
వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళల భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు సీఎం వైఎస్ జగన్. రెండేళ్ల పాలన కాలంలో మహిళ భద్రత విషయంలో రాజీలేని ధోరణి కనబరిచారు. మహిళలపై అఘాయిత్యాలు అరికట్టే లక్ష్యంతో కొత్తగా దిశా చట్టం తెచ్చారు. ఈ చట్టం పక్కాగా అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశా పోలీస్ స్టేషన్లు ప్రారంభించి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారు. కేవలం చట్టం చేయడం, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతోనే సరిపెట్టుకోలేదు దాన్ని అమలు చేసేందుకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చారు.
ప్రత్యేకంగా మహిళ రక్షణ కోసం గస్తీ కాసేందుకు 900 దిశా పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు. అంతేకాదు ఘటనా స్థలంలో ఆధారాలు పకడ్బందీగా సేకరించేందుకు 18 ఇంటిగ్రేటెడ్ క్రైమ్ సీన్ మేనేజ్‌మెంట్ వెహికల్స్‌ని కూడా రెడీ చేశారు. దీని వల్ల నేరాలు చేసిన వ్యక్తులకు శిక్షలు పడేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేపడితే పక్కాగా చేయడం సీఎం జగన్ నైజం అని చెప్పేందుకు ఈ పనులు మరో ఉదాహరణగా నిలుస్తున్నాయి.
హెల్ప్‌డెస్క్‌లు
రాష్ట్రవ్యాప్తంగా 700 దిశా హెల్ప్ డెస్కులు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో 12 లక్షల మందికి పైగా మహిళలు అభయం యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో ఎవరైనా ఆపదలో ఎస్‌ఓఎస్ బటన్ నొక్కితే చాలు వెంటనే వారికి రక్షణగా వచ్చేందుకు పెట్రోలింగ్ వాహనాలు అన్ని వేళల్లో సిద్ధంగా ఉంటాయి. ఇటీవల కాలంలో మహిళలపై పెరిగిపోయిన సైబర్ నేరాలను అరికట్టేందుకు నడుం ఏపీ ప్రభుత్వం బిగించింది. మహిళలను సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు 50 సైబర్ కియోస్కులు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment