ఒక్క ఫేస్‌బుక్ పోస్టుకు 3.4 కోట్ల లైకులు! | How Modi government is faring on Facebook? | Sakshi
Sakshi News home page

ఒక్క ఫేస్‌బుక్ పోస్టుకు 3.4 కోట్ల లైకులు!

Published Thu, May 26 2016 6:16 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

ఒక్క ఫేస్‌బుక్ పోస్టుకు 3.4 కోట్ల లైకులు! - Sakshi

ఒక్క ఫేస్‌బుక్ పోస్టుకు 3.4 కోట్ల లైకులు!

న్యూఢిల్లీ: నేటితో రెండేళ్ల పాలన ముగిసిన సందర్భంగా.. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ద్వారా మోదీ ప్రభుత్వం తన ఎజెండాను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లారో కంపెనీ ఓ విశ్లేషణను వెలువరించింది. కేంద్ర మంత్రులందరూ ఏ, లైవ్, ఇన్‌స్టంట్ ఆర్టికల్స్, నోట్స్ తదితరాలను గత ఏడాదిగా విరివిరిగా ఉపయోగించినట్లు తెలిపింది. 2014లో మే 26 నుంచి 2016 మే 23 వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టులలో తన తల్లితో పెట్టిన పోస్టుకు అత్యధికంగా 34,047,024 లైక్స్ వచ్చినట్లు వివరించింది.

డిజిటల్ ఇండియా ఇనీషియేటివ్స్ గా ఫేస్‌బుక్ సీఈవో ను కలిసిన పోస్ట్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్ లతో ఉన్న పోస్టులు తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వంలో ఉన్న 50 మంది కేబినెట్ మంత్రుల అకౌంట్లలో 47 అకౌంట్లు ఫేస్ బుక్ వెరిఫై చేసినవేనవి చెప్పింది. లైక్స్, షేర్స్, కామెంట్స్, యావరేజ్, డైలీ పోస్టులు, పేజీ సైజు తదితారాల ఆధారంగా 10 మంది కేంద్రమంత్రులకు ర్యాంకులను ప్రకటించింది.

ర్యాంకుల వివరాలు

1.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
2.కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
3. మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ
4. ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ
5. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్
6. విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్
7. కమ్యూనికేషన్స్ మంత్రి రవి శంకర్ ప్రసాద్
8. రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
9. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు
10. మాజీ క్రీడాశాఖ మంత్రి, అసోం ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్

తర్వాతి స్థానాల్లో మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్, సమాచార ప్రసారశాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ తదితరులు ఉన్నారు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన అనురాగ్ ఠాకూర్, స్మృతీ ఇరానీలు ఫేస్ బుక్ లైవ్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ప్రజలకు చేరువవుతున్నట్లు కంపెనీ వివరించింది. ప్రధానమంత్రి మోదీ వెబ్ సైట్ నరేంద్రమోదీ.ఇన్ ఫేస్ బుక్ లైవ్ ద్వారా ప్రజలను చేరినట్లు చెప్పింది.

ఈ వెబ్ సైట్ ద్వారా ప్రచురితమైన పోస్టులను ఫేస్‌బుక్ వీక్షకులు లక్షలసంఖ్యలో చూస్తున్నట్లు తెలిపింది. టూరిజం, వ్యవసాయం, డిజిటల్ ఇండియా, రైల్వేలు, మహిళ సంక్షేమం, సాధికారత, ఆర్ధిక రంగం, డిఫెన్స్, ఆయుష్ తదితరాలను ప్రధాని వెబ్ సైట్ తరచు పోస్టు చేసినట్లు తెలిపింది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా పథకాలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన ఉంటోందని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement