విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మురళీయాదవ్
- టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్
నారాయణఖేడ్: రెండేళ్లలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని, ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు సరికాదని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ తెలిపారు. ఆదివారం నారాయణఖేడ్ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లన్నసాగర్ నిర్మాణం పూర్తయితే ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు.
సింగూరు ప్రాజెక్టులో సైతం నీరు నింపేలా ప్రభుత్వం ప్రణాళికలు తయారుచేసిందన్నారు. చెరువులు నిండితే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇతర రాష్ట్రాలు నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్.. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబాకర్, మార్కెట్ యార్డుల నిర్మాణం, రహదారులు, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
నారాయణఖేడ్ నియోజకవర్గం సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సమావేశంలో సర్పంచ్ అప్పారావుషెట్కార్, గొర్రెలకాపరుల సహకార సంఘం జిల్లా చైర్మన్ మల్‌శెట్టి యాదవ్, జెడ్పీటీసీలు నిరంజన్, రవి, టీఆర్‌ఎస్ నాయకులు పండరియాదవ్, మూఢ రామకృష్ణ, పురంజన్, బాసిత్, వెంకట్‌నాయక్, రవీందర్‌నాయక్ ఉన్నారు.
మొక్కలు నాటిన మురళీయాదవ్
నారాయణఖేడ్‌లోని చేనేత సహకార సంఘం భవనం వద్ద టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, సర్పంచ్ అప్పారావుషెట్కార్, టీఆర్‌ఎస్ ఖేడ్ అధ్యక్షుడు ప్రభాకర్ మొక్కలు నాటారు.