడుదల చేసింది. ఇందులో మోదీ తన తల్లితో దిగిన ఫొటోకు అత్యధికంగా లైక్‌లు రాగా.. డిజిటల్ ఇండియా కోసం ఫేస్బుక్ సీఈవోను కలిసిన చిత్రం, ఒబామా, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌లతో దిగిన చిత్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అటు కేంద్ర మంత్రులు కూడా.. ఫేస్బుక్ ద్వారా ప్రజలకు చేరువయ్యారని వెల్లడించింది.మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా పథకాలకు ప్రజల్లో అనూహ్యమైన స్పందన వచ్చినట్లు ఫేస్బుక్ తెలిపింది. కాగా, ఫేస్బుక్లో అత్యంత ప్రజాదరణ కలిగిన రెండో ప్రముఖుడిగా మోదీ రికార్డు సృష్టించారని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా మొదటి స్థానంలో ఉండగా.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మూడో స్థానంలో ఉన్నారు. -
ఒక్క ఫేస్బుక్ పోస్టుకు 3.4 కోట్ల లైకులు!
న్యూఢిల్లీ: నేటితో రెండేళ్ల పాలన ముగిసిన సందర్భంగా.. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ద్వారా మోదీ ప్రభుత్వం తన ఎజెండాను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లారో కంపెనీ ఓ విశ్లేషణను వెలువరించింది. కేంద్ర మంత్రులందరూ ఏ, లైవ్, ఇన్స్టంట్ ఆర్టికల్స్, నోట్స్ తదితరాలను గత ఏడాదిగా విరివిరిగా ఉపయోగించినట్లు తెలిపింది. 2014లో మే 26 నుంచి 2016 మే 23 వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫేస్బుక్లో పెట్టిన పోస్టులలో తన తల్లితో పెట్టిన పోస్టుకు అత్యధికంగా 34,047,024 లైక్స్ వచ్చినట్లు వివరించింది. డిజిటల్ ఇండియా ఇనీషియేటివ్స్ గా ఫేస్బుక్ సీఈవో ను కలిసిన పోస్ట్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్ లతో ఉన్న పోస్టులు తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వంలో ఉన్న 50 మంది కేబినెట్ మంత్రుల అకౌంట్లలో 47 అకౌంట్లు ఫేస్ బుక్ వెరిఫై చేసినవేనవి చెప్పింది. లైక్స్, షేర్స్, కామెంట్స్, యావరేజ్, డైలీ పోస్టులు, పేజీ సైజు తదితారాల ఆధారంగా 10 మంది కేంద్రమంత్రులకు ర్యాంకులను ప్రకటించింది. ర్యాంకుల వివరాలు 1.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2.కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ 3. మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ 4. ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 5. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ 6. విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ 7. కమ్యూనికేషన్స్ మంత్రి రవి శంకర్ ప్రసాద్ 8. రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 9. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు 10. మాజీ క్రీడాశాఖ మంత్రి, అసోం ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ తర్వాతి స్థానాల్లో మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్, సమాచార ప్రసారశాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ తదితరులు ఉన్నారు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన అనురాగ్ ఠాకూర్, స్మృతీ ఇరానీలు ఫేస్ బుక్ లైవ్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ప్రజలకు చేరువవుతున్నట్లు కంపెనీ వివరించింది. ప్రధానమంత్రి మోదీ వెబ్ సైట్ నరేంద్రమోదీ.ఇన్ ఫేస్ బుక్ లైవ్ ద్వారా ప్రజలను చేరినట్లు చెప్పింది. ఈ వెబ్ సైట్ ద్వారా ప్రచురితమైన పోస్టులను ఫేస్బుక్ వీక్షకులు లక్షలసంఖ్యలో చూస్తున్నట్లు తెలిపింది. టూరిజం, వ్యవసాయం, డిజిటల్ ఇండియా, రైల్వేలు, మహిళ సంక్షేమం, సాధికారత, ఆర్ధిక రంగం, డిఫెన్స్, ఆయుష్ తదితరాలను ప్రధాని వెబ్ సైట్ తరచు పోస్టు చేసినట్లు తెలిపింది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా పథకాలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన ఉంటోందని వివరించింది. -
ఆయన జీతం.. రూ. 74 కోట్లు!
బెంగళూరు: ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా జీతం భారీగా పెరిగింది. తాజాగా ఇన్ఫోసిస్ విడుదల చేసిన ఫలితాల్లో కంపెనీ మంచి లాభాలు ఆర్జించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ఆయన దాదాపు 74 కోట్ల రూపాయలను జీతభత్యాలుగా అందుకోనున్నారు. 2016 ఆర్థిక సంవత్సరంలో సిక్కా ఇన్ఫోసిస్ ఆదాయాన్ని 63,446 కోట్ల రూపాయలకు చేర్చారు. అక్కడితో ఆగిపోకుండా నాస్ కామ్ అంచనాలను తలక్రిందులు చేస్తూ 13.3 శాతం వృద్ధిని కూడా నమోదు చేసింది. దీంతో కంపెనీ సీఈవోగా సిక్కా పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పెంచింది. అంటే 2021 వరకు సిక్కానే ఇన్ఫోసిస్ సీఈవోగా కొనసాగనున్నారు. సిక్కా పే స్కేల్లో మార్పులతో కంపెనీ సీనియర్ల జీతభత్యాల్లో కూడా మార్పులు రానున్నాయి. అయితే, మిగతా ఉద్యోగుల జీతాలను కంపెనీ వెల్లడించలేదు. రెండేళ్ల క్రితం ఇన్ఫోసిస్ భారీ నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే. -
విశాఖలో అదృశ్యమైన బాలుడి హత్య
-
రెండేళ్లా.. ఏడేళ్లా?
-
రెండేళ్లా.. ఏడేళ్లా?
రెండేళ్లలో పూర్తి చేస్తాం.. ముఖ్యమంత్రి మాట! నాలుగేళ్లలో పూర్తవుతుంది.. ప్రభుత్వ ఉత్తర్వు! ఏడేళ్ల సమయం పడుతుంది.. ప్రపంచబ్యాంకుకు నివేదిక!! పాలమూరు ప్రాజెక్టు పూర్తిపై ఏమాట నిజం? - రెండేళ్లలో పూర్తి చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం - తాజాగా జారీ చేసిన ఉత్తర్వులో నాలుగేళ్లు - ప్రపంచబ్యాంకుకు ఇచ్చిన నివేదికలో ఏడేళ్లు - ప్రభుత్వ ప్రకటనలపై అంతా అయోమయం - పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే - 7 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం - అయినా వాటిపై మౌనముద్ర సాక్షి, హైదరాబాద్: పది లక్షల ఎకరాలకు సాగునీరు.. జంట నగరాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎప్పుడు పూర్తవుతుందన్న అంశంపై ప్రభుత్వం పొంతనలేని ప్రకటనలు చేస్తోంది. రూ.35,200 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఒక మాట, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో మరో మాట, ప్రపంచబ్యాంకుకు ఇచ్చిన నివేదికలో ఇంకో విషయం ఉండడంతో ఏది నిజమో తెలియక అటు అధికారులు, ఇటు పాలమూరు నేతలు, ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే 80 శాతానికిపైగా పూర్తయి ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే నాలుగు ప్రాజెక్టుల పూర్తిపై మౌనం దాల్చి.. కొత్తగా పాలమూరు ప్రాజెక్టును అందలమెక్కించడంపైనా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్కోమారు ఒక్కోలా... పాలమూరుపై ప్రభుత్వం ఒక్కో వేదికపై ఒక్కోలా వ్యవహరిస్తోంది. ప్రాజెక్టు సత్వర పూర్తికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తూ ఈ నెల ఒకటిన ఇచ్చిన జీవో 143లో 48 నెలల(నాలుగేళ్లు) కాలంలో పూర్తి చేయాలని నీటి పారుదల శాఖకు సీఎం మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు. అందుకు తగ్గట్లే ప్రాజెక్టుకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసి నిర్ణీత కాలంలో పూర్తి చేస్తామని వివరించారు. ఈ లెక్కన ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఏటా రూ.9 వేల కోట్ల మేర ఖర్చు చేయాలి. శనివారం ప్రాజెక్టుపై సమీక్షించిన ముఖ్యమంత్రి.. రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. అంటే ఏటా రూ.18 వేల కోట్లు కేటాయించాలి. ఇప్పటికే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి(జూన్ 11) మూడు నెలలు గడుస్తున్నా.. పూర్తిస్థాయి సర్వేనే పూర్తికాలేదు. అలాంటిది ప్రాజెక్టును రెండే ళ్లలో పూర్తి చేయడం ఎలా సాధ్యమని నీటి పారుదల రంగ నిపుణులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం నిర్మాణంలో 25 ప్రాజెక్టులతో పాటు, కొత్తగా చేపడుతున్న పాలమూరు, నక్కలగండి తదితర పథకాలకు కలిపి మొత్తంగా రూ.1,03,051 కోట్ల అవసరాలు ఉన్నాయని ప్రభుత్వం నెల రోజుల కిందట ప్రపంచబ్యాంకుకు తెలిపింది. ఇందులో కొత్తగా చేపడుతున్న పాలమూరుకు రూ.35,200 కోట్లు అంచనా వే సింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.13,400 కోట్లు, తర్వాతి మూడేళ్లలో 2021-22 నాటికి మరో రూ.21,800 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొంది. అంటే ఈ ప్రభుత్వ గడువు ముగిసే నాటికి(2018-19) పాలమూరులో కేవలం మూడో వంతు పనులు మాత్రమే పూర్తయ్యే అవకాశం ఉంటుందని వివరించింది. ఇలా పొంతనలేకుండా చేస్తున్న ప్రకటనల్లో దీనిలో ఏది నిజమో? ఏది అబద్ధమో తెలియని పరిస్థితి నెలకొంది. పాత ప్రాజెక్టుల సంగతేంటీ? పాలమూరు జిల్లాలోనే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 85 శాతానికి పైగా పూర్తయ్యాయి. అయితే అపరిషృ్కతంగా ఉన్న భూసేకరణ, పునరావాసం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి ఏడాదిన్నరగా ముందుకు కదల్లేదు. దీంతో ఆయకట్టు లక్ష్యాలు ఏడాదికేడాది తగ్గుతున్నాయి. ఈ ప్రాజెక్టుల కింద మొత్తంగా 8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఈ ఏడాది ఖరీఫ్ నాటికే 3 లక్షలకు పైగా ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయంచినా సాధ్యం కాలేదు. రైల్వే, రహాదారుల క్రాసింగ్ సమస్య, ఎస్కేలషన్ చార్జీలను పెంచాలన్న కాంట్రాక్టర్ల డిమాండ్‌పై ప్రభుత్వం తేల్చకపోవడం వంటి అంశాలూ గుదిబండగా మారాయి. దీంతో ప్రస్తుత బడ్జెట్లో రూ.660 కోట్ల మేర కేటాయింపులు జరిపినా ఇప్పటివరకు రూ.20 కోట్ల మేర కూడా ఖర్చు జరుగలేదు. తాజాగా ఈ ప్రాజెక్టుల కింద.. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తామని చెబుతున్నారు. కేవలం వెయ్యి కోట్ల మేర ఖర్చు చేస్తే 7 లక్షల ఆయకట్టును ఇచ్చే ప్రాజెక్టులపై మౌనం దాల్చి.. కొత్త ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్‌లో 7 లక్షల ఆయకట్టుకు నీరిస్తామనడంలో ఆతర్యమేమిటో అర్థంగాక పాలమూరు రైతులు తలలు పట్టుకుంటున్నారు. -
నలభై ఏళ్ల వయసులోనూ పిల్లల్ని కనొచ్చు!
పెళ్లయ్యేంతవరకూ పెళ్లెప్పుడు? అని అడుగుతుంటారు. పెళ్లయ్యాక.. పిల్లలు ఎప్పుడని అడుగుతుంటారు. ఈ ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు సైఫ్ అలీఖాన్ని పెళ్లి చేసుకోవడం ద్వారా కరీనా కపూర్ సమాధానం చెప్పేశారు. ఇప్పుడు పిల్లలకు సంబంధించిన ప్రశ్న ఆమెను వెంటాడుతోంది. ఇటీవల ఓ విలేకరి ఆమెను ఈ విషయం గురించి అడిగితే - ‘‘మరో రెండేళ్లల్లో అమ్మనవుతా’’ అన్నారు. మరి.. వయసు సంగతేంటి? అని ఆ జర్నలిస్ట్ అడిగితే - ‘‘మొదట్నుంచీ ఎప్పుడు ఏది చేయాలనే విషయం మీద నాకో ప్రణాళిక ఉంటుంది. అలాగే, నచ్చినప్పుడు చేయడం అలవాటు. స్టార్ హీరోయిన్ కావాలనుకున్నా. అయ్యాను. పెళ్లి చేసుకోవాలనుకున్నా.. చేసుకున్నాను. నాకెప్పుడు అనిపిస్తే అప్పుడు అమ్మ అవుతా. ఆ మాటకొస్తే మరో రెండేళ్ల వరకూ తల్లి కావాలని అనుకోవడంలేదు. నలభై ఏళ్ల వయసులో కూడా పిల్లల్ని కనొచ్చు కదా. కంగారెందుకు?’’ అని కొంచెం ఘాటుగానే స్పందించారు. ఇటు మీడియా అనే కాకుండా కరీనాకి కావల్సినవాళ్లు కూడా పిల్లల గురించి అడుగుతున్నారట. ఆ ప్రశ్నకు విసుగు చెందే కరీనా ఇలా స్పందించి ఉంటారని ఊహించవచ్చు. -
రెండున్నరేళ్లలో స్కైసిటీ!
నగరంలో ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధికి రూ. 2,631కోట్లు ⇒పరిపాలనా అనుమతి ⇒మంజూరు చేసిన ప్రభుత్వం ⇒ఈపీసీ విధానంలో టెండర్లు.. త్వరలో నోటిఫికేషన్ ⇒నిర్మాణానికి రెండున్నరేళ్ల గడువు.. కాంట్రాక్టు సంస్థదే నిర్మాణ వ్యయం ⇒పనులు పూర్తయ్యాక పదేళ్లలో ⇒20 వాయిదాలుగా చెల్లింపులు.. చెల్లింపు బాధ్యత జీహెచ్ఎంసీదే... ⇒రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఎటువంటి ట్రాఫిక్, సిగ్నల్ ఆటంకాలు లేకుండా ప్రయాణం సాగించేలా 20 ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ‘స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ)’ కింద రూ. 2,631కోట్ల పనులకు శుక్రవారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఎస్ఆర్డీపీ పనులపై ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకు అధునాతన స్కైవేలు, ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు/ ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఇందుకుగాను మూడు నాలుగు రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ఇరవై ప్రాంతాల్లో.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ నివారణకు రూ.20వేల కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించినా.. తొలిదశలో అత్యంత ప్రాధాన్యత కలిగిన 20 ప్రదేశాలను ఎంపిక చేశారు. ఈ పనులను ఈపీసీ విధానంలో చేపట్టనున్నారు. దీని ప్రకారంటెండరు దక్కించుకున్న సంస్థే పూర్తి వ్యయాన్ని భరించి ప్రాజెక్టును పూర్తిచేస్తుంది. అనంతరం ఆరుమాసాలకోమారు చొప్పున 20 ఇన్స్టాల్మెంట్లలో (మొత్తం పదేళ్లలో) జీహెచ్ఎంసీ ఆ సొమ్మును సదరు సంస్థకు చెల్లిస్తుంది. ఈ పనులను రెండున్నరేళ్లలో పూర్తిచేయాలనేది లక్ష్యంకాగా.. మూడో సంవత్సరం ఆరంభం నుంచి తిరిగి చెల్లింపును ప్రారంభిస్తారు. వాయిదాలను జీహెచ్ఎంసీ చెల్లించలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధికి స్థలం అందుబాటులో ఉన్న చోట కాంట్రాక్టు సంస్థలతో వెంటనే ఒప్పందం కుదుర్చుకుని పనులు ప్రారంభించాలని.. మిగతా చోట్ల స్థలం అందుబాటులోకి రాగానే ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు. పనిని మొత్తం ఒకరే చేయలేని పక్షంలో జాయింట్ వెంచర్‌గా గరిష్టంగా మూడు సంస్థలు కలసి చేసేలా అవకాశం కల్పించనున్నారు. దేశంలో ఈ విధానం ద్వారా భారీ ప్రాజెక్టులు చేపట్టిన తొలి మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసీ మిగలనుంది. భారీ ప్రాజెక్టు కావడంతో షాపూర్జీ పల్లోంజి, ఎల్అండ్టీలతో సహ పలు గ్లోబల్ సంస్థలు టెండర్లో పాల్గొంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఖర్చు ఎక్కువైనా.. ఫ్లైఓవర్ల నిర్మాణాల్లో కొంత ఖర్చు ఎక్కువైనా సిమెంట్ కాంక్రీట్ కాకుండా ఐరన్ గడ్డర్స్‌ను వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీని ద్వారా ఖర్చు 25 శాతం పెరిగినా.. 40 శాతం సమయం ఆదా అవుతుందని అంచనా వేశారు. ఇక జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వద్ద ఆరు లేన్లతో మల్టీలెవెల్ స్పైరల్ ఫ్లైఓవర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. దీని అంచనా వ్యయం రూ.170కోట్లు. మిగతా ప్రాంతాల్లో నిర్మించే ఫ్లైఓవర్ల ఖర్చు సగటున దాదాపు రూ.50కోట్లు. వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు ఆయా జంక్షన్లలో అవసరాన్ని బట్టి ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు (ఒకటి/రెండు/మూడు లెవెల్స్‌లో ఫ్లైఓవర్లు) ఏర్పాటు చేయనున్నారు. పనులు చేపట్టే జంక్షన్లివే.. కేబీఆర్ పార్కు ప్రవేశద్వారం, మహారాజ అగ్రసేన్ జంక్షన్, కేన్సర్ ఆస్పత్రి, ఫిల్మ్‌నగర్, రోడ్ నంబరు 45, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఎల్బీనగర్, బైరామల్‌గూడ, కామినేని ఆస్పత్రి, చింతలకుంట చెక్‌పోస్టు, రసూల్‌పురా, ఉప్పల్, ఒవైసీ హాస్పిటల్, బయోడైవర్సిటీ పార్కు, అయ్యప్ప సొసైటీ, రాజీవ్‌గాంధీ విగ్రహం, బహదూర్‌పురా, అబిడ్స్ జీపీవో-చాదర్‌ఘాట్, మలక్‌పేట, సైబర్ టవర్స్ (ఎలివేటెడ్ రోటరీ కమ్ గ్రేడ్), మైండ్‌స్పేస్ (వీటిల్లో గ్రేడ్ సెపరేటర్లు/ఫ్లైఓవర్లు/జంక్షన్ల అభివృద్ధి, ఇతరత్రా పనులున్నాయి). -
'రెండేళ్లలో 24 గంటల కరెంట్ ఇస్తాం'
-
రెండేళ్లలో 30 వాహనాలు కొట్టేశారు
తిరుచానూరు (చిత్తూరు): సులభంగా డబ్బు సంపాదించి సుఖంగా జీవించాలన్నది వారి ఆశ. అందుకోసం ద్విచక్ర వాహనాలను తస్కరించడం మొదలుపెట్టారు. రెండేళ్లలో సుమారు 30 వరకు ద్విచక్ర వాహనాలను కొట్టేసి వాటిని తమిళనాడులోని తమ స్వగ్రామం గురువరాజుపేటలో దాచిపెట్టారు. మంగళవారం చిత్తూరు జిల్లా తిరుపతికి వస్తుండగా.. పూడిరోడ్డు, పాడిపేట క్రాస్‌రోడ్డు వద్ద పోలీసుల తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు. బి.ఉమాశంకర్, పి.తిరునావక్కరసు, ఎన్.వెంకటేశన్ తదితర నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి నిజాలను కక్కించి, బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. దొంగలించిన 30 మోటారు సైకిళ్లను ఒకే సారి చెన్నైలో అమ్మి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనతో నిందితులు వాటిని తమ స్వగ్రామంలో దాచి ఉంచినట్టు వెల్లడైంది. దీంతో తమిళనాడుకు వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
రెండేళ్లలోనే వాటర్ గ్రిడ్!
ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సన్నద్ధం కావాలి అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసేందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గ్రామీణ నీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్) విభాగం అధికారులను ఆదేశించారు. పక్కా ప్రణాళికతో పాటు అధికారులు, సిబ్బంది కలసి చిత్తశుద్ధితో పనిచేస్తే గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యమేనన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించడం ద్వారా అందరి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఆశయం కూడా నెరవేరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ వాటర్‌గ్రిడ్ నీటి వనరుల గుర్తింపు, అలైన్మెంట్ ఖరారు, ట్రీట్మెంట్ ప్లాంట్ల స్థాపన తదితర అంశాలపై బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం అధికారులతో సమీక్షించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు కె.తారక రామారావు, జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ కార్యదర్శి రేమండ్ పీటర్, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు సురేందర్‌రెడ్డి, బాబురావు, చక్రపాణి, ప్రభుత్వ సలహాదారు ఉమాకాంత్‌రావు తదితరులు పాల్గొన్నారు. భౌగోళిక స్థితి ఆధారంగా..: వివిధ జిల్లా ల్లో భౌగోళిక పరిస్థితులు, జనాభా అధారంగా ఎక్కడికక్కడే గ్రిడ్ పనుల కోసం ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. వాటర్ గ్రిడ్ మొత్తం ‘గ్రావిటీ క మ్ లిఫ్ట్’ పద్ధతిలో ఉండాలన్నారు. నీటిని శుద్ధి చేశాకే గుట్టలపైకి పంపాలని, రివర్స్ ఇంజనీరింగ్ మాదిరి.. గుట్టపైకి పంపిన నీటిని గ్రావిటీ ద్వారా మళ్లీ కిందకు పంపి జనావాసాలకు నీరందించాలన్నారు. రెండు లేదా మూడు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నీటిని పంపింగ్ చేసేందుకు ఎంత విద్యుత్ అవసరం, ఎక్కడెక్కడ సబ్స్టేషన్లు నిర్మించాలి తదితర అంశాలపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పనులకు సమాంతరంగా విద్యుత్ పనులు కూడా నిర్వహించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని మంచినీటి కోసమే కేటాయించాలని స్పష్టంచేశారు. వాటర్ గ్రిడ్‌కు నీటి కొరతగానీ, నిధుల కొరతగానీ లేదన్నారు. రిజర్వాయర్లలోని నీటిని మంచినీటి గ్రిడ్ల కోసం వాడుకోవడానికి అనుమతిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని వివరించారు. ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం ఆనీకట్ పెంచే అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 8 గంటల పాటు సమీక్ష..: వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై కేసీఆర్ గత రెండ్రోజులుగా సుదీర్ఘం గా సమీక్ష జరిపారు. మంగళవారం కొన్ని అంశాలపై చర్చించిన సీఎం బుధవారం మిగిలిన అంశాలపై ఏకంగా ఎనిమిది గంటలపాటు సమీక్షించడం విశేషం. సమీక్షలో ప్రధానంగా.. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో గ్రిడ్ పనులు ఎలా నిర్వహించాలి, ఎక్కడెక ్కడ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి, ఏఏ వనరుల నుంచి నీటిని తీసుకోవాలి, సమీపంలో ఉన్న గుట్టలు ఏంటి, ఎన్ని మీటర్ల మేర నీటిని లిఫ్టు చేయాలి తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. కాంటూర్ ఎత్తులు గుర్తించి ఏవేవి వాటర్ గ్రిడ్లకు ఉపయోగ కరమో నిర్ధారించారు. -
‘తారకరామా...’ కూలీ గోడు వినుమా
సిరిసిల్ల : రాత్రీ పగలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నా... నేతకార్మికులకు నమ్మకమైన ఉపాధి కరువవుతోంది. యజమానుల కనుసన్నల్లో సాగే వస్త్ర వ్యాపారం నేతన్నల కడుపు నింపలేకపోతోంది. రెండేళ్ల క్రితం కుదిరిన కూలి ఒప్పందం గడువు శుక్రవారంతో ముగియనుండగా కొత్త ఒప్పందం కోసం కార్మికులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. మంత్రి కేటీఆర్ చొరవ చూపితే కొత్త కూలి ఒప్పందం కార్మికుల్లో వెలుగులు నింపనుంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మూడంచెల వ్యవస్థ కొనసాగుతోంది. యజమానులు నూలు కొనుగోలు చేసి బీములు పోసి ఆసాములకు అందిస్తారు. ఆసాములు తమ సాంచాలపై కార్మికులతో కలిసి వస్త్రాన్ని నేస్తారు. మూడంచెల విధానంలో యజమానులదే కీలకపాత్ర. ప్రైవేటు రంగంలో ఉన్న ఈ పరిశ్రమపై పాతికవేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. రెండేళ్లకోసారి సిరిసిల్లలో కూలి ఒప్పందం జరుగుతుంది. వస్త్రం మందం (పిక్కుల)పై ఒప్పందం ఆధారపడి ఉంటుంది. 2012 డిసెంబర్లో జరిగిన కూలి ఒప్పందం గడువు శుక్రవారంతో ముగియనుంది. రాష్ట్రం మొత్తంలో 72 వేల మరమగ్గాలు ఉండగా, ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలున్నాయి. ఇందులో పాలిస్టర్ మరమగ్గాలు 27 వేలు. వీటిలో నిత్యం 25 లక్షల మీటర్ల పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వస్త్రం విక్రయం ద్వారా వచ్చే డబ్బుతో ఆసాములు, కార్మికులకు కూలి లభిస్తుంది. ప్రస్తుతం పాలిస్టర్ పరిశ్రమలో కూలి ఒప్పందం కోసం కార్మిక సంఘాలు ముందుకొస్తున్నాయి. ఈ నెల 8న వస్త్ర పరిశ్రమను పూర్తిస్థాయిలో బంద్ చేసి మెరుపు సమ్మె చేయాలని సీఐటీయూ, ఏఐటీయూసీ పిలుపునిచ్చాయి. ఒక్కరోజు సాంచాలు బంద్ ఉన్నా పాతికవేల మంది కార్మికులకు ఉపాధి కరువవుతుంది. మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు, ఇల్లు కిరాయి, స్కూల్‌ఫీజులు, వైద్యఖర్చులు తదితర వాటికి దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కనీస వేతనమేదీ? మరమగ్గాలు దాని అనుబంధ పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలు కావడం లేదు. 2009లో జారీ అయిన జీవో 53 ప్రకారం.. పది పిక్కులకు 18 పైసలు కూలి చెల్లించాలి. కానీ, ఈ మేర చెల్లించడానికి యజమానులు నిరాకరిస్తున్నారు. ప్రతీసారి జీవో జోలికి వెళ్లకుండానే చర్చలు సాగుతుంటాయి. కొత్త కూలి ఒప్పందం కోసం యజమానులకు నెల కిందటే వినతిపత్రాలు సమర్పించినా వారి నుంచి స్పందన లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అసంఘటిత రంగ కార్మికులైన నేతన్నలకు పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ లాంటి సౌకర్యాలు దక్కడం లేదు. ఉద్యోగ భద్రత లేక.. సామాజిక భద్రత కరువై నేతన్నల బతుకు దినదినగండంగా మారింది. పన్నెండు గంటలు పని రోజూ పన్నెండు గంటల పాటు ఎనిమిది సాంచాలు నడుపుతూ శ్రమిస్తే ఒక్క నేతన్నకు సగటున నెలకు వచ్చే కూలి రూ.5 వేలు దాటడం లేదు. సిరిసిల్లలో వారం వారం కూలి చెల్లించడంతో ఏ ఒక్క నెల కూడా పూర్తిస్థాయి వేతనం చేతికందే పరిస్థితి లేదు. ఫలితంగా శ్రమఫలాన్ని ఒక్కనెలలోనే నాలుగుసార్లు తీసుకోవడంతో ఆదాయం.. ఖర్చులకు సమానం అవుతోంది. చేతిలో మిగిలేది లేక శుభకార్యం జరిగినా.. విషాదాలు చోటుచేసుకున్నా.. అనారోగ్యం బారిన పడినా అప్పులవేటలో పడాల్సిందే. దీంతో వీరు భారంగా కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కేటీఆర్‌పైనే ఆశలు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన కేటీఆర్‌కు వస్త్రోత్పత్తి రంగంపై పూర్తిస్థాయి అవగాహన ఉంది. నేత, చేనేత రంగాలపై లోతైన పట్టున్న మంత్రి నేత కార్మికుల కూలి ఒప్పందంపై చొరవ చూపితే నేతన్నలకు మెరుగైన ఉపాధి లభించే అవకాశముంది. ప్రభుత్వ పరంగానూ కూలి ఒప్పందానికి చట్టబద్ధత కల్పిస్తే దీర్ఘకాలిక ప్రయోజనం దక్కుతుంది. శుక్రవారం సిరిసిల్లకు వస్తున్న మంత్రి కేటీఆర్ కూలి ఒప్పందంపై చొరవ చూపి మేలు చేస్తారని కార్మికలోకం ఆశిస్తోంది. -
వయోపరిమితి పెంపు రెండేళ్లే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ట వయోపరిమితిని రెండేళ్లు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఐదేళ్లు పెంచాలని నిరుద్యోగుల డిమాండ్‌ను పక్కనబెట్టి రెండేళ్ల పెంపునకే సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్) ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. 2011లో గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లు పెంచాలని కోరినా ప్రభుత్వం రెండేళ్లకే పరిమితం చేసింది. 2012లో గ్రూపు-1, గ్రూపు-2 వంటి కీలక నోటిఫికేషన్లు ఇవ్వలేదు. జారీ చేసిన కొన్నింటికి వయోపరిమితి పెంపును విస్మరించింది. 2012 డిసెంబరులో ఉద్యోగ పరీక్షల వార్షిక కేలండర్‌కు, గ్రూపు-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూపు-1లో విలీనం (గ్రూపు-1బీగా) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 2013లో నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టింది. 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 36 ఏళ్లు చేస్తూ (రెండేళ్లు పెంచుతూ) ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ 65 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చింది. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, వీఆర్ఏ మినహా మరే నోటిఫికేషన్ జారీ కాలేదు. డిసెంబరు 31తో ఆ ఉత్తర్వుల గడువు ముగిసిపోయింది. ప్రస్తుతం గ్రూపు-1, జోనల్ వ్యవస్థ కలిగిన పోస్టులు మినహా మిగతా పోస్టుల భర్తీ కోసం నియామక సంస్థలు ఇండెంట్లు తెప్పిస్తున్నాయి. ప్రభుత్వం రెండేళ్ల గరిష్ట వయోపరిమితి పెంపునకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.