ఔను! మేము అధికారం కోసమే కలిశాం! | Uddhav Thackeray's Swipe At BJP Yes We Came Together For Power | Sakshi
Sakshi News home page

ఔను! మేము అధికారం కోసమే కలిశాం: బీజేపీ పై ఉద్ధవ్‌ థాకరే ఫైర్‌

Published Mon, Apr 3 2023 7:52 AM | Last Updated on Mon, Apr 3 2023 8:10 AM

Uddhav Thackeray's Swipe At BJP Yes We Came Together For Power - Sakshi

ప్రధాని మోదీ డిగ్రీల వివరాలను అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు రూ.25 వేలు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శివసేన నాయకుడు ఉద్ధవ్‌ థాకరే ప్రధాని మోదీ డిగ్రీ వివాదంపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేని యువకులు ఎంతమందో ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ఈ ప్రధాని మోదీని డిగ్రీ చూపించమని అడిగితే జరిమానా విధిస్తారేంటి? అని సెటైర్లు వేశారు. అయినా మా కాలేజిలోనే మోదీ చదువుకున్నాడని గర్వంగా ఫీలవుతూ ఏ కాలేజీ చెప్పేందుకు ముందుకు రావడకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ విమర్శించారు.

నిజానికి అసలు ప్రధాని చదువకున్నారా అంటూ అనుమానం లేవనెత్తారు. ముఖ్యమంత్రి కావలనే ఉద్దేశ్యంతోనే సైద్ధాంతికంగా భిన్నమైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారంటూ బీజేపి చేస్తున్న ఆరోపణలకు థాకరే గట్టి బదులు ఇచ్చారు. ఔను మేము అధికారం కోసమే కలిశాం. కానీ దానిని కోల్పోయినప్పటికీ ఇంకా కలిసే ఉన్నాం, మరింత బలంగా ఉన్నాం అని థాకరే అన్నారు. అలాగే సేన నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి బీజేపీతో కొత్త ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారో ప్రస్తావిస్తూ..అవకాశం కుదరినప్పుడల్లా బీజేపీ ప్రజలను లోబర్చుకుంటుందని, సరిగ్గా ఎన్నికల సమయంలో మరింతగా మాయమాటలతో మోసం చేస్తోందని ఆరోపించారు.

కాగా, బీజేపీ తనను హిందూత్వాన్ని విడిచిపెట్టానని నిందలు వేస్తోంది. నేను హిందూత్వాన్ని విడిచిపెడుతున్నాను అనడానికి ఒక్క ఉదాహరణ చెప్పగలారా?. రాజ్యంగంపై ప్రమాణం చేసేందుకు నేను సిద్దమే మీరు ధృవీకరించగలరా అని ప్రశ్నిస్తే..అదిగో రాజ్యంగాన్ని అవమానిస్తున్నారంటూ ఆరోపిస్తూ..బీజేపీ వితండ వాదన చేస్తోందన్నారు. న్యాయవ్యవస్తను సైతం బీజేపీ నియంత్రించడానికి ప్రయత్నించింది కానీ అదృష్టవశాత్తు న్యాయవ్యవస్థ అందుకు అంగీకరించ లేదన్నారు. లేదంటే ఇజ్రాయెల్‌ మాదిరి పరిస్థితి మన దేశంలో కూడా తల్లెత్తేది అంటూ బీజేపీకి గట్టి కౌంటరిచ్చారు. 

(చదవండి: శ్రీ రామనవమి శోభా యాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ ఎమ్మెల్యేకి గాయాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement