
తల్లితో మోదీ ఫొటోకు భారీస్పందన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇటీవల తన తల్లితో అధికారిక నివాసంలో దిగిన ఫోటోకు 17 లక్షలకు పైగా స్పందనలు వచ్చాయని ఫేస్‌బుక్ వెల్లడించింది. ఎన్డీఏ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఫేస్‌బుక్ ద్వారా మోదీ తన పాలనను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లారో వివరిస్తూ.. కథనాన్ని విడుదల చేసింది. ఇందులో మోదీ తన తల్లితో దిగిన ఫొటోకు అత్యధికంగా లైక్‌లు రాగా.. డిజిటల్ ఇండియా కోసం ఫేస్‌బుక్ సీఈవోను కలిసిన చిత్రం, ఒబామా, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌లతో దిగిన చిత్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అటు కేంద్ర మంత్రులు కూడా..
ఫేస్‌బుక్ ద్వారా ప్రజలకు చేరువయ్యారని వెల్లడించింది.మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా పథకాలకు ప్రజల్లో అనూహ్యమైన స్పందన వచ్చినట్లు ఫేస్‌బుక్ తెలిపింది. కాగా, ఫేస్‌బుక్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన రెండో ప్రముఖుడిగా మోదీ రికార్డు సృష్టించారని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా మొదటి స్థానంలో ఉండగా.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మూడో స్థానంలో ఉన్నారు.